సాక్షి, హైదరాబాద్: నగరానికే తలమానికమైన వారసత్వ సంపద ‘కుతుబ్ షాహీ సమాధుల’ను డిజిటల్ వేదికపై పరిరక్షించడంలో ముందుకు సాగుతున్నామని హెగ్జాగోనల్ రియాలిటీ టెక్నాలజీ సీఈఓ పాలో గుగ్లియెలి్మని తెలిపారు. కుతుబ్ షాహీ టూంబ్స్ డేటా–రిచ్ డిజిటల్ ట్విన్ కోసం హెగ్జాగోనల్ ఆధ్వర్యంలో రియాలిటీ టెక్నాలజీ నేపథ్యంలో మంగళవారం కుతుబ్ షాహీ సమాధుల వేదికగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాలో గుగ్లియెల్మిని మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీ టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి, అధునాతన డిజిటల్ ఆవిష్కరణలతో చారిత్రాత్మక ల్యాండ్‌మార్క్‌ల సంరక్షణకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామన్నారు. నగరంలోని గత చరిత్రకు చెందిన అద్భుత ఆనవాళ్లను రక్షించడానికి రియాలిటీ టెక్నాలజీ వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. డిజిటల్–రియాలిటీ వేదిక డేటా– రిచ్ యాక్షన్ డిజిటల్ ట్విన్‌ను అనుసంధానం చేయడానికి అధునాతన ఏఐ పరిష్కారాలను వర్తింపజేశామని హెగ్జాగోనల్ ఆర్‌అండ్‌డీ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవనీత్ మిశ్రా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment