సాక్షి, హైదరాబాద్: కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన రైల్వే స్టేషన్‌లో ఒకే చోట ఎక్కువ రద్దీ ఏర్పడకుండా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పక్కపక్క ప్లాట్‌ఫామ్స్‌లోకి ఒకేసారి మూడు, నాలుగు రైళ్లు వచ్చే వేళల్లో కొన్ని రైళ్లను దూరంగా ఉన్న వేరే ప్లాట్‌ఫామ్స్‌లోకి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. తొలుత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దీన్ని అమలు చేస్తున్నారు.
ఈనెల 12 (నేటి) నుంచి 21 వరకు మూడు ప్రధాన రైళ్లలో ఈ మార్పులు చేశారు. హైదరాబాద్–విశాఖపట్టణం గోదావరి ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ 1కి బదులు ప్లాట్‌ఫామ్ 10 నుంచి బయల్దేరుతుంది. లింగంపల్లి–కాకినాడ పోర్టు గౌతమి ఎక్స్‌ప్రెస్ కూడా ప్లాట్‌ఫామ్ 1కి బదులు 10 నుంచి బయల్దేరుతుంది. ఇక హజ్రత్ నిజాముద్దీన్ బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ నెం 10 నుంచి కాకుండా ప్లాట్‌ఫామ్ 1 నుంచి బయల్దేరుతుంది. కాగా, సికింద్రాబాద్ స్టేషన్‌లో మాస్కులు ధరించని 169 మంది నుంచి రూ.34,100ను పెనాల్టీగా వసూలు చేశారు. ( సంక్రాంతి రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో జన సాధారణ రైళ్లు)
Comments
Please login to add a commentAdd a comment