సాక్షి,హైదరాబాద్: డిజిటల్ బ్రోకరేజి సంస్థ అప్‌స్టాక్స్ (ఆర్‌కెఎస్‌వి సెక్యూరిటీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని కూడా పిలుస్తారు)తాజాగా ఆన్‌లైన్ విధానంలో పసిడిలో పెట్టుబడులు పెట్టేందుకు డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. దీని ద్వారా అప్‌స్టాక్స్ కస్టమర్లు ఇప్పుడు 24 క్యారెట్ల డిజిటల్ బంగారాన్ని, 99.9శాతం స్వచ్ఛత గల మేలిమి బంగారాన్ని ప్రత్యక్ష మార్కెట్ రేట్లకే కొనుగోలు చేయొచ్చని సంస్థ సీఈవో రవి కుమార్ తెలిపారు. కావాలంటే భౌతిక రూపంలో నాణాలు, కడ్డీలుగా మార్చుకోవచ్చని లేదా వాల్ట్‌లో భద్రపర్చుకోవచ్చని పేర్కొన్నారు. ఈ లావాదేవీలన్నీ పూర్తిగా డిజిటల్‌గా ఉంటాయని రవి కుమార్ తెలిపారు. అత్యంత స్వల్పంగా 0.1 గ్రాము పరిమాణంలో పసిడిని కూడా కూడా దేశవ్యాప్తంగా ఉచిత రవాణా బీమాతో అందించనున్నట్లు ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment