
టీమిండియా కొత్త హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ పేరును బీసీసీఐ మంగళవారం(జూలై 9) ప్రకటించింది

రాహుల్ ద్రవిడ్ స్థానంలో ఇకపై అతడు భారత పురుషుల క్రికెట్ జట్టు శిక్షకుడిగా సేవలు అందిస్తాడని తెలిపింది

ఈ విషయంపై గౌతం గంభీర్ స్పందిస్తూ.. ఇది తనకు దక్కిన గౌరవం అని హర్షం వ్యక్తం చేశాడు

‘‘నా చిరునామా భారతదేశం. దేశానికి సేవ చేయగలడం నా జీవితంలో కలిగిన అతి పెద్ద అదృష్టం.

ఇప్పుడు మరో రూపంలో పునరాగమనం చేయడం గౌరవంగా భావిస్తున్నా.

ఎప్పటిలాగే ప్రతీ భారతీయుడు గర్వపడేలా చేయడమే నా లక్ష్యం.

140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను టీమిండియా మోస్తుంది.

వారి కలలు నిజంచేసేందుకు నా స్థాయిలో ఏదైనా చేసేందుకు నేను సిద్ధం’’’ అని గంభీర్ పేర్కొన్నాడు

ఇక గౌతీ సతీమణి నటాషా జైన్ సైతం భర్త కొత్త పదవి పట్ల సంతోషం వ్యక్తం చేశారు

కేవలం అతడికి మాత్రమే టీమిండియాను ముందుకు నడిపే అర్హత ఉందంటూ ఓ నెటిజన్ చేసిన పోస్టును నటాషా తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు

నటాషా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది

కాగా నటాషాను ప్రేమించిన గంభీర్ 2011లో ఆమెను వివాహం చేసుకున్నాడు

ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు ఆజీన్, అనైజా ఉన్నారు

