న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎమ్‌లను, బ్రాంచీలను జోరుగా విస్తరిస్తోంది. రిటైల్ కార్యకలాపాల వ్యాపార వృద్ధి కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 కొత్త బ్రాంచ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఐసీఐసీఐ సీఈఓ, ఎండీ చందా కొచర్ చెప్పారు. అంతేకాకుండా 1,000కి పైగా కొత్త ఏటీఎమ్‌లను కూడా ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. రిటైల్ బ్యాంకింగ్‌కు విస్తృతమైన బ్రాంచ్ నెట్‌వర్క్ కీలకమని అందుకే కొత్తగా బ్రాంచీలను, ఏటీఎమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
విస్తృతమైన బ్రాంచ్ నెట్‌వర్క్ ఉన్న బ్యాంక్‌లకే ఖాతాదారులు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైందని పేర్కొన్నారు. తమ ఏటీఎమ్‌లు మినీ బ్రాంచ్‌లుగా పనిచేస్తున్నాయని చందా కొచర్ వివరించారు. ఈ ఏడాది మార్చి నాటికి ఐసీఐసీఐ బ్యాంక్‌కు 4,450 బ్రాంచ్‌లు, 13,766 ఏటీఎమ్‌లు ఉన్నాయి.
జోరుగా ఐసీఐసీఐ బ్యాంక్ విస్తరణ...
Published Mon, Jul 4 2016 1:14 AM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM
Advertisement
Advertisement