Online buyers
-
పసిడి బాండ్ ధర @ రూ. 4,732
ముంబై: సావరీన్ గోల్డ్ బాండ్ స్కీము తదుపరి విడత ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 3న ముగుస్తుంది. దీనికోసం బంగారం ధరను గ్రాముకు రూ. 4,732గా నిర్ణయించినట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. ఆన్లైన్లో కొనుగోలు చేసేవారికి గ్రాముపై రూ. 50 డిస్కౌంటు లభిస్తుంది. ఈ ఏడాది మే–సెప్టెంబర్ మధ్యలో ఆరు విడతలుగా పసిడి బాండ్లను జారీ చేయాలని కేంద్రం నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఆరో విడత బాండ్ల విక్రయ ప్రక్రియ ప్రారంభం కానుంది. బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌హెచ్‌సీఐఎల్), నిర్దేశిత పోస్టాఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈల ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం తరఫున గోల్డ్ బాండ్లను రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తుంది. 2015 నవంబర్‌లో పసిడి బాండ్ల విక్రయం ప్రారంభించినప్పట్నుంచి ఈ ఏడాది మార్చి ఆఖరు నాటి దాకా ప్రభుత్వం రూ. 25,702 కోట్లు సమీకరించింది. 2020–21లో 12 విడతలుగా రూ. 16,049 కోట్ల విలువ జేసే బాండ్లను ఆర్బీఐ జారీ చేసింది. -
మేలిమి బంగారం కొనాలనుకుంటున్నారా?
సాక్షి,హైదరాబాద్: డిజిటల్ బ్రోకరేజి సంస్థ అప్‌స్టాక్స్ (ఆర్‌కెఎస్‌వి సెక్యూరిటీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని కూడా పిలుస్తారు)తాజాగా ఆన్లైన్ విధానంలో పసిడిలో పెట్టుబడులు పెట్టేందుకు డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. దీని ద్వారా అప్‌స్టాక్స్ కస్టమర్లు ఇప్పుడు 24 క్యారెట్ల డిజిటల్ బంగారాన్ని, 99.9శాతం స్వచ్ఛత గల మేలిమి బంగారాన్ని ప్రత్యక్ష మార్కెట్ రేట్లకే కొనుగోలు చేయొచ్చని సంస్థ సీఈవో రవి కుమార్ తెలిపారు. కావాలంటే భౌతిక రూపంలో నాణాలు, కడ్డీలుగా మార్చుకోవచ్చని లేదా వాల్ట్‌లో భద్రపర్చుకోవచ్చని పేర్కొన్నారు. ఈ లావాదేవీలన్నీ పూర్తిగా డిజిటల్‌గా ఉంటాయని రవి కుమార్ తెలిపారు. అత్యంత స్వల్పంగా 0.1 గ్రాము పరిమాణంలో పసిడిని కూడా కూడా దేశవ్యాప్తంగా ఉచిత రవాణా బీమాతో అందించనున్నట్లు ఆయన వివరించారు. -
ఎఫ్‌డీఐల సంస్థలకూ...ఆన్లైన్లో విక్రయ అనుమతులపై కసరత్తు
న్యూఢిల్లీ: భారత్‌లో తయారీ యూనిట్లున్న దేశీ, విదేశీ కంపెనీలు ఆన్లైన్లో కొనుగోలుదారులకు నేరుగా ఉత్పత్తులు విక్రయించుకునే వెసులుబాటు కల్పించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై కేంద్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) ఈ ప్రతిపాదనను ఉద్దేశించినట్లు వివరించారు. ఇప్పుడున్న ఎఫ్‌డీఐ విధానం ప్రకారం ఈకామర్స్కి సంబంధించి బిజినెస్2బిజినె స్ విభాగంలో మాత్రమే ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. బిజినెస్2కన్జూమర్ విభాగంలో అనుమతి లేదు.