
‘సిడ్బి స్టార్టప్ మిత్రా’
ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆన్‌లైన్ స్టార్టప్ ప్లాట్‌ఫామ్ ‘సిడ్బి స్టార్టప్ మిత్రా’ను గురువారం ఆవిష్కరించారు. ఆయన స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బి) నేతృత్వంలో రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఇన్నోవేషన్స్ ఫెస్టివల్ కార్యక్రమంలో మాట్లాడారు. సామాజిక-ఆర్థికాభివృద్ధిలో ఆవిష్కరణలు కీలకపాత్ర పోషిస్తాయని, వీటి వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు. ప్రభుత్వం అభివృద్ధే లక్ష్యంగా పలు రకాల కార్యక్రమాలను ప్రారంభించిందని, ఇది కూడా ఆ జాబితాలోకి వస్తుంద న్నారు. ఎంట్రప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్‌లో భాగంగా ఈ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసినట్లు సిడ్బి తెలిపింది. ఎంట్రప్రెన్యూర్లు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇంక్యుబేటర్స్, ఏంజిల్ ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ వంటి వివిధ భాగస్వాములతో అనుసంధానమై ఉండొచ్చని పేర్కొంది.