వీరు వర్సెస్‌ గంభీర్‌ | Virender Sehwag Takes A Dig At Former Teammate Gautam Gambhir | Sakshi
Sakshi News home page

వీరు వర్సెస్‌ గంభీర్‌

Published Fri, Apr 7 2017 5:42 PM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM

వీరు వర్సెస్‌ గంభీర్‌

వీరు వర్సెస్‌ గంభీర్‌

న్యూఢిల్లీ: భారత మాజీ దిగ్గజ ఒపెనర్లు, ఢిల్లీ సహచర ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతమ్‌ గంభీర్‌లు మంచి స్నేహితులు. కానీ ఐపీఎల్‌-10లో వీరిద్దరి మధ్య మాటల యుద్దం నడుస్తుంది. ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో ఆసక్తి చూపని ఇషాంత్‌ శర్మను  కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ జట్టు అత్యధిక ధరకు ఎంచుకోవడమే ఈ వివాదానికి కారణం. ఇషాంత్‌ను రూ.2 కోట్లకు పంజాబ్‌ జట్టు ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే.  ఈ ఎంపికలో కీలకపాత్ర పోషించిన పంజాబ్‌ కోచ్‌ సెహ్వాగ్‌ను కొల్‌కత కెప్టెన్‌ గంభీర్‌ తప్పుబట్టాడు. ఇషాంత్‌ ఎంపికకు కుదుర్చుకున్న ఒప్పందం ఐపీఎల్‌లో ఫాస్ట్‌ బౌలర్ల బేస్‌ ప్రైజ్‌ కన్న చాలా ఎక్కువని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. 4 ఓవర్లు వేసే బౌలర్లకు రూ.2 కోట్ల ఎవరు చెల్లించరని, ఈ ఒప్పందం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని గంభీర్‌ వ్యాఖ్యానించాడు.
 
కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ జెర్సీ లాంచ్‌ కార్యక్రమంలో ఈ విషయం పై సెహ్వాగ్‌ స్పందించాడు. 60 బంతులు ఎదుర్కునేవారికి రూ.12 కోట్లు అవసరమా అని సెహ్వాగ్‌ ప్రశ్నించాడు. 2011లో  కొల్‌కతా నైట్‌రైడర్స్‌ గంభీర్‌కు రూ.12 కోట్లు చెల్లించిది. ఐపీఎల్‌ తొలి సీజన్‌లో ఢిల్లీ డెర్‌డెవిల్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ ఆటగాళ్ల మధ్య ఐపీఎల్‌-10లో మాటల యుద్దం జరగడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ దిగ్గజ ఆటగాళ్ల జట్లు కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌, కొల్‌కతా నైట్‌రైడర్స్‌  ఏప్రిల్‌ 13న తలపడనున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement