వడివడి అడుగులు | SPEED STEPS | Sakshi
Sakshi News home page

వడివడి అడుగులు

Published Sat, May 27 2017 1:03 AM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM

వడివడి అడుగులు

వడివడి అడుగులు

తాడేపల్లిగూడెం : జిల్లాలోని ఏలూరు ప్రధాన కాలువ మీదుగా జల రవాణాను పునరుద్ధరించే ప్రక్రియ ఊపందుకుంటోంది. ఈ కాలువను విస్తరించేందుకు ఏ మేరకు భూములు అవసరమవుతాయనే దానిపై ఇప్పటికే ప్రాథమిక సర్వే పూర్తి చేసిన కేంద్ర జల రవాణా విభాగం భూసేకరణ దిశగా అడుగులు వేస్తోంది. ఏలూరు కాలువ వెంబడి ఎక్కడెక్కడ ఎంత భూమిని సేకరించాలనే విషయంపై ఓ నిర్ణయానికి వచ్చింది. భూసేకరణకు సంబంధించి శనివారం నుంచి సర్వే చేపట్టబోతోంది.
 
8 మండలాలు.. 37 గ్రామాల్లో..
ఏలూరు ప్రధాన కాలువను జల రవాణాకు వీలుగా వెడల్పు చేసేందుకు జిల్లాలో 8 మండలాల పరిధిలోని 37 గ్రామాల్లో 2,547.13 ఎకరాల భూమి వడివడి అడుగులు అవసరమవుతుందని నిర్థారించారు. రైతుల నుంచి ఆయా భూములను సేకరించనున్నారు. విజయవాడలోని జల రవాణా కార్యాలయ అధికారులు, సర్వే పనులు చేపట్టే ఎక్సెల్‌ కంపెనీ ప్రతినిధులు సర్వే కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇప్పటికే ఇరిగేషన్‌ అధికారులతో సమావేశమై కాలువకు సంబంధించిన వివరాలు, భూముల పరిస్థితి తదితర అంశాలపై చర్చించారు. ముందస్తుగా సమాచారం సేకరించి సర్వే అధికారులకు అప్పగించనున్నారు. సర్వేలో పాల్గొనేందుకు తహసీల్దార్లు, సర్వేయర్లను అందుబాటులో ఉండాలని ఇప్పటికే కోరారు. 
 
గ్రామాల వారీగా సేకరించే భూములిలా
కొవ్వూరు మండలం : మద్దూరులో 104.94 ఎకరాలు
నిడదవోలు మండలం : విజ్జేశ్వరంలో 52.83, గోపవరంలో 49.28, నిడదవోలులో 210.34, ఆట్లపాడులో 26.18, శెట్టిపేటలో 131.93 ఎకరాలు (మొత్తం 470.57 ఎకరాలు)
తాడేపల్లిగూడెం మండలం : నందమూరులో 80.79, ఆరుళ్లలో 89.04, నవాబ్‌పాలెంలో 101.21, ఆరుగొలనులో 34.43, కుంచనపల్లిలో 0.11, తాడేపల్లిగూడెం పట్టణంలో 47.69, కడకట్లలో 60.15, తాడేపల్లిలో 54.57 ఎకరాలు (మొత్తం 467.98 ఎకరాలు)
పెంటపాడు మండలం : ప్రత్తిపాడులో 102.28, దర్శిపర్రులో 50.32 ఎకరాలు (మొత్తం 152.60 ఎకరాలు)
ఉంగుటూరు మండలం : బాదంపూడిలో 88.40, వెల్లమిల్లిలో 32.23, ఉంగుటూరులో 129.06, చేబ్రోలులో 38.52, చేబ్రోలు ఖండ్రికలో 35.61, కైకరంలో 79.49 ఎకరాలు (మొత్తం 403.31 ఎకరాలు)
భీమడోలు మండలం : కొండ్రుపాడులో 50.16, పూళ్లలో 55.11, అంబర్‌పేటలో 44.58, భీమడోలులో 192.16, సూరప్పగూడెంలో 63.13, గుండుగొలనులో 43.34 ఎకరాలు (మొత్తం 448.47 ఎకరాలు)
దెందులూరు మండలం : సింగవరంలో 95.86, కొమిరిపల్లిలో 4.04, పోతునూరులో 40.10, కొవ్వలిలో 4.52, దెందులూరులో 204.67 ఎకరాలు (మొత్తం 349.19 ఎకరాలు)
ఏలూరు మండలం : మల్కాపురంలో 115.09, కొమడవోలులో 34.96 ఎకరాలు (మొత్తం 150.15 ఎకరాలు)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement