హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కో–వర్కింగ్ స్పేస్ రంగంలో ఉన్న ఇంటర్నేషనల్ వర్క్ ప్లేస్ గ్రూప్ (ఐడబ్ల్యూజీ) దేశంలో విస్తరణ బాట పట్టింది. ప్రస్తుతం 110 దేశాల్లో 3,300 కో–వర్కింగ్ స్పేస్ స్టేషన్లున్న ఐడబ్ల్యూజీకి మన దేశంలో 16 నగరాల్లో 120 కార్యాలయాలున్నాయి. వచ్చే 36–48 నెలల్లో 240 కార్యాలయాలకు విస్తరించాలని లకి‡్ష్యంచింది. వీటిల్లో ప్రస్తుతం హైదరాబాద్‌లో 8 కో–వర్కింగ్ కార్యాలయాలున్నాయని.. వీటిని 20కి చేర్చాలన్నది లక్ష్యమని ఐడబ్ల్యూజీ కంట్రీ మేనేజర్ హర్‡్ష లాంబ్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా 230 మిలియన్ పౌండ్ల పెట్టుబడులు పెట్టనున్నామని.. ఇందులో సింహా భాగం పెట్టుబడులు ఇండియాలోనే ఉంటాయని ఆయన పేర్కొన్నా రు. హైదరాబాద్‌లో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ వెకెన్సీ స్థాయి చాలా తక్కువగా ఉందని.. ఇదే కో–వర్కింగ్ స్పేస్‌కు డిమాండ్‌కు కారణమని చెప్పారు. వచ్చే నెలలో నగరంలో 60 వేల చదరపుటడుగుల్లో 500 సీటింగ్ సామర్థ్యంతో కో–వర్కింగ్ స్పేస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నామని తెలిపారు. ప్రస్తుతం ఐడబ్ల్యూజీకి 25 లక్షల కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. మన దేశంతో పాటూ 100కు పైగా కో–వర్కింగ్ స్టేషన్లు జపాన్, చైనా, ఆస్ట్రేలియాలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment