హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపారం, సేవలు దేనికైనా సరే ప్రచారం పకడ్బందీగా లేకపోతే సక్సెస్ కాలేవు. రేడియోల నుంచి మొదలైన ప్రచార సరళి కరపత్రాలు, పేపర్లు, టెలివిజన్ నుంచి సోషల్ మీడియాలోకి విస్తరించింది. ఇంటర్నెట్, మొబైల్ పుణ్యమా అని డిజిటల్ ప్రచారం జోరందుకుంది. నిజం చెప్పాలంటే ఆఫ్‌లైన్ కంటే ఆన్‌లైన్ వేదికగా ప్రచార ఉత్పత్తులు, సేవలు సక్సెస్ అయ్యే స్థాయికి చేరాయి. ఇలాంటి వేదికనే సరికొత్త వ్యాపారంగా ఎంచుకుంది అప్‌డేట్స్. మరిన్ని వివరాలు ఫౌండర్ జె. చైతన్య ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు.2016 జూలైలో విజయవాడ కేంద్రంగా అప్‌డేట్స్‌ను ప్రారంభించాం. టీవీ యాడ్స్‌తో మొదలుపెట్టి డిజిటల్ మీడియాలో ప్రచారానికి విస్తరించాం. సెలబ్రిటీలతో బ్రాండ్స్ ప్రారంభం నుంచి మొదలుపెడితే ప్రొడక్ట్స్ క్యాంపెయిన్, మార్కెటింగ్, క్రియేటివ్ విజువల్స్, యానిమేషన్స్, మోడలింగ్, యాడ్ ఫిల్మ్ తయారీ, రియాలిటీ షోలకు సంబంధించిన ప్రచార సేవలందిస్తాం.
సంస్థలతో ఒప్పందాలు
ప్రచార రంగంలో అన్ని విభాగాల్లో నిష్ణాతులైన నిపుణులను నియమించుకుంది. కార్యనిర్వాహకులు, కంటెంట్ రైటర్స్, ఫొటోగ్రాఫర్స్, లిరిసిస్ట్స్ సింగర్స్, మ్యూజిక్ కంపోజర్స్, ఆర్ట్ డైరెక్టర్స్, క్రియేటివ్ డైరెక్టర్స్, సినీ, టీవీ కళాకారులు, మోడల్స్ తదితర సిబ్బందిని నియమించుకున్నాం. వీరితో పాటు ఆడియో, వీడియో ప్రింటింగ్, ఫ్లెక్స్ ప్రింటింగ్ సేవలందించేందుకు ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం.
సోషల్ మీడియాలో ప్రచారం..
కమర్షియల్, కార్పొరేట్ క్లయింట్స్ ప్రచారం కూడా ఉంటుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్, ట్విట్టర్, మెసెంజర్, యూట్యూబ్, యాప్స్ వంటి సోషల్ మీడియాలో యాడ్స్‌ను రూపొందించి ప్రచారం చేస్తాం. ఏడాది ప్యాకేజీ కోసం చార్జీలు కోటి నుంచి 2 కోట్ల మధ్యలో ఉంటాయి. గతేడాది 245 మంది కార్పొరేట్ క్లయింట్లకు డిజిటల్ మార్కెట్ చేశాం. వచ్చే ఏడాదికి దేశవ్యాప్త విస్తరణతో పాటు 1500 క్లయింట్లకు సేవలను చేరుకోవాలన్నది మా లక్ష్యం.
ఎన్నికలకు ప్రత్యేక సేవలు..
దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వినూత్న రీతిలో ప్రచారం చేయడానికి సన్నాహాలు చేశాం. ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో మండలాల వారీగా ప్రజా స్పందన పసికట్టడానికి సుశిక్షితులైన, మెరికల్లాంటి యువకులను నమూనా సర్వేల కోసం నియమించుకున్నాం. ఫీడ్‌బ్యాక్‌లను విశ్లేషించడానికి నిష్ణాతులైన వ్యూహకర్తల బృందం ఉంది. ప్రస్తుతం 40 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు డిజిటల్ ప్రచార సేవలందిస్తున్నాం. చార్జీలు ఎన్నికల ముందు 25 రోజుల ప్యాకేజీకి రూ.5 లక్షలు – 20 లక్షలుంటుంది. డ్రోన్ ద్వారా ఓటర్ల నాడీ, స్థానిక పనుల తీరుతెన్నులు, విజయావకాశాలు ఎలా ఉన్నాయో వీడియోలతో సహా చిత్రీకరించి అభ్యర్థికి అందిస్తాం. ప్రచారంలో స్టార్ క్యాంపెయిన్ కోసం సినీ, టీవీ కళాకారులను కూడా అందిస్తాం.
రూ.75 కోట్ల టర్నోవర్ లక్ష్యం..
ప్రస్తుతం అప్‌డేట్స్‌లో 40 మంది శాశ్వత ఉద్యోగులు, ఫ్రిన్సాలర్స్ 300 మంది ఉద్యోగులున్నారు. గతేడాది రూ.10 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నాం. వచ్చే ఏడాది ముగింపు నాటికి రూ.75 కోట్ల టర్నోవర్‌ను లకి‡్ష్యంచాం. వచ్చే ఏడాది ముగింపు నాటికి కార్పొరేట్ క్లయింట్స్ సేవలను దేశవ్యాప్తంగా విస్తరిస్తామని చైతన్య తెలిపారు.
‘డిజిటల్ ప్రచార వేదిక.. ‘అప్‌డేట్స్’
Published Sat, Mar 23 2019 12:01 AM | Last Updated on Sat, Mar 23 2019 12:01 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment