పాండ్యా జాక్‌పాట్ | Hardik Pandya good enough to play Test cricket | Sakshi
Sakshi News home page

పాండ్యా జాక్‌పాట్

Published Wed, Nov 2 2016 10:44 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM

పాండ్యా జాక్‌పాట్

పాండ్యా జాక్‌పాట్

టెస్టు జట్టులోకి ఎంపికై న హార్ధిక్
గంభీర్ స్థానం పదిలం, తిరిగొచ్చిన ఇషాంత్
గాయంతో రోహిత్ శర్మ అవుట్ 

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు జట్టు ఎంపికలో పెను సంచలనం. ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకు భారత జట్టులో చోటు దక్కింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేకపోరుునా, ఇటీవల కాలంలో మెరుగైన పేస్ బౌలింగ్ చేస్తున్న కారణంగా హార్ధిక్‌కు జాక్‌పాట్ తగిలింది. కేవలం పది నెలల వ్యవధిలో మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టులోకి వచ్చేశాడు. న్యూజిలాండ్‌తో ఆఖరి వన్డేలో గాయపడిన రోహిత్ శర్మ టెస్టు సిరీస్‌కు అందుబాటులో లేకపోవడం కూడా ఊహించని అంశం.

ముంబై: భారత క్రికెట్‌లో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా నలుగురు రెగ్యులర్ క్రికెటర్లు గాయం కారణంగా సెలక్షన్‌కు అందుబాటులో లేకుండా పోయారు. ఓపెనర్లు శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్‌లతో పాటు రోహిత్ శర్మ కూడా గాయంతో టెస్టులకు దూరమయ్యాడు. భువనేశ్వర్ కుమార్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇద్దరు ఓపెనర్లు అందుబాటులో లేకపోవడంతో గంభీర్ తన స్థానం నిలబెట్టుకున్నాడు. జ్వరం కారణంగా న్యూజిలాండ్‌తో సిరీస్ ఆడని ఇషాంత్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చాడు. నలుగురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు, ఒక పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్, వికెట్ కీపర్, ఆరుగురు బ్యాట్స్‌మెన్‌తో మొత్తం 15 మంది సభ్యుల జట్టును తొలి రెండు టెస్టులకు భారత సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టుకు అజింక్య రహానే వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్టర్ల బృందం గంటలోపే జట్టు ఎంపికను పూర్తి చేసింది. పాండ్యా ఎంపిక మినహా బాగా ఆశ్చర్యపరచిన నిర్ణయాలు లేకపోరుునా... ఆటగాళ్ల గాయాల విషయంలో బోర్డు సరైన సమాచారం ఇవ్వడం లేదని మరోసారి స్పష్టమైంది. జట్టు  ఎంపికకు ముందు రోజు కూడా రాహుల్, ధావన్ ఫిట్‌నెస్ పరీక్షకు హాజరవుతున్నారనే వార్తలు వచ్చారుు. ఇక రోహిత్‌కు గాయమై నాలుగు రోజులు గడిచినా బయటకు సమాచారం లేదు. సెలక్షన్ కమిటీ సమావేశానికి కాస్త ముందు జట్టు ఫిజియో పాట్రిక్ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు సంబంధించిన రిపోర్ట్‌ను అందించారు. రోహిత్ శర్మ అందుబాటులో లేకపోరుునా మిడిలార్డర్ కోసం సెలక్టర్లు మరో బ్యాట్స్‌మన్‌ను ఎంపిక చేయలేదు. కరుణ్‌ను ఓపెనర్లతో పాటు మిడిలార్డర్‌కు కూడా బ్యాకప్‌గా పరిగణించాలి. తొలి టెస్టు నవంబరు 9 నుంచి రాజ్‌కోట్‌లో, రెండో టెస్టు 17 నుంచి విశాఖపట్నంలో జరుగుతుంది.

ఇంగ్లండ్ బలహీనతను చూసి...
భారత్ స్వదేశంలో ముగ్గురు స్పిన్నర్లతో ఆడటం కొత్తేం కాదు. అరుుతే ఇటీవల కాలంలో ఇది కాస్త తగ్గింది. అశ్విన్, జడేజా ఇద్దరే న్యూజిలాండ్‌తో సిరీస్‌లో మూడు మ్యాచ్‌లూ ఆడారు. అరుుతే బంగ్లాదేశ్‌లో ఇంగ్లండ్ జట్టు స్పిన్‌ను ఆడటంలో ఘోరంగా దెబ్బతింది. ముఖ్యంగా మిర్పూర్‌లో జరిగిన రెండో టెస్టులో ఒకే సెషన్‌లో మొత్తం పది వికెట్లూ కోల్పోరుుంది. ఈ పది వికెట్లూ స్పిన్నర్లే తీశారు. కాబట్టి ఇంగ్లండ్‌కు ఉన్న ఈ బలహీనతను ఈసారి భారత జట్టు ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తోంది. ముగ్గురు స్పిన్నర్లతో తుది జట్టును ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నారుు. దానికి అనుగుణంగానే టెస్టు జట్టును ప్రకటించినట్లు కనిపిస్తోంది.

పాండ్యా లేదా కరుణ్
తొలి టెస్టులో ఒకరికి కచ్చితంగా అవకాశం

ఈసారి జట్టు ఎంపికలో బ్యాట్స్‌మెన్ కంటే బౌలర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. నిజానికి అదనంగా బ్యాట్స్‌మన్ అందుబాటులో లేకుండా జట్టు ఎంపిక జరిగింది. స్వదేశంలో సిరీస్ కాబట్టి అవసరమైతే అప్పటికప్పుడు మరో బ్యాట్స్‌మన్‌ను పిలవొచ్చు అనేది సెలక్టర్ల ఉద్దేశం కావచ్చు. ఇక నలుగురు స్పిన్నర్లను అందుబాటులో ఉంచడం ద్వారా ఇంగ్లండ్‌ను స్పిన్ పిచ్‌లతో దెబ్బకొట్టే వ్యూహం కనిపిస్తోంది. ఒకసారి జట్టు కూర్పును పరిశీలిస్తే....

ఓపెనర్లు: గంభీర్, విజయ్ ఇద్దరూ ఆడటం ఖాయం. ఒకవేళ ఆఖరి నిమిషంలో ఎవరైనా గాయపడితే కరుణ్ నాయర్ బ్యాకప్‌గా ఉంటాడు.


మిడిలార్డర్: ఫస్ట్‌డౌన్‌లో పుజారా, ఆ తర్వాత కోహ్లి, రహానే ఆడతారు. కీపర్ సాహా ఎలాగూ ఉంటాడు. ఐదుగురు బౌలర్లతో ఆడితే ఇక్కడి వరకు సరిపోతారు. ఒకవేళ నలుగురు బౌలర్లతో ఆడితే స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా కరుణ్ నాయర్ ఆడతాడు.

పేస్ ఆల్‌రౌండర్: ఇటీవల కాలంలో భారత్‌కు టెస్టుల్లో అందుబాటులో లేని విభాగం ఇది. వెస్టిండీస్‌లో స్టువర్ట్ బిన్నీకి అవకాశం వచ్చినా వినియోగించుకోలేకపోయాడు. నిజానికి ఒక పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఉంటే అదనంగా మరో బౌలర్‌ను తీసుకున్నా ఇబ్బంది ఉండదు. ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు జట్టులో ఉంటే కరుణ్ లేదా పాండ్యాలలో ఒకరికి కచ్చితంగా తుది జట్టులో అవకాశం దక్కుతుంది. ఒకవేళ ముగ్గురు స్పిన్నర్లను తుది జట్టులో ఆడిస్తే కచ్చితంగా రెండో పేసర్‌గా, ఆల్‌రౌండర్‌గా పాండ్యాకు అరంగేట్రం అవకాశం దక్కుతుంది.

స్పిన్నర్లు: అశ్విన్, జడేజా విశ్రాంతి తర్వాతి జట్టులోకి వచ్చారు. న్యూజిలాండ్‌తో సిరీస్ అంతటా జట్టుతో పాటే ఉన్న మిశ్రాతో పాటు ఆ సిరీస్‌లో అశ్విన్‌కు బ్యాకప్‌గా పిలిపించిన జయంత్ యాదవ్ కూడా స్థానం నిలబెట్టుకున్నాడు. ముగ్గురు ప్రధాన స్పిన్నర్లలో ఎవరికై నా గాయమైతే తప్ప తనకు తుది జట్టులో చోటు దక్కకపోవచ్చు.

పేసర్లు: కివీస్‌తో సిరీస్‌లో రాణించిన షమీతో పాటు ఉమేశ్ యాదవ్ స్థానం నిలబెట్టుకున్నాడు. ఆ సిరీస్‌కు డెంగీ జ్వరం కారణంగా అందుబాటులో లేని ఇషాంత్ తిరిగి వచ్చాడు. భువనేశ్వర్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోనందున సెలక్షన్‌లో డైలమా ఏమీ లేదు. కివీస్‌తో సిరీస్‌కు నలుగురు పేసర్లను ఎంపిక చేయగా... ఈసారి ముగ్గురు పేసర్లతో సరిపెట్టారు. అరుుతే పాండ్యా కారణంగా ఇక్కడా నలుగురు అందుబాటులో ఉన్నట్లే. గత సిరీస్‌కు బ్యాకప్‌గా వచ్చిన శార్దుల్ ఠాకూర్‌కు ఈసారి అవకాశం లేదు.

గాయాల బాధితులు
రోహిత్ శర్మ: వైజాగ్‌లో న్యూజిలాండ్‌తో ఆఖరి వన్డే సందర్భంగా తొడ భాగంలో గాయమైంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో సిరీస్ మొత్తానికి అందుబాటులో లేడు. ఒకవేళ ఈ గాయానికి ఆపరేషన్ అవసరమైతే మరింత కాలం దూరం కావచ్చు. ఆరు నెలల వరకూ విశ్రాంతి అవసరం అంటున్నారు.

కేఎల్ రాహుల్: న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ఆడుతూ తొడ కండరాల గాయం బారిన పడ్డాడు. ఆ తర్వాత సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. నిజానికి తను గాయం నుంచి దాదాపుగా కోలుకున్నా పూర్తి ఫిట్‌నెస్‌తో లేడు. దీంతో తొలి రెండు టెస్టులకు లేడు. ఆఖరి రెండు టెస్టులు ఆడే అవకాశం ఉంది.

శిఖర్ ధావన్: న్యూజిలాండ్‌తో రెండో టెస్టు సందర్భంగా బొటనవేలికి గాయమైంది. దీంతో ఆ తర్వాత సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఇంగ్లండ్‌తో చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

భువనేశ్వర్: న్యూజిలాండ్‌తో రెండో టెస్టు సందర్భంగా తొడ కండరాల గాయంతో బాధపడ్డాడు. ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులు ముగిసేలోపు ఒక్క రంజీ మ్యాచ్ అరుునా ఆడి ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది.

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు
కోహ్లి (కెప్టెన్), గంభీర్, విజయ్, పుజారా, రహానే, సాహా, పాండ్యా, అశ్విన్, జడేజా, ఇషాంత్, షమీ, ఉమేశ్, అమిత్ మిశ్రా, జయంత్ యాదవ్, కరుణ్ నాయర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement