24 Wae Images Set Up On The Platform: ఉక్రెయిన్ పై రష్యా నిరవధిక పోరు కొనసాగిస్తునే ఉంది. రష్యా ఏ మాత్రం తగ్గేదేలే అంటూ ఉక్రెయిన్ పై బాంబుల మోత మోగిస్తూనే ఉంది. ప్రత్యేక సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌ని అల్లకల్లోలం చేస్తోంది. దీంతో లక్షలాది మంది ఉక్రెయిన్‌ని విడిచి వలస వెళ్లగా..వేలాది మంది పౌరులు ఈ యుద్ధంలో విగత జీవులుగా మారారు. మరోవైపు ఉక్రెయిన్ కూడా ఏ విధంగానైనా రష్యా దురాక్రమణకు అడ్డుకట్టే వేసేలా తనదైన శైలిలో శతవిధాల ప్రయత్నిస్తోంది.
అందులో భాగంగానే ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు దాడులతో ఏ విధంగా విరుచుకుపడుతున్నయో వివరించే చిత్రాల ప్రదర్శనను లిథువేనియాలోని రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసింది. లిథువేనియా, ఐరోపా సమాఖ్య, రష్యా ప్రత్యేక ఏర్పాటు ప్రకారం బాల్టిక్ రాష్ట్రం నెలకు 100 రైళ్లను కాలినిన్‌గ్రాడ్ ఎక్స్‌క్లేవ్ నుంచి రష్యన్ ప్రయాణీకులను రవాణా చేయడానికి అనుమతిస్తుంది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైనప్పటీ నుంచి రష్యాకు వ్యతిరేకంగా విమాన ప్రయాణంపై అనేక ఆంక్షలు ఉన్నాయి. అయినప్పటికీ లుథువేనియాలో ఈ రవాణా ఏర్పాటు కొనసాగుతూనే ఉంది.
అయితే లిథువేనియన్ రాజధాని విల్నియస్‌లోని రైల్వే స్టేషన్‌లో ఈయూ ప్రయాణీకులు రైలు నుంచి దిగడానికి అనుమతి ఉంది కానీ రష్యన్ ప్రయాణీకులకు లేదు. ఈ మేరకు రష్యాన్ ప్రయాణికులకు పుతిన్ దురాగతాలు తెలిసేలే ఉక్రెయిన్ అధికారులు యుద్ధానికి సంబంధించిన దాదాపు 24 చిత్రాలను లిథువేనియా రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ట్‌పారమ్‌పై ఏర్పాటు చేశారు. పైగా ఆ చిత్రాలను క్యారేజ్ కిటికిల ఎత్తులో ఏర్పాటు చేశారు. అంతేకాదు ఆ చిత్రాలలో శాంతియుత దేశంలోని జనాభా పై దాడులు నిర్వహించి గాయపరిచారు, మా ప్రజల స్వేచ్ఛ యుత జీవనానికి భంగం కలిగించారు వంటి సందేశాలు కూడా ఉన్నాయని లిథువేనియన్ ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ క్లబ్ అధిపతి జోనాస్ స్టాసెలిస్ అన్నారు.
నిజానికి ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణను ఖండిస్తూ..రష్యన్ వాసులు రోడ్ల పైకి వచ్చి నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. అంతేగాక ఇటీవల ఒక రష్యన్ టీవీ ఛానల్‌లో న్యూస్ రీడర్ వెనుక ఒక జర్నలిస్ట్ యుద్ధానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని రావడంతో ఆమెను రష్యా అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు కూడా. ఈ మేరకు పుతిన్‌కి సొంత దేశంలోనే పూర్తి వ్యతిరేకత వచ్చేలా ఉక్రెయిన్ తనదైన వ్యూహంతో పావులు కదుపుతోంది.
(చదవండి: ఫస్ట్ స్టేజ్ మిలటరీ ఆపరేషన్ ఫినిష్... అదే మా లక్ష్యం!)
Comments
Please login to add a commentAdd a comment