సాక్షి, హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే మహిళా రైల్వేస్టేషన్‌కు శ్రీకారం చుట్టింది. మహిళా ఉద్యోగుల శక్తి సామర్థ్యాలను ప్రోత్సహించేందుకు, వారిలోని ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతలను పెంపొందించేందుకు ప్రత్యేక స్టేషన్‌లపై దృష్టి సారించింది. గురువారం(8న) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బేగంపేట్ రైల్వేస్టేషన్‌ను ‘మహిళా ఉద్యోగుల రైల్వేస్టేషన్’గా ప్రకటించనున్నట్లు సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు.
బేగంపేట్‌లో 8 మంది కమర్షియల్ ఉద్యోగులు, నలుగురు అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్లు, మరో ఆరుగురు పాయింట్స్ ఉమెన్, ఇద్దర్ ఆర్‌పీఎఫ్ మహిళా పోలీసులను నియమించనున్నట్లు సీపీఆర్వో పేర్కొన్నారు. వీరు రైల్వేస్టేషన్ నిర్వహణ, టిక్కెట్ బుకింగ్, ప్రయాణికుల భద్రత తదితర కార్యకలాపాలను ని ర్వహిస్తారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో ఇప్పటికే చంద్రగిరి స్టేషన్‌ను మహిళా ఉద్యోగుల రైల్వేస్టేషన్‌గా అభివృద్ధి చేశారు. త్వరలో ఫిరంగిపురం స్టేషన్ కూడా మహిళా ఉద్యోగుల రైల్వేస్టేషన్‌గా మారనుంది.
Comments
Please login to add a commentAdd a comment