Gambhir
-
‘ఇప్పటికే ఎక్కువైంది’
ఆ్రస్టేలియా పర్యటనలో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్న భారత క్రికెట్ జట్టుపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలైనా ఆశించిన ఫలితాలు రావడంలేదు. దాంతో ఇక కఠిన నిర్ణయాలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి. శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ కోల్పోవడం, స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ‘వైట్‌వాష్’కు గురవడం... తాజాగా ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీలో 1–2తో వెనుకంజలో ఉండటంపై గంభీర్ కోచింగ్ తీరుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇన్నాళ్లు జట్టు కోచ్‌గా ఆటగాళ్లు సహజ శైలిలో ఆడేందుకు స్వేచ్ఛనిచ్చిన కోచ్ గౌతమ్ గంభీర్ ‘ఇప్పటికే ఎక్కువైంది... ఇక చాలు’ అని ఆటగాళ్లకు ఘాటుగా హెచ్చరించినట్లు సమాచారం. సిడ్నీ: ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టును ‘డ్రా’ చేసుకోగలిగే స్థితిలో నిలిచిన టీమిండియా... చివర్లో చేతులెత్తేసి ఓడిపోవడంపై హెడ్ కోచ్ గంభీర్ ఆటగాళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రత్యేకంగా ఆటగాళ్ల పేర్లు తీసుకోకపోయినా... ఇకపై జట్టు అవసరాలకు తగ్గట్లు ఆడకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే ధోరణిలో గంభీర్ ప్లేయర్లకు క్లాస్ తీసుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. డ్రెస్సింగ్ రూమ్ చర్చలు బయటకు రాకపోవడమే జట్టుకు శ్రేయస్కరమని మాజీ ఆటగాళ్లు హితబోధ చేస్తుండగా... ధోనీ, విరాట్ కోహ్లి సారథిగా ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు బయటకు వచ్చేవి కావని పలువురు గుర్తు చేస్తున్నారు. వరుస వైఫల్యాలతో ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరే అవకాశాలను దాదాపు కోల్పోయిన భారత జట్టు... ఇక చివరిదైన సిడ్నీ టెస్టులోనైనా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంటుందా చూడాలి. ఆఖరి టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే సిరీస్ 2–2తో ‘డ్రా’ అయినా... గత సిరీస్‌లో విజేతగా నిలిచినందుకు ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ భారత్ వద్దే ఉంటుంది. వేడెక్కిన డ్రెస్సింగ్ రూమ్... ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేని సమయంలో జరిగిన తొలి టెస్టు (పెర్త్)లో చక్కటి ప్రదర్శన కనబర్చిన టీమిండియా... ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమైంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు, యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ జట్టులో లేకపోయినా... తాత్కాలిక సారథి జస్ప్రీత్ బుమ్రా జట్టును ముందుండి నడిపించాడు. రెండో టెస్టు నుంచి రోహిత్, గిల్ తుది జట్టులోకి రావడంతో టీమిండియా ప్రదర్శన మరింత మెరుగవుతుందనుకుంటే... నానాటికి దిగజారింది. ఆ తర్వాత ఆడిన మూడు టెస్టుల్లో భారత జట్టు రెండింట ఓడి ఒక దానిని ‘డ్రా’ చేసుకుంది. మెల్బోర్న్ టెస్టులో ఒకదశలో మెరుగైన స్థితిలో నిలిచి ఆ తర్వాత పేలవ ఆటతీరుతో ఓటమిని కోరి కొని తెచ్చుకుంది. స్టార్ బ్యాటర్ కోహ్లి మరోసారి తన బలహీనత కొనసాగిస్తూ ఆఫ్‌స్టంప్ అవతలి బంతిని వెంటాడి అవుట్ కాగా... రిషభ్ పంత్ రెండు ఇన్నింగ్స్‌లలో అనవసర షాట్లు ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. ఇక నిలకడగా ఆడిన యశస్వి జైస్వాల్ కూడా షాట్ సెలెక్షన్ లోపంతోనే వెనుదిరగగా... ఈ సిరీస్‌లో ఇటు సారథిగా, అటు బ్యాటర్‌గా విఫలమవుతున్న రోహిత్ శర్మ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. దీంతో మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లపై గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు సహజశైలిలో ఆడమని ప్రోత్సహించిన గంభీర్... జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇష్టారీతిన షాట్లు ఆడి అవుట్ కావడంపై పలువురు ఆటగాళ్లపై సీరియస్ అయినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. డ్రెస్సింగ్‌రూమ్‌లో పరిస్థితి అంతా సవ్యంగా లేదని... ఆటగాళ్లలో అనిశ్చితి నెలకొందనే వార్తలు బయటకు వస్తున్నాయి. పుజారా కోసం పట్టుబట్టినా... గత రెండు పర్యాయాలు ఆ్రస్టేలియా పర్యటనలో భారత జట్టు టెస్టు సిరీస్‌లు గెలవడంలో కీలక పాత్ర పోషించిన వన్‌డౌన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారాను ఈసారి కూడా జట్టులోకి తీసుకోవాలని గంభీర్ పట్టుబట్టినా... సెలెక్షన్ కమిటీ మాత్రం అందుకు అంగీకరించలేదు. జట్టులో స్థిరత్వం తీసుకురాగల పుజారా వంటి ప్లేయర్ అవసరమని గంభీర్ చెప్పినా... సెలెక్షన్ కమిటీ పెడచెవిన పెట్టింది. తాజా సిరీస్‌లో తొలి టెస్టు అనంతరం కూడా గంభీర్ పుజారాను జట్టులోకి తీసుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఇక జట్టును ముందుండి నడిపించాల్సిన సారథి రోహిత్ శర్మనే టీమ్‌కు భారంగా పరిణమించాడనేది కాదనలేని సత్యం. ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగినా... ‘హిట్‌మ్యాన్’ తన సహజసిద్ధ ఆటతీరు కనబర్చలేక పోతున్నాడు. ఈ నేపథ్యంలో అతడి కెరీర్‌పై నీలినీడలు కమ్ముకోగా... ఆస్ట్రేలియాతో సిరీస్ అనంతరం కఠినమైన నిర్ణయాలు తప్పకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే యువ ఆటగాళ్లు నాయకత్వ బాధ్యతలు తీసుకునేందుకు ఇది తగిన సమయం కాదని... ఇలాంటి సంధి దశలో పరిస్థితులను చక్కదిద్దాలంటే అనుభవమే ముఖ్యమని ఓ సీనియర్ ఆటగాడు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. పింక్ బాల్ టెస్టులో ఆకాశ్‌దీప్‌ను కాదని హర్షిత్ రాణాను తుదిజట్టుకు ఎంపిక చేయడంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
బీజేపీ నేతతో విరాట్ కోహ్లి, గౌతం గంభీర్ (ఫొటోలు)
-
‘మసాలా’ వార్తలకు ముగింపునిస్తున్నాం: కోహ్లి, గంభీర్
చెన్నై: మైదానంలో దూకుడైన స్వభావానికి వారిద్దరు చిరునామా... ఆటతోనే కాకుండా ప్రత్యర్థులపై మాటలతో దూసుకుపోయేందుకు ఎవరూ వెనుకాడరు... భారత ఆటగాళ్లుగా ఇతర జట్లతో తలపడిన సందర్భాలే కాదు... ఒకరికొకరు కూడా ఆవేశంతో మాటా మాటా అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఐపీఎల్లో అలాంటివి అభిమానులు చూశారు.అలాంటివారు ఒకరు ప్లేయర్‌గా, మరొకరు అదే జట్టుకు కోచ్‌గా కలిసి భారత జట్టును నడిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ‘ఢిల్లీ బాయ్స్’ విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ల మధ్య ఆసక్తకర సంభాషణ జరిగింది. తామిద్దరి మధ్య ఏదో వైరం ఉందంటూ మసాలా వార్తలు రాసుకునే వారికి ఈ సంభాషణ తర్వాత అలాంటి అవకాశం ఉండదని వారు ఈ ‘బీసీసీఐ’ వెబ్సైట్ రూపొందించిన వీడియోలో చెప్పేశారు. » మైదానంలో బ్యాటింగ్ సమయంలో దూషణలకు దిగితే అది బ్యాటింగ్‌పై ప్రభావం చూపి అవుటవుతారా లేక మరింత దూకుడుగా ఆడి ఆధిపత్యం ప్రదర్శించవచ్చా అని గంభీర్‌ను కోహ్లి అడిగాడు. దీనిపై గంభీర్ ‘ఇలాంటి తరహా అనుభవాలు నాకన్నా నీకే ఎక్కువగా ఉన్నాయి. నువ్వే బాగా చెప్పగలవు’ అని సమాధానం ఇవ్వడంతో నవ్వులు విరిశాయి. ‘ఇది తప్పు కాదు. ఇలా చేయవచ్చు అని నాకు మద్దతిస్తావని ఆశించా’ అంటూ కోహ్లి బదులిచ్చాడు. తన విషయంలో ఆ తరహా దూకుడు బాగా పని చేసిందని గంభీర్ అన్నాడు. » మెదానంలో మంచి ఇన్నింగ్స్‌లు ఆడిన సందర్భాల్లో దైవభక్తి బాగా పని చేసిందని ఇద్దరూ గుర్తు చేసుకున్నారు. తాను న్యూజిలాండ్‌పై నేపియర్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్న సమయంలో ‘హనుమాన్ చాలీసా’ పారాయణం చేసినట్లు గంభీర్ చెప్పగా... అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసినప్పుడు ‘ఓం నమఃశివాయ’ అంటూ వచ్చానని కోహ్లి వెల్లడించాడు. » 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన క్షణాల వీడియో చూస్తుండటంతో వీరి సంభాషణ మొదలైంది. ఢిల్లీ గ్రౌండ్లో గంభీర్‌ను చూసి తాను ఎలా కెరీర్లో ఎదగాలో స్ఫూర్తిగా తీసుకున్న విషయాన్ని కోహ్లి చెప్పగా... కెరీర్ ఆరంభంలో కోహ్లి ఆడిన కొన్ని అత్యుత్తమ ఇన్నింగ్స్‌లపై గంభీర్ ప్రశంసలు కురిపించాడు. అనంతరం ఈ చర్చ భారత టెస్టు క్రికెట్ వైపు మళ్లింది. ఒక ఆటగాడి గొప్పతనాన్ని గుర్చించేందుకు టెస్టు క్రికెట్ మాత్రమే అసలైన వేదిక అని ఇద్దరూ అభిప్రాయ పడ్డారు. భారత జట్టు బ్యాటింగ్‌లో చాలా కాలంగా బలంగా ఉందని... అయితే బౌలింగ్‌ను శక్తివంతంగా మార్చి బౌలర్ల ద్వారా మ్యాచ్‌లను గెలిపించిన ఘనత కెపె్టన్‌గా కోహ్లిదేనని గంభీర్ వ్యాఖ్యానించాడు. రాబోయే తరంలో టెస్టులను ఇష్టపడేలా ఆటగాళ్లను ప్రోత్సహించాల్సిన బాధ్యత తమపై ఉందని వీరిద్దరు అభిప్రాయపడ్డారు. » లక్ష్య ఛేదన అంటేనే తనకు ఇష్టమని, తాను చేయాల్సిన పనిపై స్పష్టత ఉంటుందని కోహ్లి అన్నాడు. ఒక ఆటగాడు సొంత మైలురాళ్ల గురించి ఆలోచించకుండా టీమ్ కోసం ఏం కావాలో ఆలోచిస్తేనే ఛేదన సులువై జట్టుకు విజయాలు లభిస్తాయని గంభీర్ విశ్లేషించాడు. వరల్డ్ కప్ ఫైనల్లో తాను సెంచరీ గురించి ఆలోచించనే లేదని, అవుటైనప్పుడు కూడా ప్రత్యర్థి కోలుకునే అవకాశం ఇవ్వడం పట్ల బాధపడ్డానని గంభీర్ వివరించాడు. » తర్వాతి అతిథి రోహిత్ శర్మ అయితే ఏం ప్రశ్న వేయాలని గంభీర్ అడగ్గా... ఉదయమే నానబెట్టిన బాదం పలుకులు తిన్నావా లేదా అని అడగాలని (అతని మతిమరపును గుర్తు చేస్తూ)... ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూకు రమ్మంటే రాత్రి 11 గంటలకు వస్తాడని కోహ్లి చెప్పడంతో నవ్వులతో సంభాషణ ముగిసింది. -
Ind vs SL: ప్రాక్టీస్ సెషన్లో గంభీర్ కోహ్లి.. ఫొటోలు వైరల్
-
సీనియర్లకు షాక్!.. అన్ని ఫార్మాట్లు ఆడాల్సిందే
-
అతడికి మాత్రమే ఆ అర్హత.. గౌతం గంభీర్ భార్య నటాషా పోస్ట్ వైరల్(ఫొటోలు)
-
మరోసారి గొడవ పడిన కోహ్లి, గంబీర్
-
LSG VS RCB: కోహ్లి-నవీన్-గంభీర్‌లలో తప్పెవరిది..?
కోహ్లి-నవీన్ ఉల్ హాక్-గంభీర్ల మధ్య నిన్నటి (మే 1) మ్యాచ్ (ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్సీబీ) సందర్భంగా చోటు చేసుకున్న వివాదం, ఆ తదనంతర పరిణామాలు జెంటిల్మెన్ గేమ్‌కు మాయని మచ్చగా మిగిలిపోనున్నాయి. దిగ్గజ క్రికెట్‌గా వేనోళ్ల కీర్తించబడుతున్న విరాట్ కోహ్లి తన స్థాయిని మరిచి గొడవకు బీజం వేస్తే.. నవీన్ ఉల్ హాక్‌ను సాకుగా చూపి గంభీర్ గొడవను పెద్దది చేసి భారత క్రికెట్ పరువును బజారుకీడ్చాడు. కోహ్లి-నవీన్ వివాదాన్ని గంభీర్ ఆటలో భాగంగా చూసుంటే ఈ ఇష్యూ ఇంత పెద్దదయ్యేది కాదు. అయితే కోహ్లి అంటే మొదటి నుంచి సరిపోని గంభీర్.. ఉద్దేశపూర్వకంగానే కోహ్లితో గొడవను ప్రొలాంగ్ చేశాడు. అందరూ అనుకుంటున్నట్లు కోహ్లి.. నవీన్‌ను కవ్వించడంతో ఈ గొడవ మొదలయ్యుండకపోవచ్చు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనే ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ (ఏప్రిల్ 10) అనంతరం ఈ గొడవ స్టార్ట్ అయ్యిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. (చేయాల్సిందంతా చేసి.. కోహ్లి, గంభీర్ గొడవకు మూల కారకుడు?) నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఆ మ్యాచ్‌లో లక్నో చివరి బంతికి విజయం సాధించింది. లక్నో విజయానంతరం ఆ జట్టు మెంటార్ గంభీర్.. ఆర్సీబీ అభిమానులను వారి సొంతగడ్డపై హేలన చేసేలా వ్యంగ్యమైన సంబరాలు చేసుకున్నాడు (నోరు మూయండి అన్నట్లు). సాధారణంగా ఎవరిది వారికి తిరిగి ఇచ్చే అలవాటున్న కోహ్లి.. నిన్నటి మ్యాచ్ ఆరంభం నుంచే గంభీర్‌పై రివెంజ్‌కు ప్లాన్ చేశాడు. అందులో భాగంగానే లక్నో వికెట్ కోల్పోయిన ప్రతిసారి స్టేడియంలోని ప్రేక్షకుల వైపు సైగ చేస్తూ తనదైన స్టయిల్లో గంభీర్‌కు చురక తగిలేలా ప్రవర్తించాడు. ఇది మనసులో పెట్టుకునే గంభీర్.. నవీన్ ఇష్యూను హైలైట్ చేసి, కోహ్లిపై పైచేయి సాధించాలని చూశాడు. మరోపక్క నవీన్ సైతం గంభీర్ అండ చూసుకుని సీనియర్ అన్న గౌరవం కూడా లేకుండా కోహ్లితో ఇష్టవచ్చినట్లు ప్రవర్తించాడు. మరి ఈ తంతు గురించి పూర్తిగా తెలిసాక తప్పెవరిదో, ఒప్పెవరిదో మీరే చెప్పండి. (కోహ్లీ-గంభీర్ గొడవకు రాజకీయ రంగు.. ఎన్నికల్లో బుద్ధిచెబుతామంటున్న కన్నడిగులు..!) -
భయపడితే పనులు కావంటున్న గంభీర్
-
కోహ్లిపై గంభీర్ తీవ్ర విమర్శలు
సాక్షి, న్యూఢిల్లీ :రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ పై టీమిండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలు చేశాడు. ఎనిమిదేళ్ల నుంచి ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కోహ్లి ఒక్క సారి కూడా జట్టుకు టైటిల్ అందించలేదని అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) లో ఆర్సీబీ పేలవ ప్రదర్శన బాధ్యతను స్వీకరించే సమయం ఆసన్నమైందని గంభీర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఐపీఎల్లో గొప్ప ప్రదర్శనలు చేస్తూ జట్టుకు టైటిల్స్ అందించిన కారణంగానే ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లకు సుదీర్ఘ కాలంగా కెప్టెన్లుగా ఉన్నారని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఇదే ఎనిమిదేళ్ల వైఫల్యానికి సీఎస్కే, ముంబై జట్ల యాజమాన్యాలు ధోని, రోహిత్‌లను కెప్టెన్సీ నుంచి ఎప్పుడో తొలిగించేదని గంభీర్ నొక్కిచెప్పాడు. ‘రవిచంద్రన్ అశ్విన్ విషయంలో ఏం జరిగిందో చూడండి. రెండేళ్లకు పంజాబ్ అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. జట్టును విజయ పథంలో నడిపించ లేకపోయాడని తొలగించింది. ధోని సారథ్యంలో సీఎస్కే మూడు టైటిల్స్, రోహిత్ కెప్టెన్సీలో ముంబై నాలుగు టైటిల్స్ గెలుచుకుంది. సెప్టెంబర్ 28 న ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ అదృష్టంగా కొద్దీ సూపర్ ఓవర్లో గెలిచింది. లేదంటే ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు కూడా అర్హత సాధించేది కాదు’అని గంభీర్ పేర్కొన్నాడు. ఇక శుక్రవారం సన్‌రైజర్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఓపెనర్‌గా రావడం బెడిసి కొట్టిందని గంభీర్ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీపై గెలిచిన వార్నర్ సేన క్వాలిఫైయర్-2 లో ఢిల్లీతో తలపడనుంది. సీజన్ మొదటి నుంచి అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ముంబై జట్టు ఇప్పటికే ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. -
బిషన్‌సింగ్, చేతన్ చౌహాన్‌లపై గౌతీ ఫైర్..
న్యూఢిల్లీ : ఆటగాడిగా గౌతమ్ గంభీర్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. అతని మాటల్లో కూడా అంతే పదును కనిపిస్తుంది. ఇక తాను అండగా నిలిచిన ఒక ఆటగాడి రాష్ట్రం గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే అతను ఊరుకుంటాడా! తాజాగా అతని మాటలు దీనిని మరోసారి నిరూపించాయి. అఫ్గానిస్తాన్‌తో టెస్టు కోసం ఢిల్లీ పేసర్ నవదీప్ సైని భారత జట్టులోకి తొలిసారి ఎంపికయ్యాడు. హరియాణాలోని కర్నాల్‌లో పుట్టిన సైని రంజీల్లో ఢిల్లీ తరఫునే ఆడినా... దిగువ స్థాయి క్రికెట్లో ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు. అతడు ‘బయటి వ్యక్తి’ అంటూ గతంలో బిషన్‌సింగ్ బేడి, చేతన్ చౌహాన్ విమర్శించారు. సైనిని ఢిల్లీకి ఆడించడంలో కీలక పాత్ర పోషించిన గంభీర్‌పై కూడా వ్యతిరేకత కనబర్చారు. తాజాగా సైని ఎంపికను నిరసిస్తూ ఢిల్లీ క్రికెట్ సంఘం అధికారులు కరపత్రాలు పంచడంతో పాటు నల్ల బ్యాండ్లు ధరించనున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గంభీర్ స్పందించాడు. ‘బయటి వ్యక్తి సైని భారత జట్టుకు ఎంపిక కావడంపై ఢిల్లీ సభ్యులు బేడి, చౌహాన్‌లకు నా సానుభూతి. నల్ల బ్యాండ్లు బెంగళూరులో కూడా ఒక్కో రోల్‌కు రూ. 225 చొప్పున లభిస్తున్నాయని నాకు తెలిసింది. సైని ముందుగా భారతీయుడు, ఆ తర్వాతే అతని రాష్ట్రం అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను’ అని గంభీర్ ట్వీట్ చేశాడు. -
గంభీర్, కునాల్ సెంచరీలు
పుణే: ఢిల్లీ ఓపెనర్లు గౌతమ్ గంభీర్ (216 బంతుల్లో 127; 21 ఫోర్లు), కునాల్ చండేలా (192 బంతుల్లో 113; 18 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో కదంతొక్కారు. బెంగాల్‌తో ఇక్కడ జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్ పోరులో వీళ్లిద్దరి వీరవిహారంతో ఢిల్లీ భారీ స్కోరు దిశగా సాగుతోంది. సోమవారం రెండో రోజు ఆటలో ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 77.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. బౌలర్లపై బౌండరీల వర్షం కురిపించిన ఓపెనర్లిద్దరు తొలి వికెట్‌కు 232 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించారు. బెంగాల్ బౌలర్లు 61 ఓవర్లు వేసినా ఈ జోడీని విడగొట్టలేకపోయారు. 62వ ఓవర్లో ఎట్టకేలకు చండేలాను అమిత్ అవుట్ చేయడంతో బెంగాల్ ఊపిరి పీల్చుకుంది. స్వల్ప వ్యవధిలో గంభీర్, ధ్రువ్ (12) నిష్క్రమించినప్పటికీ బెంగాల్‌కు జరగాల్సిన నష్టం జరిగింది. కేవలం 15 పరుగులే వెనుకబడి ఉన్న ఢిల్లీ చేతిలో ఇంకా 7 వికెట్లున్నాయి. అంతకుముందు 269/7 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన బెంగాల్ 286 పరుగుల వద్ద ఆలౌటైంది. కరుణ్ నాయర్ శతకం... కర్ణాటకకు ఆధిక్యం కోల్‌కతాలో విదర్భతో జరుగుతున్న రెండో సెమీస్‌లో కర్ణాటక ఆధిక్యం సాధించింది. 36/3 స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 93 ఓవర్లలో 8 వికెట్లకు 294 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ (148 బ్యాటింగ్; 20 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ సాధించాడు. ఇతనికి గౌతమ్ (73; 8 ఫోర్లు) ఒక్కడే అండగా నిలిచాడు. ప్రస్తుతం 109 పరుగుల ఆధిక్యంలో ఉన్న కర్ణాటక చేతిలో ఇంకా రెండు వికెట్లున్నాయి. నాయర్‌తో పాటు కెప్టెన్ వినయ్ కుమార్ (20 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో విదర్భ 185 పరుగులకే ఆలౌటైంది. -
కపిల్ ఇన్నింగ్స్ తో పోలికా?: గంభీర్
న్యూఢిల్లీ: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో ఉన్న భారత జట్టుపై వెటరన్ ఓపెనర్ గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై వంటి పటిష్టమైన జట్టుపై గెలవడం అంత ఈజీ కాదని, కాకపోతే దాన్ని సుసాధ్యం చేశారంటూ భారత మహిళా క్రికెటర్లను పొగడ్తలతో ముంచెత్తాడు. ఒకవేళ రేపు(ఆదివారం) ఇంగ్లండ్ తో జరిగే అమీతుమీ పోరులో భారత్ విజేతగా నిలిస్తే మాత్రం 2011లో పురుష క్రికెట్ జట్టు సాధించిన వన్డే వరల్డ్ కప్ కంటే కూడా గొప్పగా చరిత్రలో నిలిచిపోతుందన్నాడు. అప్పుడు తాము స్వదేశంలో వరల్డ్ కప్ సాధించిన విషయాన్ని గంభీర్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. 'మేము స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ సాధించాం. ప్రస్తుతం భారత మహిళా క్రికెటర్లు అత్యంత క్లిష్టమైన కండిషన్లో ఫైనల్ వరకూ వచ్చారు. ఇంగ్లండ్ లో పిచ్‌ల్లో ఆసీస్ వంటి జట్టును ఓడించడం నిజంగా చాలా గ్రేట్. వరల్డ్ కప్ తో తిరిగొస్తే మాత్రం అది భారత మహిళా క్రికెట్ లో సువర్ణాధ్యాయమే'అని గంభీర్ తెలిపాడు. అయితే ఆసీస్ తో నాకౌట్ సమరంలో హర్మన్ ప్రీత్(171 నాటౌట్) భారీ సెంచరీకి ఏ ఇన్నింగ్స్ సరిపోదంటూ కితాబిచ్చాడు. ఇక్కడ 1983 లో భారత్ జట్టు వరల్డ్ కప్ ను సాధించే క్రమంలో కపిల్ దేవ్ సాధించిన 175 పరుగులు కూడా హర్మన్ తాజా ఇన్నింగ్స్ తో పోల్చకూడదన్నాడు. ఆ సమయంలో కపిల్ దేవ్ నమోదు చేసిన పరుగులు లీగ్ స్టేజ్ లో అయితే, ఇప్పుడు హర్మన్ సాధించిన భారీ సెంచరీ నాకౌట్ స్టేజ్ లో అన్న సంగతి గుర్తుంచుకోవాలన్నాడు. అసలు కపిల్ దేవ్ ఇన్నింగ్స్ తో హర్మన్ ఇన్నింగ్స్ ను పోల్చుతూ వార్తలు రాయడం సబబు కాదని గంభీర్ అభిప్రాయపడ్డాడు. -
అగ్రస్థానమే లక్ష్యంగా..
►నేడు పుణేతో తలపడనున్న కోల్‌కతా ∙ ►సొంతగడ్డపై బలంగా నైట్‌రైడర్స్ ∙ ►వరుస విజయాలతో సూపర్‌జెయింట్ జోరు కోల్‌కతా: సొంతగడ్డపై చెలరేగే కోల్‌కతా నైట్‌రైడర్స్ బుధవారం రైజింగ్ పుణే సూపర్‌జెయింట్‌తో తలపడనుంది. ఇప్పటివరకు వరుస విజయాలతో దూకుడు కనబర్చిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చివరిమ్యాచ్‌లో అడ్డుకట్ట పడింది. దీంతో పుణేతో మ్యాచ్‌లో నెగ్గి టాప్‌ప్లేస్‌ను కైవసం చేసుకోవాలని గంభీర్‌సేన భావిస్తోంది. మరోవైపు రెండు వరుస విజయాలతో ఊపుమీదున్న పుణే అదే జోరును కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉంది. టాప్ ఆర్డరే బలం.. రెండుసార్లు చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ సీజన్లో మంచి జోరుమీదుంది. ఓవరాల్‌గా పది మ్యాచ్‌లాడిన కోల్‌కతా ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి మూడింటిలో ఓడిపోయింది. దీంతో 14 పాయింట్లతో ముంబై ఇండియన్స్ తర్వాత పట్టికలో రెండోస్థానంలో కొనసాగుతోంది. ఈక్రమంలో పుణేతో మ్యాచ్‌లో విజయం సాధించి తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంతోపాటు ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు కోల్‌కతా బలం అంతా టాప్ ఆర్డర్‌లోనే ఉంది. కెప్టెన్ గౌతమ్ గంభీర్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఈ సీజన్లో పది మ్యాచ్‌లాడిన గంభీర్ 55 సగటుతో 387 పరుగులు చేశాడు. దీంతో జట్టు తరఫున అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. మరోవైపు రాబిన్ ఉతప్ప (384 పరుగులు), మనీశ్ పాండే (304 పరుగులు) ఆకట్టుకుంటున్నారు. సునీల్ నరైన్ ఓపెనర్ అవతారంలో ఓ మోస్తరుగా రాణించాడు. కోల్‌కతా విజయం సాధించిన మ్యాచ్‌ల్లో ఎక్కువగా గంభీర్, నరైన్, ఉతప్ప, మనీశ్ పాండే రాణించారు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన చివరిమ్యాచ్‌లో కోల్‌కతా టాప్ఆర్డర్ విఫలమైంది. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు టాప్ ఆర్డర్ నుంచి సరైన భాగస్వామ్యం రాలేదు. గంభీర్, నరైన్ విఫలమైనా ఉతప్ప, మనీశ్ పాండే పోరాడారు. అయితే వారికి మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం అందలేదు. ముఖ్యంగా జట్టు ఆశలు పెట్టుకున్న యూసుఫ్ పఠాన్ చేతులెత్తేశాడు. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో వచ్చిన షెల్డన్ జాక్సన్ నిరాశపర్చాడు. దీంతో భారీ తేడాతో సన్‌రైజర్స్ చేతిలో ఓటమి ఎదురైంది. వరుస విజయాలతో జోరు మీదున్న కోల్‌కతాకు ఇది ఒక కుదుపులాగా పరిణమించింది. దీంతో తమ జట్టు కూర్పుపై మరోసారి ఆలోచించుకోవాల్సిన అవసరముంది. ముఖ్యంగా ఆరోస్థానంలో సూర్యకుమార్, జాక్సన్ స్థానంలో ఇషాంక్ జగ్గీని బరిలోకి దింపితే బాగుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వరుసగా విఫలమవుతోన్న కొలిన్ గ్రాండ్‌హోమ్ స్థానంలో బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే నాథన్ కూల్టర్‌నీల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. కేవలం ఐదు మ్యాచ్‌ల్లోనే 11 వికెట్లతో సత్తాచాటాడు. మరోవైపు క్రిస్ వోక్స్ కూడా 11 వికెట్ల (10 మ్యాచ్‌లు) ఆకట్టుకుంటున్నాడు. ఉమేశ్ యాదవ్, కుల్దీప్ యాదవ్, సునీల్ నరైన్ ఫర్వాలేదనిపిస్తున్నారు. యూసుఫ్ పఠాన్ మాత్రమే బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ విఫలమవుతున్నాడు. ఈక్రమంలో సాధ్యమైనంత త్వరగా తను గాడిలో పడాలని జట్టు మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఓవరాల్‌గా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా బౌలింగ్ విఫలమైంది. దీంతో ఈ సీజన్లో తొలిసారి కోల్‌కతాపై ఓ జట్టు 200 పరుగుల మార్కును సాధించింది. దీంతో ఈ విభాగంపై జట్టు మరింత దృష్టి సారించాల్సిన అవసరముంది. మరోవైపు కోల్‌కతా మరో విజయం సాధిస్తే ఎనిమిది విజయాలతో ప్లే ఆఫ్ బెర్త్‌ను దాదాపు కైవసం చేసుకోవడంతోపాటు తిరిగి అగ్రస్థానాన్ని అలంకరిస్తుంది. దీంతో పుణేతో జరిగే మ్యాచ్‌లో కచ్చితంగా నెగ్గాలని కృత నిశ్చయంతో ఉంది. అలాగే ఈ సీజన్లో సూపర్‌జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా అద్భుత విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. దీంతో బుధవారం మ్యాచ్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. పుణే దూకుడు.. ఈ సీజన్ ప్రథమార్థంలో నిరాశజనక ప్రదర్శన కనబర్చిన పుణే.. అనంతరం గాడిన పడింది. చివరగా ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో విజయం సాధించింది. ఓడిన ఈ ఒక్కమ్యాచ్ కోల్‌కతా చేతిలోనే కావడం విశేషం. ప్రస్తుతం ఈ సీజన్లో పది మ్యాచ్‌లాడిన పుణే.. ఆరు విజయాలు, నాలుగు పరాజయాలు నమోదు చేసింది. ఓవరాల్‌గా 12 పాయింట్లతో పట్టికలో ఐదోస్థానంలో కొనసాగుతోంది. మరో రెండు విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంటుంది. ఈక్రమంలో కోల్‌కతాతో బుధవారం మ్యాచ్ ఆడనుంది. జట్టు విషయానికొస్తేసారథి స్టీవ్ స్మిత్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. గుజరాత్ లయన్స్‌తో చివరిమ్యాచ్‌లో విఫలమైనా.. ఇప్పటికీ జట్టు తరఫున అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌లాడిన స్మిత్ 324 పరుగులు సాధించి జట్టు తరఫున టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. రాహుల్ త్రిపాఠి (259 పరుగులు), అజింక్య రహానే (215 పరుగులు), ఎంఎస్ ధోని (199 పరుగులు), మనోజ్ తివారీ (182 పరుగులు) ఆకట్టుకుంటున్నారు. గత మ్యాచ్‌లో ఈ సీజన్లోనే ఖరీదైన ఆటగాడు బెన్‌స్టోక్స్ సత్తాచాటాడు. లయన్స్‌పై విధ్వంసక సెంచరీతో ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో టాపార్డర్ విఫలమైన దశలో ధోనితో కలిసి ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడాడు. తీవ్రమైన ఒత్తిడిలో సైతం జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే ఇమ్రాన్ తాహిర్ అదరగొడుతున్నాడు. పది మ్యాచ్‌ల్లో 16 వికెట్లతో సత్తా చాటాడు. జయదేవ్ ఉనాద్కట్ పది వికెట్లతో ఆకట్టుకుంటున్నాడు. శార్దుల్ ఠాకూర్, డాన్ క్రిస్టియాన్ ఫర్వాలేదనిపిస్తున్నారు. మరోవైపు ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతాపై పుణే ఇప్పటివరకు విజయం సాధించలేదు. గతేడాది రెండు మ్యాచ్‌ల్లోనూ, ఈ సీజన్లో జరిగిన మ్యాచ్ కలిపి మొత్తం మూడుసార్లు పుణే పరాజయం పాలైంది. ఈ క్రమంలో సొంతగడ్డపై చెలరేగే కోల్‌కతాను పుణే ఎంతవరకు నిలువరిస్తుందో చూడాలి. మరోవైపు కోల్‌కతాపై విజయం సాధిస్తే పుణే ప్లే ఆఫ్‌కు మరింత చేరువవతుంది కాబట్టి ఈ మ్యాచ్‌లో విజయం కోసం స్మిత్‌సేన సర్వశక్తులు ఒడ్డుతుందనడంలో సందేహం లేదు. -
సైనికుల పిల్లల చదువుకు క్రికెటర్ సాయం
న్యూఢిల్లీ: దేశాన్ని గెలిపించడం కోసం మైదానంలో సర్వశక్తులూ ఒడ్డే క్రికెటర్ గౌతమ్ గంభీర్.. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల పిల్లల చదువు కోసం చేతనైన సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల చత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టుల దాడిలో అమరులైన 25 మంది జవాన్ల పిల్లల చదువులకు అయ్యే ఖర్చునంతా తాను భరిస్తానని ప్రకటించాడు. మరణించిన సైనికులకు నివాళులర్పిస్తూనే తన నిర్ణయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించాడు.! ‘ద గౌతమ్ గంభీర్ ఫౌండేషన్’ పేరుతో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ ఇకపై ఆ 25 మంది సైనికుల పిల్లల చదువు బాధ్యతను భుజానికెత్తుకుంటుందని ట్విటర్ పేజీలో పేర్కొన్నాడు. ‘దేశం కోసం ప్రాణాలర్పించడం.. దేశం కోసం క్రికెట్ ఆడడం ఎప్పుడూ ఒక్కటి కావు. సైనికుల త్యాగం మరేదానితో పోల్చలేనిది. వార్తా పత్రికలో మరణించిన సైనికుల ఫొటోలు చూసిన తరువాత నా గుండె బద్దలైంది. వారి త్యాగానికి మనం ఏమిచ్చినా తక్కువే. అయితే వారి పిల్లలను ప్రయోజకులను చేయడం ద్వారా కొంతైనా వారి కలలు నెరవేర్చినవారమవుతాం. అందుకే మరణించిన ఆ 25 మంది సైనికుల కుటుంబాల్లోని పిల్లల చదువు బాధ్యతలను మా ఫౌండేషన్ చూసుకుంటుంద’ని పేర్కొన్నాడు. -
ధోని ఆటతీరుపై గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు
గెలిపించినవాడే ఫినిషర్! కోల్‌కతా: మ్యాచ్‌లను ముగించడంలో ధోని ప్రత్యేకత గురించి అందరికీ తెలిసిందే. అయితే చాలా సందర్భాల్లో ధోనితో విభేదించే గంభీర్ ఈసారి కూడా మరో ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. ‘నా దృష్టిలో ఫినిషర్ అని స్టార్టర్ అని ఎవరూ ఉండరు. ఆఖరి పరుగు తీసినవాడే ఫినిషర్. అతను ఓపెనర్ కావచ్చు లేదా 11వ నంబర్ ఆటగాడు కావచ్చు. ఆటగాడు ఎలా ఆడాడన్నదే ముఖ్యం. తన జట్టు కోసం మ్యాచ్‌లు గెలిపించివాడే ఫినిషర్’ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. కొన్నాళ్ల క్రితమే క్రికెటర్లపై సినిమాలు తీయడానికి తాను వ్యతిరేకం అంటూ ధోని సినిమా విడుదల సమయంలో కూడా గంభీర్ తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పడం చర్చకు దారితీసింది. బుధవారం పుణే, కోల్‌కతా మధ్య మ్యాచ్ జరగనుంది. బాగా ఆడకపోతే మీ పని ఖతం... బెంగళూరును చిత్తుగా ఓడించిన మ్యాచ్‌లో కోల్‌కతా ముందుగా బ్యాటింగ్ చేసి 131 పరుగులే చేయగలిగింది. టి20 ప్రమాణాల ప్రకారం చూస్తే ఐపీఎల్లో ఈ స్కోరును నిలబెట్టుకోవడం చాలా కష్టం. సాధారణంగా ఇలాంటి స్థితిలో ఏ జట్టు కెప్టెన్ అయినా ‘మనం బాగా ఆడదాం, వంద శాతం ప్రయత్నిద్దాం, ఓడినా ప్రయత్నలోపం ఉండకూడదు, పోరాడితే గెలవవచ్చు’... ఇలాంటి మాటలతో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తాడు. కానీ గౌతమ్ గంభీర్ ఇలాంటి మొహమాటాలు ఏమీ పెట్టుకోలేదు. మీ ఆటలో ఏ మాత్రం తీవ్రత తగ్గినా జట్టులోంచి తీసేస్తానని ఆటగాళ్లతో నేరుగా చెప్పేశాడు. ‘మా బ్యాటింగ్‌ను చూశాక తీవ్ర నిరాశ కలిగింది. అనంతరం ప్రత్యర్థి బ్యాటింగ్ సమయంలో జట్టు సభ్యుల నుం చి నేను దూకుడు ఆశించాను. వారు గట్టిగా పోరాడాలని, గెలిపించాలని కోరుకున్నాను. ఎవరైనా కాస్త ఉదాసీనత కనబర్చినా కోల్‌కతా తరఫున వారికి ఇదే ఆఖరి మ్యాచ్ అని చెప్పాను. నేను కెప్టెన్‌గా ఉన్నంత వరకైతే వారు మళ్లీ ఆడలేరని హెచ్చరించాను’ అని గంభీర్ ఆదివారం మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు. గెలుపు అందుకునే ప్రయత్నంలో మైదానంలో ఆగ్రహావేశాలు ప్రదర్శించేందుకు తాను వెనుకాడనని... ఈ క్రమంలో ఫెయిర్‌ప్లే అవార్డు పాయింట్లు కోల్పోయినా తాను లెక్క చేయనని అతను వ్యాఖ్యానించాడు. తన జట్టు పాయింట్ల పట్టికలో ముందంజలో నిలవడమే తనకు ముఖ్యమని గంభీర్ తేల్చి చెప్పాడు. -
18 మ్యాచ్ లు.. 500 ఫోర్లు
న్యూఢిల్లీ: "కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. ఆడితే ఆడాలిరా రఫ్పా ఆడాలి' అన్నట్లు సాగతుంది ఐపీఎల్ పదో సీజన్. ఐపీఎల్ అంటేనే సిక్సర్లు, ఫోర్ల మోత.. ధనాధన్ మెరుపులు. ఐపీఎల్ ఆడే ప్రతి బ్యాట్స్ మెన్ ఇక్కడ మెరవాలనే సంకల్పంతోనే బరిలోకి దిగుతాడు. ఆ క్రమంలోనే ప్రతీ రోజు ఎన్నోరికార్డులు. తాజాగా సరికొత్త రికార్డు నమోదైంది.ఇప్పటివరకూ 18 మ్యాచ్ లు జరగ్గా 500 బౌండరీలు వచ్చి చేరాయి. సోమవారం ఢిల్లీ డేర్ డేవిల్స్, కొల్ కతా నైట్ రైడర్స్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ 500వ ఫోర్ నమోదైంది. ఈ మ్యాచ్ లో కోల్ కతా బ్యాట్స్ మన్ మనీశ్ పాండే క్రిస్ మోర్రిస్ బౌలింగ్ లో కొట్టిన బౌండరీనే 500వ ఫోర్ గా రికార్డులకెక్కింది. ఇక అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో కోల్ కతా కెప్టెన్ గౌతమ్ గంభీర్ తొలి స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకూ 5 మ్యాచ్ లు ఆడిన గౌతమ్ 30 ఫోర్లతో అగ్రస్థానంలో ఉండగా, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు డేవిడ్ వార్నర్ 26 ఫోర్లతో రెండో స్ధానంలో ఉన్నాడు. అత్యధిక ఫోర్లు కొట్టిన జట్లలో కోల్ కతా 78 ఫోర్లతో ప్రథమ స్థానం, సన్ రైజర్స్ హైదరాబాద్ 74 ఫోర్లతో రెండో స్థానంలోఉన్నాయి. ఇక ఢిల్లీ డేర్ డేవిల్స్, రైజింగ్ పుణేలు తరువాతి స్థానాల్లో నిలిచాయి. పదో సీజన్ లో ఇప్పటికి 19 మ్యాచ్ లు జరగగా 522 ఫోర్లు నమోదయ్యాయి. ఇప్పటికే 15 ఇన్నింగ్స్ ల్లోనే 100 సిక్స్ లు నమోదవ్వగా తాజాగా 500 ఫోర్లు నమోదవ్వడంతో అభిమానుల సంతోషంగా ఈ సీజన్ ను అస్వాదిస్తున్నారు. అత్యధిక సిక్సర్లు రాయల్ చాలెంజర్స్ కొట్టిన బ్యాట్స్ మన్ గా బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ (14) నిలిచాడు. -
ఐపీఎల్, ట్వంటీ20 చరిత్రలోనే తొలిసారిగా..
రాజ్‌కోట్: గత సీజన్లో ఆడిన రెండు మ్యాచ్ లలో ప్రత్యర్థి గుజరాత్ లయన్స్ చేతిలో వారి గడ్డపైనే ఘోరంగా విఫలమైన కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)... ఐపీఎల్-10లో ఆడిన తొలి మ్యాచ్ లోనే ట్వంటీ20 లలో ప్రపంచ రికార్డు నెలకొల్పుతూ ప్రతీకారం తీర్చుకుంది. ఐపీఎల్ లో మాత్రమే కాదు ట్వంటీ20 చరిత్రలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా కోల్ కతా సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని ఈఎస్ పీఎన్ క్రిక్ ఇన్ఫో తమ అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది. శుక్రవారం రాత్రి ఇక్కడి ఎస్సీఏ మైదానంలో జరిగిన మ్యాచ్ లో తొలుత నిర్ణీత ఓవర్లలో గుజరాత్ 4 వికెట్లకు 183 పరుగులు చేయగా, ఛేదనకు దిగిన కోల్ కతా ఓపెనర్లు క్రిస్ లిన్, కెప్టెన్ గౌతమ్ గంభీర్ లు అజేయ అర్ధ శతకాలతో చెలరేగడంతో 14.5 ఓవర్లలోనే విజయం సాధించింది. ఓ వైపు బ్యాటింగ్ ప్రమోషన్ లో ఓపెనర్ గావచ్చిన క్రిస్ లిన్ (41 బంతుల్లో 93 నాటౌట్; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) ఊచకోతకు కెప్టెన్ గంభీర్ (48 బంతుల్లో 76 నాటౌట్; 12 ఫోర్లు) సొగసైన ఇన్నింగ్స్ తోడవడంతో సొంత మైదానంలో లయన్స్ ఘోరంగా విఫలమైంది. క్రిస్ లిన్, గంభీర్ తమ విజృంభణతో కేకేఆర్ కు ఏ వికెట్‌కైనా అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లిన్‌కు దక్కింది. వీరి విధ్వంసాన్ని రైనా బృందం ఏ దశలోనూ అడ్డుకోలేకపోయింది. వీరి ధాటికి లయన్స్ బౌలర్లు కులకర్ణి 2.5 ఓవర్లలో 40 పరుగులు, మన్ ప్రీత్ గోని రెండు ఓవర్లలో 32 పరుగులు, డ్వేన్ స్మిత్ ఒక్క ఓవర్ వేసి 23 సమర్పించుకున్నారు. The highest total ever chased down in T20 cricket without a wicket being lost! https://t.co/Eulvx5Hexo #IPL #GLvKKR pic.twitter.com/6sHHs8qcdJ — ESPNcricinfo (@ESPNcricinfo) 7 April 2017 -
కోల్‌కతా కుమ్మేసింది
-
కోల్‌కతా కుమ్మేసింది
►10 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్‌పై ఘనవిజయం ►చెలరేగిన లిన్, గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్ కసితీరా ప్రతీకారం తీర్చుకుంది. గత సీజన్లో లయన్స్ చేతిలో రెండుసార్లు చావు దెబ్బ తిన్న గంభీర్ సేన వారి సొంతగడ్డపైనే బెబ్బులిలా గర్జించింది. క్రిస్ లిన్ ఊచకోతకు కెప్టెన్ గంభీర్ సొగసైన షాట్లు తోడవ్వడంతో లయన్స్ ఈసారి తోక ముడిచింది. ఏమాత్రం పసలేని బౌలింగ్‌కు తోడు పేలవ ఫీల్డింగ్‌ను సొమ్ము చేసుకున్న కోల్‌కతా ఓపెనర్లు ఆరంభం నుంచే బౌండరీల వర్షం కురిపిస్తూ సాగించిన విధ్వంసాన్ని రైనా బృందం ఏమాత్రం అడ్డుకోలేకపోయింది. రాజ్‌కోట్: మూడో టైటిల్‌పై కన్నేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ పదో సీజన్‌ను ఘనంగా ఆరంభించింది. క్రిస్ లిన్ (41 బంతుల్లో 93 నాటౌట్; 6 ఫోర్లు, 8 సిక్సర్లు), కెప్టెన్ గంభీర్ (48 బంతుల్లో 76 నాటౌట్; 12 ఫోర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో... శుక్రవారం ఎస్సీఏ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) 10 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్‌ను చిత్తు చేసింది. జట్టు కూర్పులో నాణ్యమైన ఆల్‌రౌండర్ లేకపోవడం లయన్స్‌ను దెబ్బతీసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 183 పరుగులు చేసింది. కెప్టెన్ సురేశ్ రైనా (51 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు), దినేశ్ కార్తీక్ (25 బంతుల్లో 47; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడారు. ఈ జోడి మధ్య నాలుగో వికెట్‌కు 87 పరుగులు జత చేరాయి. ఓపెనర్ మెకల్లమ్ (24 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించాడు. కుల్దీప్ యాదవ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 14.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 184 పరుగులు చేసి నెగ్గింది. లిన్, గంభీర్ తమ విజృంభణతో జట్టుకు ఏ వికెట్‌కైనా అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లిన్‌కు దక్కింది. గౌతీ, లిన్ల విధ్వంసం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా తమ తొలి ఓవర్లో ఏడు పరుగులే చేసినా... ఆ తర్వాత ఓపెనర్లు గంభీర్, లిన్ ఆకాశమే హద్దుగా బౌండరీలతో చెలరేగారు. మూడో ఓవర్లో లిన్ ఓ ఫోర్, సిక్స్‌తో చెలరేగగా, గంభీర్ బౌండరీ బాదాడు. దీంతో మన్‌ప్రీత్ గోని వేసిన ఆ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. ఇక ఆరో ఓవర్లో గౌతీ నాలుగు ఫోర్లతో రెచ్చిపోవడంతో వపర్‌ప్లేలో తొలిసారిగా కోల్‌కతా అత్యధికంగా 73 పరుగులు చేసింది. ఇక ఏడో ఓవర్లో లిన్.. స్మిత్ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. ఏకంగా మూడు సిక్సర్లు, ఓ ఫోర్ బాదడంతో 19 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయ్యింది. 8 ఓవర్లలోనే కేకేఆర్ సెంచరీ మార్కు దాటింది. అటు గంభీర్ 33 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. గోని మరో సారి బౌలింగ్‌కు దిగగా గంభీర్ మూడు ఫోర్లు బాది 15 పరుగులు సాధించాడు. ఇక 15వ ఓవర్లో లిన్ ఇచ్చిన క్యాచ్‌ను మెకల్లమ్ బౌండరీ లైన్ దగ్గర వదిలేయడంతో సిక్స్‌గా వెళ్లింది. ఆ తర్వాత వరుసగా 4,6 సహా మొత్తం 22 పరుగులు రాబట్టి జట్టుకు కావాల్సిన విజయాన్ని అందించాడు. రైనా జోరు అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ లయన్స్‌కు నాలుగో ఓవర్లోనే షాక్ తగిలింది. ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడిన ఓపెనర్ జేసన్ రాయ్ (12 బంతుల్లో 14; 3 ఫోర్లు) చావ్లా బౌలింగ్‌లో పేలవ షాట్‌కు వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత బ్రెండన్ మెకల్లమ్‌తో జతకలిసిన రైనా బ్యాట్‌ను ఝుళిపించాడు. దీంతో పవర్‌ప్లేలో లయన్స్ 52 పరుగులు చేసింది. ఏడో ఓవర్ చివరి రెండు బంతులను మెకల్లమ్ 4,6గా మలిచాడు. అయితే వీరి జోరుకు తొమ్మిదో ఓవర్లో కుల్దీప్ యాదవ్ అడ్డుకట్ట వేశాడు. ఆ ఓవర్ తొలి బంతికే మెకల్లమ్‌ను ఎల్బీగా అవుట్ చేయడంతో రెండో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 16వ ఓవర్లో రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్న రైనా 41 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అటు దినేశ్ కార్తీక్ అడపాదడపా బౌండరీలతో సహకారం అందించడంతో నిలకడగా పరుగులు వ చ్చాయి. చివరి 4 ఓవర్లలో వీరిద్దరి జోరు కు లయన్స్ 53 పరుగులు రాబట్టింది. స్కోరు వివరాలు గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: రాయ్ (సి) యూసుఫ్ (బి) చావ్లా 14; మెకల్లమ్ ఎల్బీడబ్లు్య (బి) కుల్దీప్ యాదవ్ 35; రైనా (నాటౌట్) 68; ఫించ్ (సి) సూర్యకుమార్ (బి) కుల్దీప్ యాదవ్ 15; దినేశ్ కార్తీక్ (సి) సుర్యకుమార్ (బి) బౌల్ట్ 47; స్మిత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 183. వికెట్ల పతనం: 1–22, 2–72, 3–92, 4–179; బౌలింగ్: బౌల్ట్ 4–0–40–1; చావ్లా 4–0–33–1, నరైన్ 4–0–33–0; వోక్స్ 3–0–35–0; కుల్దీప్ 4–0–25–2; పఠాన్ 1–0–15–0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గంభీర్ (నాటౌట్) 76; లిన్ (నాటౌట్) 93; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (14.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 184. బౌలింగ్: ప్రవీణ్ 2–0–13–0; ధావల్ 2.5–0–42–0; గోని 2–0–32–0; కౌశిక్ 4–0–40–0; డ్వేన్ స్మిత్ 1–0–23–0; జకాతి 3–0–30–0. ⇒1 టి20 క్రికెట్లో వికెట్ నష్టపోకుండా అత్యధిక లక్ష్య ఛేదన (184) చేసిన జట్టు కోల్‌కతా. ⇒1 ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి (4,110)ని అధిగమించిన సురేశ్ రైనా (4,166). ఐపీఎల్లో నేటి మ్యాచ్‌లు ►పంజాబ్ & రైజింగ్ పుణే ►వేదిక: ఇండోర్; సా. గం. 4.00 నుంచి ►బెంగళూరు & ఢిల్లీ డేర్‌డెవిల్స్ ►వేదిక: బెంగళూరు; రా. గం. 8.00 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
గంభీర్‌పై సెహ్వాగ్ విమర్శలు
దిల్లీ: ఆ ఇద్దరు.. ఒకప్పడు భారత క్రికెట్ జట్టుకు డాషింగ్ ఓపెనింగ్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. వారిద్దరూ క్రీజులో కుదురుకుందంటే.. భారత విజయం ఖరారైనట్లే! వారెవరో కాదు. ఢిల్లీ ఆటగాళ్లు.. గంభీర్, సెహ్వాగ్! ఇంతకాలం మిత్రుల్లా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు విమర్శల వాగ్బాణాలకు దిగుతున్నారు. సోషల్‌మీడియాలో ట్వీట్ షాట్లతో అలరించే సెహ్వాగ్ మీడియా ముందు కూడా తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు. ఐపీఎల్–10వ సీజన్ కోసం బెంగళూరులో జరిగిన వేలంలో ఇషాంత్ అమ్ముడుపోని సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు గంభీర్ ‘నాలుగు ఓవర్లు వేసే ఆటగాడి కోసం ఏ జట్టైనా రూ.2కోట్లు ఖర్చు భరించలేదు’ అని అన్నాడు. రూ.2కోట్ల కనీస ధరతో ఇషాంత్ వేలంలో పాల్గొన్నాడు. ఇదిలా ఉండగా తాజాగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కోచ్‌గా ఉన్న సెహ్వాగ్ సూచనతో ఇషాంత్‌ను పంజాబ్ ఫ్రాంఛైజీ జట్టులోకి తీసుకుంది. ఇటీవల పంజాబ్ జట్టు జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలను విలేకరులు సెహ్వాగ్ ముందుంచారు. దీనికి సెహ్వాగ్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ‘60 బంతులు కూడా ఆడని నీకోసం రూ.12కోట్లు ఎవరు వెచ్చిస్తున్నారు’ అంటూ ఎత్తి పొడిచాడు. తోటి ఆటగాడి విషయంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలకు సెహ్వాగ్ బాగానే చురకలంటించాడు. -
వీరు వర్సెస్ గంభీర్
న్యూఢిల్లీ: భారత మాజీ దిగ్గజ ఒపెనర్లు, ఢిల్లీ సహచర ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్‌లు మంచి స్నేహితులు. కానీ ఐపీఎల్-10లో వీరిద్దరి మధ్య మాటల యుద్దం నడుస్తుంది. ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో ఆసక్తి చూపని ఇషాంత్ శర్మను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు అత్యధిక ధరకు ఎంచుకోవడమే ఈ వివాదానికి కారణం. ఇషాంత్‌ను రూ.2 కోట్లకు పంజాబ్ జట్టు ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎంపికలో కీలకపాత్ర పోషించిన పంజాబ్ కోచ్ సెహ్వాగ్‌ను కొల్‌కత కెప్టెన్ గంభీర్ తప్పుబట్టాడు. ఇషాంత్ ఎంపికకు కుదుర్చుకున్న ఒప్పందం ఐపీఎల్లో ఫాస్ట్ బౌలర్ల బేస్ ప్రైజ్ కన్న చాలా ఎక్కువని గంభీర్ అభిప్రాయపడ్డాడు. 4 ఓవర్లు వేసే బౌలర్లకు రూ.2 కోట్ల ఎవరు చెల్లించరని, ఈ ఒప్పందం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని గంభీర్ వ్యాఖ్యానించాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జెర్సీ లాంచ్ కార్యక్రమంలో ఈ విషయం పై సెహ్వాగ్ స్పందించాడు. 60 బంతులు ఎదుర్కునేవారికి రూ.12 కోట్లు అవసరమా అని సెహ్వాగ్ ప్రశ్నించాడు. 2011లో కొల్కతా నైట్‌రైడర్స్ గంభీర్‌కు రూ.12 కోట్లు చెల్లించిది. ఐపీఎల్ తొలి సీజన్లో ఢిల్లీ డెర్‌డెవిల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ ఆటగాళ్ల మధ్య ఐపీఎల్-10లో మాటల యుద్దం జరగడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ దిగ్గజ ఆటగాళ్ల జట్లు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, కొల్కతా నైట్‌రైడర్స్ ఏప్రిల్ 13న తలపడనున్నాయి. -
గెలవగలమనే నమ్మకంతో ఉన్నాం: గంభీర్
కొల్‌కత: ప్రపంచ కప్ గెలుచుకొని నేటికి ఆరేళ్లు పూర్తయిన సంధర్భంగా ఆ జట్టులోని సభ్యులు తమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సెహ్వాగ్ ట్వీటర్లో ఆనందం వ్యక్తం చేయగా ఐపీఎల్ కొల్‌కత నైట్‌రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రపంచకప్ విజేత జట్టు సభ్యులైన గౌతమ్ గంభీర్, పీయూష్ చావ్లా, యూసఫ్ పఠాన్లు నైట్‌రైడర్స్ అధికారిక వెబ్సైట్లో వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఆ సమయంలో బ్యాటింగ్‌కు సిద్దంగా లేను: గంభీర్ ఫైనల్ మ్యాచ్‌లో సెహ్వాగ్ రెండో బంతికే డక్ ఔట్ అవ్వడం అయోమయానికి గురి చేసిందని నైట్‌రైడర్స్ కెప్టెన్ గంభీర్ తెలిపాడు. ఆ సమయంలో బ్యాటింగ్ రావడానికి సిద్దంగా లేనని,ప్యాడ్లు కట్టుకుంటున్నానని గంభీర్ గుర్తు చేసుకున్నాడు. అంపైర్ రిఫరల్ తీసుకోవడంతో కాస్త సమయం దొరికందన్నాడు. క్రీజులోకి వెళ్లె ముందు మెదడులో ఇది ప్రపంచకప్ ఫైనల్, 275 పరుగుల లక్ష్యం అని చాలా ఆలోచనలు మొదలయ్యాయన్నాడు. వచ్చిన వెంటనే మలింగా విసిరిన తొలి బంతిని బౌండరీకి తరలించడంతో కొంత ఒత్తిడి తగ్గిందని చెప్పాడు. 275 పరుగుల లక్ష్యం స్వదేశంలో పెద్ద లక్ష్యం కాదని కానీ ఆసమయంలో కొంత ఒత్తిడికి లోనయ్యానన్నాడు. కానీ డ్రెస్సింగ్ రూంలో ఉన్న ప్రతి ఒక్కరం మ్యాచ్గెలుస్తామనే నమ్మకంతో ఉన్నామని తెలిపాడు. ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదని భావించి ఆడానన్నాడు. ఈ మ్యాచ్‌లో గంభీర్, నాటి కెప్టెన్ ధోనితో కలసి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి గెలుపుకు బాటలు వేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గంభీర్ 122 బంతుల్లో 97 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ రాత్రి జెర్సీ విప్పలేదు: పీయూష్ చావ్లా ప్రపంచ కప్ జట్టులో సభ్యుడైన లెగ్‌స్పిన్నర్ పీయూష్ చావ్లా అయితే మ్యాచ్‌గెలిచిన రాత్రి భారత్ జెర్సీ, మెడల్ తీసేయకుండా అలానే పడుకున్నానని గుర్తుచేసుకున్నాడు. మ్యాచ్అనంతరం చాంపెన్ బాటిల్ ఓపెన్ చేసి సందడి చేశానని, కానీ తాగలేదని, ఇప్పటికీ తాగిన అనుభూతే కలుగుతుందన్నాడు ఈ లెగ్ స్పిన్నర్. టీషర్టుపై ప్రతి ఒక్క ఆటగాడి సంతకం తీసుకున్నానని, మెడల్ టీషర్టుతో అలానే పడుకున్నాని చావ్లా తెలిపాడు. ఆ వేడుకలతో తన జీవితంలో ఒక అద్భుతమైన రాత్రిగా నిలిచిందన్నాడు. ఫుల్ టాస్‌ను సింగిల్ తీశాను: యూసఫ్ పఠాన్ ఐర్లాండ్‌తో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో తన బ్యాట్‌ను మెరిపించిన యూసఫ్‌పఠాన్ తన తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో యూసఫ్ 30 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోశించాడు. ఇదే మ్యాచ్ 5 వికెట్లు కోల్పోయి క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన యువరాజ్, యూసఫ్‌లు జట్టును గెలిపించారు. యూవీ 50 కోసం ఫుల్‌టాస్ బాల్‌ను సింగిల్ తీశానని యూసఫ్ తెలిపాడు. ఆ సమయంలో భారత్ విజయానికి 8 పరుగులు దూరంలో ఉందని, యూవీ హాఫ్ సెంచరీకి 5 పరుగులు కావాలని, అయితే సింగిల్ తీయడంతో యూవీ ఫోర్, సింగిల్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడని యూసఫ్ తన మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. దీంతో యూవీ వరల్డ్‌కప్‌లో ఒక మ్యాచ్‌లో 5 వికెట్లు సాధించి 50 పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వరల్డ్‌కప్ ఫైనల్లో 6 వికెట్లతో భారత్ గెలుపొందడం 1983 వరల్డ్‌కప్ తర్వాత ఇది రెండోసారి. -
టెస్టు జట్టులోకి ఎంపికైన హార్ధిక్ పాండ్యా
-
పాండ్యా జాక్‌పాట్
టెస్టు జట్టులోకి ఎంపికై న హార్ధిక్ గంభీర్ స్థానం పదిలం, తిరిగొచ్చిన ఇషాంత్ గాయంతో రోహిత్ శర్మ అవుట్ ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు జట్టు ఎంపికలో పెను సంచలనం. ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకు భారత జట్టులో చోటు దక్కింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పెద్దగా అనుభవం లేకపోరుునా, ఇటీవల కాలంలో మెరుగైన పేస్ బౌలింగ్ చేస్తున్న కారణంగా హార్ధిక్‌కు జాక్‌పాట్ తగిలింది. కేవలం పది నెలల వ్యవధిలో మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టులోకి వచ్చేశాడు. న్యూజిలాండ్‌తో ఆఖరి వన్డేలో గాయపడిన రోహిత్ శర్మ టెస్టు సిరీస్‌కు అందుబాటులో లేకపోవడం కూడా ఊహించని అంశం. ముంబై: భారత క్రికెట్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా నలుగురు రెగ్యులర్ క్రికెటర్లు గాయం కారణంగా సెలక్షన్‌కు అందుబాటులో లేకుండా పోయారు. ఓపెనర్లు శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్‌లతో పాటు రోహిత్ శర్మ కూడా గాయంతో టెస్టులకు దూరమయ్యాడు. భువనేశ్వర్ కుమార్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇద్దరు ఓపెనర్లు అందుబాటులో లేకపోవడంతో గంభీర్ తన స్థానం నిలబెట్టుకున్నాడు. జ్వరం కారణంగా న్యూజిలాండ్‌తో సిరీస్ ఆడని ఇషాంత్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చాడు. నలుగురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు, ఒక పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్, వికెట్ కీపర్, ఆరుగురు బ్యాట్స్‌మెన్‌తో మొత్తం 15 మంది సభ్యుల జట్టును తొలి రెండు టెస్టులకు భారత సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టుకు అజింక్య రహానే వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్టర్ల బృందం గంటలోపే జట్టు ఎంపికను పూర్తి చేసింది. పాండ్యా ఎంపిక మినహా బాగా ఆశ్చర్యపరచిన నిర్ణయాలు లేకపోరుునా... ఆటగాళ్ల గాయాల విషయంలో బోర్డు సరైన సమాచారం ఇవ్వడం లేదని మరోసారి స్పష్టమైంది. జట్టు ఎంపికకు ముందు రోజు కూడా రాహుల్, ధావన్ ఫిట్నెస్ పరీక్షకు హాజరవుతున్నారనే వార్తలు వచ్చారుు. ఇక రోహిత్‌కు గాయమై నాలుగు రోజులు గడిచినా బయటకు సమాచారం లేదు. సెలక్షన్ కమిటీ సమావేశానికి కాస్త ముందు జట్టు ఫిజియో పాట్రిక్ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు సంబంధించిన రిపోర్ట్‌ను అందించారు. రోహిత్ శర్మ అందుబాటులో లేకపోరుునా మిడిలార్డర్ కోసం సెలక్టర్లు మరో బ్యాట్స్‌మన్‌ను ఎంపిక చేయలేదు. కరుణ్‌ను ఓపెనర్లతో పాటు మిడిలార్డర్‌కు కూడా బ్యాకప్‌గా పరిగణించాలి. తొలి టెస్టు నవంబరు 9 నుంచి రాజ్‌కోట్‌లో, రెండో టెస్టు 17 నుంచి విశాఖపట్నంలో జరుగుతుంది. ఇంగ్లండ్ బలహీనతను చూసి... భారత్ స్వదేశంలో ముగ్గురు స్పిన్నర్లతో ఆడటం కొత్తేం కాదు. అరుుతే ఇటీవల కాలంలో ఇది కాస్త తగ్గింది. అశ్విన్, జడేజా ఇద్దరే న్యూజిలాండ్‌తో సిరీస్‌లో మూడు మ్యాచ్‌లూ ఆడారు. అరుుతే బంగ్లాదేశ్‌లో ఇంగ్లండ్ జట్టు స్పిన్‌ను ఆడటంలో ఘోరంగా దెబ్బతింది. ముఖ్యంగా మిర్పూర్లో జరిగిన రెండో టెస్టులో ఒకే సెషన్లో మొత్తం పది వికెట్లూ కోల్పోరుుంది. ఈ పది వికెట్లూ స్పిన్నర్లే తీశారు. కాబట్టి ఇంగ్లండ్‌కు ఉన్న ఈ బలహీనతను ఈసారి భారత జట్టు ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తోంది. ముగ్గురు స్పిన్నర్లతో తుది జట్టును ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నారుు. దానికి అనుగుణంగానే టెస్టు జట్టును ప్రకటించినట్లు కనిపిస్తోంది. పాండ్యా లేదా కరుణ్ తొలి టెస్టులో ఒకరికి కచ్చితంగా అవకాశం ఈసారి జట్టు ఎంపికలో బ్యాట్స్‌మెన్ కంటే బౌలర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. నిజానికి అదనంగా బ్యాట్స్‌మన్ అందుబాటులో లేకుండా జట్టు ఎంపిక జరిగింది. స్వదేశంలో సిరీస్ కాబట్టి అవసరమైతే అప్పటికప్పుడు మరో బ్యాట్స్‌మన్‌ను పిలవొచ్చు అనేది సెలక్టర్ల ఉద్దేశం కావచ్చు. ఇక నలుగురు స్పిన్నర్లను అందుబాటులో ఉంచడం ద్వారా ఇంగ్లండ్‌ను స్పిన్ పిచ్‌లతో దెబ్బకొట్టే వ్యూహం కనిపిస్తోంది. ఒకసారి జట్టు కూర్పును పరిశీలిస్తే.... ఓపెనర్లు: గంభీర్, విజయ్ ఇద్దరూ ఆడటం ఖాయం. ఒకవేళ ఆఖరి నిమిషంలో ఎవరైనా గాయపడితే కరుణ్ నాయర్ బ్యాకప్‌గా ఉంటాడు. మిడిలార్డర్: ఫస్ట్‌డౌన్‌లో పుజారా, ఆ తర్వాత కోహ్లి, రహానే ఆడతారు. కీపర్ సాహా ఎలాగూ ఉంటాడు. ఐదుగురు బౌలర్లతో ఆడితే ఇక్కడి వరకు సరిపోతారు. ఒకవేళ నలుగురు బౌలర్లతో ఆడితే స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా కరుణ్ నాయర్ ఆడతాడు. పేస్ ఆల్‌రౌండర్: ఇటీవల కాలంలో భారత్‌కు టెస్టుల్లో అందుబాటులో లేని విభాగం ఇది. వెస్టిండీస్‌లో స్టువర్ట్ బిన్నీకి అవకాశం వచ్చినా వినియోగించుకోలేకపోయాడు. నిజానికి ఒక పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఉంటే అదనంగా మరో బౌలర్‌ను తీసుకున్నా ఇబ్బంది ఉండదు. ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు జట్టులో ఉంటే కరుణ్ లేదా పాండ్యాలలో ఒకరికి కచ్చితంగా తుది జట్టులో అవకాశం దక్కుతుంది. ఒకవేళ ముగ్గురు స్పిన్నర్లను తుది జట్టులో ఆడిస్తే కచ్చితంగా రెండో పేసర్‌గా, ఆల్‌రౌండర్‌గా పాండ్యాకు అరంగేట్రం అవకాశం దక్కుతుంది. స్పిన్నర్లు: అశ్విన్, జడేజా విశ్రాంతి తర్వాతి జట్టులోకి వచ్చారు. న్యూజిలాండ్‌తో సిరీస్ అంతటా జట్టుతో పాటే ఉన్న మిశ్రాతో పాటు ఆ సిరీస్‌లో అశ్విన్‌కు బ్యాకప్‌గా పిలిపించిన జయంత్ యాదవ్ కూడా స్థానం నిలబెట్టుకున్నాడు. ముగ్గురు ప్రధాన స్పిన్నర్లలో ఎవరికై నా గాయమైతే తప్ప తనకు తుది జట్టులో చోటు దక్కకపోవచ్చు. పేసర్లు: కివీస్‌తో సిరీస్‌లో రాణించిన షమీతో పాటు ఉమేశ్ యాదవ్ స్థానం నిలబెట్టుకున్నాడు. ఆ సిరీస్‌కు డెంగీ జ్వరం కారణంగా అందుబాటులో లేని ఇషాంత్ తిరిగి వచ్చాడు. భువనేశ్వర్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోనందున సెలక్షన్లో డైలమా ఏమీ లేదు. కివీస్‌తో సిరీస్‌కు నలుగురు పేసర్లను ఎంపిక చేయగా... ఈసారి ముగ్గురు పేసర్లతో సరిపెట్టారు. అరుుతే పాండ్యా కారణంగా ఇక్కడా నలుగురు అందుబాటులో ఉన్నట్లే. గత సిరీస్‌కు బ్యాకప్‌గా వచ్చిన శార్దుల్ ఠాకూర్‌కు ఈసారి అవకాశం లేదు. గాయాల బాధితులు రోహిత్ శర్మ: వైజాగ్‌లో న్యూజిలాండ్‌తో ఆఖరి వన్డే సందర్భంగా తొడ భాగంలో గాయమైంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో సిరీస్ మొత్తానికి అందుబాటులో లేడు. ఒకవేళ ఈ గాయానికి ఆపరేషన్ అవసరమైతే మరింత కాలం దూరం కావచ్చు. ఆరు నెలల వరకూ విశ్రాంతి అవసరం అంటున్నారు. కేఎల్ రాహుల్: న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ఆడుతూ తొడ కండరాల గాయం బారిన పడ్డాడు. ఆ తర్వాత సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. నిజానికి తను గాయం నుంచి దాదాపుగా కోలుకున్నా పూర్తి ఫిట్నెస్తో లేడు. దీంతో తొలి రెండు టెస్టులకు లేడు. ఆఖరి రెండు టెస్టులు ఆడే అవకాశం ఉంది. శిఖర్ ధావన్: న్యూజిలాండ్‌తో రెండో టెస్టు సందర్భంగా బొటనవేలికి గాయమైంది. దీంతో ఆ తర్వాత సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఇంగ్లండ్‌తో చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. భువనేశ్వర్: న్యూజిలాండ్‌తో రెండో టెస్టు సందర్భంగా తొడ కండరాల గాయంతో బాధపడ్డాడు. ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులు ముగిసేలోపు ఒక్క రంజీ మ్యాచ్ అరుునా ఆడి ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు కోహ్లి (కెప్టెన్), గంభీర్, విజయ్, పుజారా, రహానే, సాహా, పాండ్యా, అశ్విన్, జడేజా, ఇషాంత్, షమీ, ఉమేశ్, అమిత్ మిశ్రా, జయంత్ యాదవ్, కరుణ్ నాయర్. -
జోడీ నంబర్ 1
► కోల్‌కతా ఓపెనర్లు సూపర్ హిట్ ► వరుసగా మూడో సీజన్లోనూ నిలకడ ఫార్మాట్ ఏదైనా ఓపెనర్లు బాగా ఆడితే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రతి జట్టూ మంచి ఓపెనింగ్ జోడీ కోసం చూస్తుంది. ఐపీఎల్లో దాదాపు అన్ని జట్లూ సరైన ఓపెనర్ల కోసం ఇబ్బంది పడుతూ, ప్రతి సీజన్లోనూ మార్పులు చేస్తూనే ఉంటాయి. కోల్‌కతా కూడా ఆరేళ్ల పాటు ఇలాంటి తిప్పలే పడింది. 2014లో తొలిసారి గంభీర్, ఉతప్ప జతకలిశాక ఈ జట్టు రాత మారింది. ఈ ఏడాది కూడా అదే జోరుతో ఈ ఇద్దరూ చెలరేగిపోతున్నారు. సాక్షి క్రీడావిభాగం:- మిగిలిన చాలా జట్ల ఓపెనర్లతో పోలిస్తే గంభీర్, ఉతప్ప ఇద్దరూ అంత పెద్ద విధ్వంసకర ఆటగాళ్లేం కాదు. కానీ పవర్‌ప్లేలో ఈ ఇద్దరూ కలిసి అలవోకగా ఓ 50-60 పరుగులు చేసేస్తారు. విరుచుకుపడి సిక్సర్ల సునామీ సృష్టించడం, భీకరమైన షాట్లు ఆడటం కనిపించదు. కానీ పరుగులు వస్తాయి. అడపాదడపా గ్యాప్‌లలోకి ఫోర్లు కొట్టినా... ఈ ఇద్దరూ ఎక్కువగా నమ్ముకుంది స్ట్రయిక్ రొటేట్ చేయడం. సింగిల్ లేదు అనుకునే దగ్గర కూడా ఈ ఇద్దరూ కలిసి పరుగు రాబడతారు. దీనికి కారణం ఈ ఇద్దరికీ కుదిరిన సమన్వయం. మైదానంలో ప్రొఫెషనల్‌గానే కాదు... వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య పెరిగిన స్నేహం కూడా దీనికి కారణం. నిలకడకు మారుపేరు గంభీర్, ఉతప్ప కలిసి ఇప్పటివరకూ 28 ఇన్నింగ్స్‌లో ఓపెనింగ్ చేస్తే ఇందులో 18 సార్లు 30 పరుగులకి పైగా భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఐపీఎల్లో మరే జట్టుకూ ఇంత నిలకడైన ఓపెనింగ్ భాగస్వామ్యాలు లేవు. వాస్తవానికి 2014 సీజన్లో ఉతప్ప ఓపెనర్ కాదు. లోయర్ ఆర్డర్లో ఆడేవాడు. ఆ సీజన్లో గంభీర్, కలిస్, మనీష్ పాండే, బిస్లా... ఈ నలుగురూ కలిసి రకరకాల కాంబినేషన్లలో ఆడారు. కానీ ఏ ఒక్క జోడీ హిట్ కాలేదు. అప్పటికి ఉతప్ప కూడా లోయర్ ఆర్డర్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. అయితే ఓ రోజు మ్యాచ్‌కు ముందు జట్టు సమావేశంలో ఓపెనర్ల గురించి చర్చ జరిగినప్పుడు... తాను తొలి స్థానంలో సౌకర్యంగా ఆడతానని ఉతప్ప చెప్పాడు. దీంతో అవకాశం ఇచ్చారు. 2014 మే 2న తొలిసారి ఇద్దరూ కలిసి ఆడారు. ఆ మ్యాచ్‌లో గంభీర్ రనౌట్ అయ్యాడు. కానీ ఇద్దరూ కూర్చుని మాట్లాడుకున్న తర్వాత... ఒకరితో ఒకరికి స్నేహం పెరిగాక వికెట్ల మధ్య పరుగులోనూ సమస్యలు తొలిగిపోయాయి. ఆ మ్యాచ్ తర్వాత ఈ జోడీ ఆడుతుండగా ఒక్కసారి కూడా రనౌట్ కాలేదు. ఆ సీజన్లో ఉతప్ప కోల్‌కతాకు అద్భుతాలు చేసి పెట్టాడు. ఏకంగా 660 పరుగులతో ‘ఆరెంజ్ క్యాప్’ సంపాదించడంతో పాటు కోల్‌కతాను చాంపియన్‌గా నిలబెట్టాడు. ఒకరి మీద ఒకరికి నమ్మకం గంభీర్, ఉతప్పల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ముఖ్యంగా వికెట్ల మధ్య పరుగు విషయంలో ఇది బాగా కనిపిస్తుంది. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఎక్కువ. ఒకరి నిర్ణయాన్ని మరొకరు గౌరవిస్తారు. గంభీర్ సింగిల్ కోసం బయల్దేరాడంటే ఉతప్ప కూడా గుడ్డిగా పరుగెడతాడు. సహచరుడి జడ్జిమెంట్ మీద పరస్పరం ఉన్న నమ్మకం ఇది. హైదరాబాద్‌లో సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఇది బాగా కనిపించింది. పరిస్థితికి తగ్గట్లు ఇన్నింగ్స్ పేస్ మార్చడంలోనూ ఇద్దరూ సిద్ధహస్తులే. గంభీర్ వేగంగా ఆడుతున్న సమయంలో పొరపాటున కూడా ఉతప్ప షాట్ల కోసం వెళ్లడు. సింగిల్ తీసి వెంటనే స్ట్రయికింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇటు గంభీర్ కూడా అంతే. ఇద్దరిలోనూ ఉతప్ప కొంత మెరుైగె న హిట్టర్. ప్రస్తుతం ఈ ఇద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం కోల్‌కతాకు బాగా కలిసొచ్చే అంశం. ప్రయోగాల పరంపర కోల్‌కతాతో పోలిస్తే మిగిలిన జట్లు ఓపెనింగ్ కాంబినేషన్ కోసం ఇంకా తంటాలు పడుతూనే ఉన్నాయి. ప్రస్తుత సీజన్లో గుజరాత్ లయన్స్, పుణే జెయింట్స్ ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. సన్‌రైజర్స్ జట్టు కూడా 2014 నుంచి కేవలం రెండు జోడీలను మాత్రమే ప్రయత్నించింది. వార్నర్, ధావన్ ఇద్దరూ సూపర్ స్టార్స్ కావడం వల్ల ఓపెనర్లను మార్చడం లేదు. కానీ ప్రస్తుతం ధావన్ ఫామ్ చూస్తే త్వరలోనే హైదరాబాద్ జట్టు కూడా ఓపెనర్లను మార్చక తప్పకపోవచ్చు. ఇక ఓపెనర్ల విషయంలో ఏమాత్రం నిలకడ లేని జట్టు ముంబై ఇండియన్స్. 2014 నుంచి ఇప్పటివరకూ ఈ జట్టు 11 రకాల ఓపెనింగ్ కాంబినేషన్లను ప్రయత్నించింది. అటు ఢిల్లీ డేర్‌డెవిల్స్ కూడా ఈ మూడు సీజన్లలో 10 రకాల జోడీలను ఆడించింది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ 9 జోడీలతో ప్రయోగాలు చేస్తే... పంజాబ్ ఆరు కాంబినేష్లను ప్రయత్నించింది. ఏమైనా ఓపెనర్లు ఇద్దరూ ఫామ్‌లో ఉంటే ఆ జట్టు సురక్షితంగా ఉన్నట్లే. కోల్‌కతా విషయంలో మరోసారి ఇదే నిజమయింది. -
నరైన్ ఈసారి మరింత మెరుగ్గా ఆడతాడు: గంభీర్
సందేహాస్పద బౌలింగ్ శైలిని సరిచేసుకొని నిషేధాన్ని తొలగించుకున్న తమ జట్టు స్పిన్నర్ సునీల్ నరైన్.. ఈసారి ఐపీఎల్లో మరింత మెరుగ్గా రాణిస్తాడని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ధీమా వ్యక్తం చేశాడు. నిషేధం తొలగిపోవడంతో నరైన్‌పై ఎలాంటి ఒత్తిడి ఉండదని... ఈ పరిస్థితుల్లో అతని నుంచి అత్యుత్తమ ప్రదర్శన వస్తుందని గంభీర్ అన్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో 74 వికెట్లు తీసుకున్న నరైన్ 2012, 2014లలో కోల్‌కతాకు టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. -
దుమ్మురేపిన సెహ్వాగ్, గంభీర్
ఢిల్లీకి వరుసగా నాలుగో విజయం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చండీగఢ్: జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన ఢిల్లీ స్టార్ ఆటగాళ్లు గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, ఇషాంత్ శర్మ దేశవాళీ టోర్నీలో సత్తా చాటుకుంటున్నారు. ఈ త్రయం ప్రతిభతో సయ్యద్ ముస్తాక్ అలీ (నార్త్‌జోన్) టి20 టోర్నీలో ఢిల్లీ జట్టు వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. గౌతమ్ గంభీర్ (53 బంతుల్లో 75 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), వీరేంద్ర సెహ్వాగ్ (50 బంతుల్లో 49; 3 ఫోర్లు, 1 సిక్సర్)... బౌలింగ్‌లో ఇషాంత్ శర్మ (4/9) చెలరేగారు. ఫలితంగా హర్యానాతో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 9 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత హర్యానా 20 ఓవర్లలో 7 వికెట్లకు 140 పరుగులు చేసింది. ఇషాంత్ వరుస విరామాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అనంతరం ఢిల్లీ 17.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి 142 పరుగులు చేసింది. గంభీర్, వీరూ తొలి వికెట్‌కు 121 పరుగులు జోడించి ఢిల్లీ విజయాన్ని ఖాయం చేశారు. -
రా.. రా... రాయుడు
వడోదర: భారత టెస్టు జట్టులో తెలుగు తేజం అంబటి రాయుడుకు తొలిసారిగా చోటు దక్కింది. దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత వన్డే, టెస్టు జట్టును సోమవారం సెలక్టర్లు ప్రకటించారు. సుదీర్ఘ కాలంగా జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూసిన రాయుడు గత ఆగస్టులో జింబాబ్వే పర్యటనలో తొలిసారి వన్డే ఆడాడు. ప్రస్తుతం వన్డే జట్టుతో పాటు ఉన్నా తుది జట్టులో స్థానం దక్కడం లేదు. అయితే అనూహ్యంగా దక్షిణాఫ్రికా పర్యటనలో అటు వన్డేలు, ఇటు టెస్టు జట్టులోనూ రాయుడికి స్థానం దక్కింది. దీంతో వీవీఎస్ లక్ష్మణ్ తర్వాత మరోసారి రాష్ట్ర ఆటగాడికి స్థానం లభించినట్టయ్యింది. అలాగే ఏడాది కాలంగా ఫామ్‌లో లేక జట్టుకు దూరమైన పేసర్ జహీర్ ఖాన్‌ను సెలక్టర్లు కరుణించారు. కానీ రంజీల్లో రాణిస్తున్న ఓపెనర్ గౌతం గంభీర్‌ను దూరం పెట్టారు. టెస్టు జట్టును 17 మందితో, వన్డే జట్టును 16 మందితో ఎంపిక చేశారు. డిసెంబర్ 5 నుంచి మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. ఆ తర్వాత 18 నుంచి రెండు టెస్టుల సిరీస్ జరుగుతుంది. టెస్టు సిరీస్‌కు ముందు జట్టు రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. సచిన్ టెండూల్కర్ టెస్టుల నుంచి తప్పుకున్న అనంతరం భారత జట్టు తొలిసారిగా బరిలోకి దిగనుంది. ‘గంభీర్ పేరు చర్చకు వచ్చింది. చాలా విషయాలు మేం చర్చించాం. కెప్టెన్ ధోనితో కూడా సంప్రదించాం. జట్ల ఎంపిక ఏకగ్రీవంగా జరిగింది’ అని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ అన్నారు. గత డిసెంబర్లో జహీర్ చివరిసారిగా ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడాడు. గాయం, ఫామ్‌లో లేకపోవడంతో ఈ పేసర్ జట్టుకు దూరమయ్యాడు. అయితే పునరాగమనం కోసం కఠిన శిక్షణ తీసుకోవడమే కాకుండా ప్రస్తుత రంజీ సీజన్లో మూడు మ్యాచ్‌ల్లోనే 13 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అయితే జహీర్‌ను వన్డే జట్టులోకి పరిగణలోకి తీసుకోలేదు. అలాగే సెహ్వాగ్, హర్భజన్లను కూడా పక్కనబెట్టారు. టెస్టు జట్టులో బ్యాకప్ వికెట్ కీపర్‌గా వృద్ధిమాన్ సాహా ఉంటాడు. వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన జడేజా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇతర స్పిన్నర్లుగా అశ్విన్, ఓజా ఉంటారు. అమిత్ మిశ్రాకు వన్డే జట్టులో మాత్రమే చోటు దక్కింది. ఆసీస్‌తో జరిగిన ఏడు వన్డేల సిరీస్‌లో ధారాళంగా పరుగులు సమర్పించిన ఇషాంత్ శర్మను వన్డే జట్టులో కూడా ఉంచారు. జయదేవ్ ఉనాద్కట్, వినయ్ కుమార్‌లు వన్డేల్లో చోటు కోల్పోయారు. ఉమేశ్ యాదవ్, రహానే రెండు జట్లలోనూ ఉన్నారు. సచిన్ ‘స్థానం’లో కోహ్లి! ఓవరాల్‌గా టెస్టు జట్టులో ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్, ఇద్దరు వికెట్ కీపర్లు, ఐదుగురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు, ఒక ఆల్‌రౌండర్ ఉన్నాడు. మురళీ విజయ్, శిఖర్ ధావన్ ఇన్నింగ్స్‌ను ఆరంభించనుండగా టెండూల్కర్ స్థానంలో విరాట్ కోహ్లి వచ్చే అవకాశం ఉంది. మూడో నంబర్లో పుజారా, రోహిత్ ఐదో స్థానంలో రానుండగా రహానే, జడేజాలలో ఒకరు జట్టు కూర్పులో భాగంగా బరిలోకి దిగుతారు. తుది జట్టులో జహీర్‌తో పాటు... షమీ, ఇషాంత్, భువనేశ్వర్, ఉమేశ్‌లలో ఇద్దరు బరిలోకి దిగే అవకాశం ఉంది. -
సెహ్వాగ్, గంభీర్‌లకు పరీక్ష
హూబ్లీ: ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న సీనియర్ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్‌లకు కఠిన పరీక్ష. జాతీయ జట్టులోకి పునరాగమనం చేయాలంటే కచ్చితంగా రాణించాల్సిన సమయం. ఈ నేపథ్యంలో నేటి (బుధవారం) నుంచి జరగనున్న అనధికార మూడో టెస్టులో భారత్ ‘ఎ’ జట్టు... వెస్టిండీస్ ‘ఎ’తో అమీతుమీ తేల్చుకోనుంది. రెండో టెస్టులో డ్రాతో గట్టెక్కిన టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోసారి సెహ్వాగ్, గంభీర్‌లపైనే అందరి దృష్టి నెలకొంది. బ్యాటింగ్‌లో సంచలనాలు సృష్టిస్తే తప్ప ఈ ఇద్దరికి మరో అవకాశం దక్కకపోవచ్చు. గత 30 టెస్టుల్లో ఒక్క సెంచరీ కూడా చేయని వీరూ రెండో మ్యాచ్‌లో 7 పరుగులు మాత్రమే చేయగా... గౌతీ (11 పరుగులు) ఘోరంగా విఫలమయ్యాడు. ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న పేసర్ జహీర్ కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు. అయితే ఏడాది తర్వాత మ్యాచ్ ఆడటం, రెండో మ్యాచ్‌లో స్లో వికెట్ ఎదురుకావడం వంటి అంశాలతో జహీర్‌పై విమర్శకులు కాస్త వెనక్కి తగ్గినా... వికెట్ తీస్తేనే జట్టులో చోటు ఖాయమనేది సుస్పష్టం. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఈ ముగ్గురు ఏ మేరకు గాడిలో పడతారనేది ఆసక్తికరం. కెప్టెన్ చతేశ్వర్ పుజారా బ్యాటింగ్‌లో సత్తా చాటలేకపోతున్నాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 45 పరుగులు మాత్రమే చేశాడు. అయితే జగదీష్, అభిషేక్ నాయర్, ఉదయ్ కౌల్లు రాణిస్తుండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. జట్టులో మార్పులు చేయాలనుకుంటే ఆల్‌రౌండర్ పారస్ డోగ్రా, షెల్డన్ జాక్సన్, ధావల్ కులకర్ణిలకు అవకాశం దక్కొచ్చు. బౌలింగ్‌లో భార్గవ్ భట్, పర్వేజ్ రసూల్‌లు విశేషంగా రాణిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా వీరిపైనే భారం పడనుంది. మరోవైపు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న విండీస్ ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకూడదని భావిస్తోంది. ఎడ్వర్డ్స్, బ్రాత్‌వైట్, ఫుదాదిన్, దేవ్‌నారాయణ్, జాన్సన్, మిల్లర్లు ఫామ్ కొనసాగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఉపఖండపు పరిస్థితులను బాగా ఆకళింపు చేసుకున్న స్పిన్నర్లు స్థాయి మేరకు రాణిస్తుండటం విండీస్‌కు లాభిస్తోంది. ఈ మ్యాచ్‌లోనూ అదే ఊపు కొనసాగితే భారత్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. కనీసం ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా సిరీస్ కరీబియన్ల సొంతమవుతుంది. కాబట్టి హోరాహోరీ పోరు తప్పకపోవచ్చు. -
సెహ్వాగ్, గంభీర్‌లపైనే దృష్టి
షిమోగా: బ్యాటింగ్ వైఫల్యంతో తొలి మ్యాచ్‌లో ఘోరంగా ఓడిన భారత్ ‘ఎ’ జట్టు రెండో మ్యాచ్ కోసం సిద్ధమైంది. నేటి నుంచి వెస్టిండీస్ ‘ఎ’తో జరగనున్న అనధికార టెస్టులో అమీతుమీ తేల్చుకోనుంది. జాతీయ జట్టులోకి పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న సీనియర్లు సెహ్వాగ్, గంభీర్, జహీర్‌లు ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. దీంతో అందరి దృష్టి వారిపైనే నెలకొంది. మేటి ఆటగాళ్లు ఉన్న జట్టును చతేశ్వర్ పుజారా ఎలా నడిపిస్తాడన్నదే ఇప్పుడు ఆసక్తికరం. గత 30 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ చేయని వీరూ ఈ మ్యాచ్‌తోనైనా గాడిలో పడాలని భావిస్తుండగా... గంభీర్ కూడా సత్తా చాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే ఎన్‌కేపీ సాల్వే చాలెంజర్ ట్రోఫీలో ఈ ఇద్దరు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో వీరిద్దరి భవిష్యత్‌కు ఈ మ్యాచ్ పరీక్షగా నిలవనుంది. ఫిట్నెస్ సమస్యలతో జట్టుకు దూరమైన జహీర్ కూడా సరైన ఫామ్‌లో లేడు. 2011 వన్డే వరల్డ్‌కప్ తర్వాత ఏడు టెస్టులు ఆడిన అతను పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ఈ ముగ్గురిపై ఒత్తిడి నెలకొంది. అయితే అంతర్జాతీయ వేదికలపై విశేష అనుభవం ఉన్న ఈ ముగ్గురు ఆకట్టుకుంటే రాబోయే విండీస్ సిరీస్‌కు జట్టు ఎంపిక చేయడం సెలక్టర్లకు కత్తిమీద సామే. మంగళవారం ప్రాక్టీస్ సందర్భంగా సెహ్వాగ్ వేలికి గాయమైంది. అయితే వీరూ అందుబాటులో ఉండేదీ లేనిదీ మ్యాచ్‌కు ముందే తెలుస్తుందని కెప్టెన్ పుజారా చెప్పాడు. షెల్డన్ జాక్సన్, నాయర్, డోగ్రా, ఉదయ్ కౌల్, కైఫ్‌లు బ్యాటింగ్‌లో రాణిస్తే భారీ స్కోరు ఖాయం. తొలి టెస్టులో పుజారాతో పాటు బౌలింగ్‌లో ఈశ్వర్ పాండే, మహ్మద్ షమీలు విఫలం కావడం మేనేజ్మెంట్ను ఆందోళనలో పడేసింది. మరోవైపు తొలి మ్యాచ్ విజయంతో విండీస్ జట్టులో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో సెహ్వాగ్, గంభీర్, జహీర్‌లను ఎదుర్కోవడంపైనే ఆ జట్టు విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి. కెప్టెన్ కిర్క్ ఎడ్వర్డ్స్, బ్రాత్‌వైట్, పుదాదిన్లతో పాటు పావెల్ కూడా మంచి టచ్‌లో ఉన్నాడు. భారత పరిస్థితుల్లో విండీస్ స్సిన్నర్లు తమ మ్యాజిక్‌ను ప్రదర్శిస్తున్నారు. మిల్లర్, పెరుమాల్ల నిలకడ వాళ్లకు లాభిస్తోంది.