CPRO Uma Shankar Kumar
-
మహిళా రైల్వేస్టేషన్‌గా బేగంపేట్
సాక్షి, హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే మహిళా రైల్వేస్టేషన్‌కు శ్రీకారం చుట్టింది. మహిళా ఉద్యోగుల శక్తి సామర్థ్యాలను ప్రోత్సహించేందుకు, వారిలోని ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతలను పెంపొందించేందుకు ప్రత్యేక స్టేషన్లపై దృష్టి సారించింది. గురువారం(8న) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బేగంపేట్ రైల్వేస్టేషన్‌ను ‘మహిళా ఉద్యోగుల రైల్వేస్టేషన్’గా ప్రకటించనున్నట్లు సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. బేగంపేట్‌లో 8 మంది కమర్షియల్ ఉద్యోగులు, నలుగురు అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్లు, మరో ఆరుగురు పాయింట్స్ ఉమెన్, ఇద్దర్ ఆర్పీఎఫ్ మహిళా పోలీసులను నియమించనున్నట్లు సీపీఆర్వో పేర్కొన్నారు. వీరు రైల్వేస్టేషన్ నిర్వహణ, టిక్కెట్ బుకింగ్, ప్రయాణికుల భద్రత తదితర కార్యకలాపాలను ని ర్వహిస్తారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో ఇప్పటికే చంద్రగిరి స్టేషన్‌ను మహిళా ఉద్యోగుల రైల్వేస్టేషన్‌గా అభివృద్ధి చేశారు. త్వరలో ఫిరంగిపురం స్టేషన్ కూడా మహిళా ఉద్యోగుల రైల్వేస్టేషన్‌గా మారనుంది. -
వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో పలు రైళ్ల రద్దు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో పొగమంచు కారణంగా రద్దు కానున్న రైళ్ల వివరాలకు దక్షిణ మధ్య రైల్వే సోమవారం ప్రకటించింది. వివిధ మార్గాల్లో అడ్వాన్స్ రిజర్వేషన్లు బుక్ చేసుకొనే ప్రయాణికులకు ముందస్తు సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చింది. 2016 జనవరి 8వ తేదీ నుంచి ఫిబ్రవరి 29 వరకు రద్దు కానున్న రైళ్ల వివరాలను సీపీఆర్వో ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ మేరకు సికింద్రాబాద్-పట్నా(12791/12792) ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ నుంచి జనవరి 10, 14, 17, 21, 24, 28, 31 తేదీల్లో, ఫిబ్రవరి 4, 7, 11, 14, 18, 21, 28 తేదీల్లో రద్దవుతుంది. పట్నా నుంచి జనవరి 9, 12, 16, 19, 23, 26, 30, ఫిబ్రవరి 2, 6, 9, 13, 16, 20, 23, 27 తేదీల్లో రద్దు కానుంది. హైదరాబాద్-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ (12723/12724) హైదరాబాద్ నుంచి జనవరి 13, 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో, ఢిల్లీ నుంచి జనవరి 14, 21, 28 తేదీల్లో, ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో రద్దు కానుంది. హైదరాబాద్-హజ్రత్ నిజాముద్దీన్(12721/12722) ఎక్స్‌ప్రెస్ జనవరి 11, 18, 25, ఫిబ్రవరి 1, 8, 15, 22, 29 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో జనవరి 13, 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో రద్దు కానుంది. విశాఖపట్నం-కాజీపేట్ (12861/12862) ఎక్స్‌ప్రెస్ జనవరి 11, 18, 25 ఫిబ్రవరి 1, 8, 15, 22, 29 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో జనవరి 15, 22, 29, ఫిబ్రవరి 5, 12, 19, 26 తేదీల్లో రద్దు కానుంది. పలు రైళ్లకు అదనపు హాల్టింగ్ సికింద్రాబాద్-డానాపూర్ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌కు ఈ నెల 10వ తేదీ నుంచి బిహార్‌లోని ఆరా రైల్వేస్టేషన్లో 2 నిమిషాలపాటు హాల్టింగ్ కల్పించనున్నారు. సికింద్రాబాద్ నుంచి వెళ్లేటప్పుడు సాయంత్రం 5.32 గంటలకు, తిరిగి వచ్చేటప్పుడు మధ్యాహ్నం 12.57 గంటలకు ఆరా స్టేషన్లో ఆగనుంది. -
పుష్కరాలకు 200 ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు మరో 200 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ గురువారం తెలిపారు. ఇదివరకు 130 రైళ్లను కేటాయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నాందేడ్-నిజామాబాద్ (07818) ప్రత్యేక రైలు ఈ నెల 17, 24 తేదీల్లో తెల్లవారుజామున 2 గంటలకు నాందేడ్ నుంచి బయలుదేరి అదే రోజు ఉదయం 3.45కి బాసర, 4.30కి నిజామాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో నిజామాబాద్-ఆదిలాబాద్ (07819) రైలు ఈ నెల 17, 24 తేదీల్లో ఉదయం 5.30కి నిజామాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 11కి ఆదిలాబాద్ చేరుతుంది. ఆదిలాబాద్-నిజామాబాద్ (07820) ప్రత్యేక రైలు తిరిగి అదేరోజు మధ్యాహ్నం 12.30కి ఆదిలాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం 5.28కి బాసర, 6.15కి నిజామాబాద్ చేరుతుంది. నిజామాబాద్-నాందేడ్ (07821) సాయంత్రం 7.50కి నిజామాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 8.28కి బాసర, 10.30కి నాందేడ్ చేరుతుంది. నాందేడ్-నిజామాబాద్-ఆదిలాబాద్ (07822/07823) స్పెషల్ ట్రైన్ ఈ నెల 18, 25 తేదీల్లో రాత్రి 11కి నాందేడ్ నుంచి బయలుదేరి రాత్రి 12.47కి బాసరకు, తెల్లవారు జామున 1.30కి నిజామాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో తెల్లవారు జామున 2కి నిజామాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 3.15కి బాసరకు, 8.30కి ఆదిలాబాద్ చేరుతుంది. ఆదిలాబాద్-నిజామాబాద్-నాందేడ్ (07824/07825) స్పెషల్ ట్రైన్ ఈ నెల 18, 25 తేదీల్లో ఉదయం 10కి ఆదిలాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.25కి బాసరకు, సాయంత్రం 3.15కి నిజామాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 4.15కి నిజామాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం 7కి నాందేడ్‌కు చేరుతుంది. సికింద్రాబాద్-భద్రాచలం (07828/07829) స్పెషల్ ట్రైన్ ఈ నెల 19, 26 తేదీల్లో ఉదయం 11కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి అదేరోజు సాయంత్రం 5కి భద్రాచలం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 20, 27 తేదీల్లో సాయంత్రం 4.30కి భద్రాచలం నుంచి బయలుదేరి అదేరోజు రాత్రి 10.30కి సికింద్రాబాద్ చేరుతుంది. సికింద్రాబాద్-మంచిర్యాల (07830/07831) ఈ నెల 13 నుంచి 26 వరకు ఉదయం 4.45కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి అదేరోజు ఉదయం 10కి మంచిర్యాల చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 13వ తేదీ నుంచి 26 వరకు సాయంత్రం 5.45కి మంచిర్యాల నుంచి బయలుదేరి రాత్రి 11.15కి సికింద్రాబాద్ చేరుతుంది. మంచిర్యాల-కాజీపేట్ (07832/07833) ఈ నెల 13 నుంచి 26 వరకు ఉదయం 11.10కి మంచిర్యాల నుంచి బయలుదేరి అదేరోజు మధ్యాహ్నం 1.40కి కాజీపేట్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.10 కి కాజీపేట్ నుంచి బయలుదేరి సాయంత్రం 4.45కి మంచిర్యాల చేరుతుంది.