
వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా టీమిండియా బంగ్లాదేశ్‌తో సిరీస్ ఆడుతోంది సొంతగడ్డపై జరుగుతున్న ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది

చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో 280 పరుగుల తేడాతో గెలుపొంది సత్తా చాటింది రెండో మ్యాచ్ ఆడేందుకు టీమిండియా కాన్పూర్‌కు వెళ్లనుంది

ఈ క్రమంలో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు అక్కడ బీజేపీ నేత మితిలేశ్ కుమార్ కతేరియా వీరితో కలిసి ఫొటోలు దిగారు

వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి

తొలి టెస్టులో కోహ్లి కేవలం 23 పరుగులే చేసి నిరాశపరిచాడు