చెన్నై: ‘కొత్త సీజన్‌లో కొత్త ‘పాత్ర’ పోషించేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’... మార్చి 4న సోషల్ మీడియాలో ధోని పెట్టిన పోస్ట్ ఇది! ఆ కొత్త పాత్ర ఏమిటనేది ఎవరూ ఊహించలేకపోయారు. కానీ మార్చి 21కి వచ్చేసరికే అదేంటో ధోని చూపించాడు. తాజా ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతల నుంచి ధోని తప్పుకున్నాడు. కెపె్టన్‌గా కాకుండా కేవలం ఆటగాడిగా అతను ఈ సీజన్ బరిలోకి దిగనున్నాడు.
ధోని స్థానంలో జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు సీఎస్‌కే యాజమాన్యం ప్రకటించింది. 42 ఏళ్ల ధోని 2008లో ఐపీఎల్ తొలి ఏడాది నుంచి చెన్నై కెపె్టన్‌గా వ్యవహరించాడు. మధ్యలో రెండేళ్లు జట్టు నిషేధానికి గురి కాగా... 2022 సీజన్‌లో రవీంద్ర జడేజా కెపె్టన్ అయ్యాడు. అయితే 8 మ్యాచ్‌ల తర్వాత తనవల్ల కాదంటూ జడేజా తప్పుకోవడంతో సీజన్ మధ్యలో మళ్లీ ధోని పగ్గాలు చేపట్టాడు.
ఐపీఎల్‌లో అతను మొత్తం 212 మ్యాచ్‌లలో కెపె్టన్‌గా వ్యవహరించగా... 128 మ్యాచ్‌ల్లో గెలిచి, 82 మ్యాచ్‌ల్లో ఓడిన చెన్నై 5సార్లు చాంపియన్ కావడంతో పాటు మరో 5సార్లు రన్నరప్‌గా నిలిచింది. మరో 23 చాంపియన్స్ లీగ్ మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేసిన అతను 2 టైటిల్స్ అందించాడు. 2023లో టైటిల్ గెలిచాక అదే ధోని ఆఖరి సీజన్ అనిపించింది. కెప్టెన్సీ కాకుండా ఆటగాడిగా అతని ప్రభావం దాదాపు శూన్యంగా మారింది. కానీ మోకాలి ఆపరేషన్ తర్వాత అతను మరోసారి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు.
అనుభవం లేకపోయినా...
మహారాష్ట్రకు చెందిన రుతురాజ్‌కు పెద్దగా కెప్టెన్సీ అనుభవం లేదు. సీనియర్ స్థాయిలో కేవలం 16 టి20 మ్యాచుల్లోనే అతను కెపె్టన్‌గా వ్యవహరించి 10 విజయాలు సాధించాడు. ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత జట్టుకు అతనే కెపె్టన్. అయితే ఓపెనర్ రూపంలో భారీగా పరుగులు సాధిస్తూ జట్టు విజయాల్లో అతను కీలకంగా మారాడు.
2020 సీజన్ నుంచి చెన్నై జట్టుతో ఉన్న రుతురాజ్ 52 మ్యాచ్‌లలో 135.52 స్ట్రయిక్‌రేట్‌తో 1797 పరుగులు సాధించాడు. రుతురాజ్ భారత్ తరఫున 6 వన్డేలు, 19 టి20లు ఆడాడు. 2022లో జడేజాను అనూహ్యంగా కెపె్టన్ చేయడంతో సమస్య వచ్చిందని, కానీ ఈసారి మార్పుకు తాము ముందే సిద్ధమయ్యామని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment