హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ఉడ్ వర్క్ ఎగ్జిబిషన్‌కు బెంగళూరు వేదికయ్యింది. ‘ఇండియా వుడ్ 2016’ పేరుతో ఫిబ్రవరి 25 నుంచి 29 వరకు జరిగే ఈ ఎగ్జిబిషన్‌లో చెక్కతో చేసే ఫర్నిచర్, ఇతర గృహోపకరణాల తయారీలో వచ్చిన అత్యాధునిక టెక్నాలజీలను ప్రదర్శించనున్నారు. దేశీయ కంపెనీలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల నుంచి వివిధ సంస్థలు రూపొందించిన ఫర్నిచర్, యంత్రాలను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనలో సుమారు 700కు పైగా కంపెనీలు పాల్గొంటు న్నాయి. అత్యధికం తెలుగురాష్ట్రాలవే కావడం గమనార్హం.