
పుణే: ఢిల్లీ ఓపెనర్లు గౌతమ్ గంభీర్ (216 బంతుల్లో 127; 21 ఫోర్లు), కునాల్ చండేలా (192 బంతుల్లో 113; 18 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో కదంతొక్కారు. బెంగాల్‌తో ఇక్కడ జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్ పోరులో వీళ్లిద్దరి వీరవిహారంతో ఢిల్లీ భారీ స్కోరు దిశగా సాగుతోంది. సోమవారం రెండో రోజు ఆటలో ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 77.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. బౌలర్లపై బౌండరీల వర్షం కురిపించిన ఓపెనర్లిద్దరు తొలి వికెట్‌కు 232 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించారు. బెంగాల్ బౌలర్లు 61 ఓవర్లు వేసినా ఈ జోడీని విడగొట్టలేకపోయారు. 62వ ఓవర్లో ఎట్టకేలకు చండేలాను అమిత్ అవుట్ చేయడంతో బెంగాల్ ఊపిరి పీల్చుకుంది. స్వల్ప వ్యవధిలో గంభీర్, ధ్రువ్ (12) నిష్క్రమించినప్పటికీ బెంగాల్‌కు జరగాల్సిన నష్టం జరిగింది. కేవలం 15 పరుగులే వెనుకబడి ఉన్న ఢిల్లీ చేతిలో ఇంకా 7 వికెట్లున్నాయి. అంతకుముందు 269/7 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన బెంగాల్ 286 పరుగుల వద్ద ఆలౌటైంది.
కరుణ్ నాయర్ శతకం... కర్ణాటకకు ఆధిక్యం
కోల్‌కతాలో విదర్భతో జరుగుతున్న రెండో సెమీస్‌లో కర్ణాటక ఆధిక్యం సాధించింది. 36/3 స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 93 ఓవర్లలో 8 వికెట్లకు 294 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ (148 బ్యాటింగ్; 20 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ సాధించాడు. ఇతనికి గౌతమ్ (73; 8 ఫోర్లు) ఒక్కడే అండగా నిలిచాడు. ప్రస్తుతం 109 పరుగుల ఆధిక్యంలో ఉన్న కర్ణాటక చేతిలో ఇంకా రెండు వికెట్లున్నాయి. నాయర్‌తో పాటు కెప్టెన్ వినయ్ కుమార్ (20 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో విదర్భ 185 పరుగులకే ఆలౌటైంది.
Comments
Please login to add a commentAdd a comment