![Woman Stuck Between Train And Platform At Chirala Railway Station - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/29/chirala-railway-station.jpg.webp?itok=I5b1fjpV)
చీరాల అర్బన్: రైలు ఎక్కే క్రమంలో ఓ మహిళ రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఇరుక్కుపోయింది. రైల్వే పోలీసులు స్పందించి ఆమె ప్రాణాలు కాపాడారు. శుక్రవారం బాపట్ల జిల్లా చీరాల రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. నెల్లూరు జిల్లా కరేడు గ్రామానికి చెందిన తిరుపతమ్మ, ఆమె భర్త ఇద్దరూ ఉలవపాడు వెళ్లేందుకు తెనాలిలో విజయవాడ–గూడూరు మెమూ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. రైలు చీరాల వచ్చేసరికి మరుగుదొడ్ల కోసం రైలు నుంచి ఆమె కిందకు దిగింది.
అనంతరం రైలు కదలడంతో హడావుడిగా కదులుతున్న రైలు ఎక్కింది. ఈ క్రమంలో రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఆమె ఇరుక్కుపోయింది. వెంటనే అక్కడ జీఆర్పీ, ఆరీ్పఎఫ్ కానిస్టేబుళ్లు కోటేశ్వరరావు, నాగార్జున ఇద్దరూ కలిసి తోటి ప్రయాణికుల సాయంతో అతి కష్టం మీద బయటకు తీశారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే 108లో చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. సుమారు 50 నిమిషాల పాటు రైలును నిలిపివేశారు.
ఇది కూడా చదవండి: వందే భారత్ రైలుపై రాళ్లదాడి..
Comments
Please login to add a commentAdd a comment