‘సెంచరీ గురించి ఆలోచించలేదు’ | I hope to win Man of the Match awards in remaining two games, says Shreyas Iyer | Sakshi
Sakshi News home page

‘సెంచరీ గురించి ఆలోచించలేదు’

Published Thu, May 11 2017 10:24 AM | Last Updated on Tue, Sep 5 2017 10:56 AM

‘సెంచరీ గురించి ఆలోచించలేదు’

‘సెంచరీ గురించి ఆలోచించలేదు’

కాన్పూర్‌: సెంచరీ గురించి ఆలోచించలేదని, మ్యాచ్‌ గెలవడమే ముఖ్యం అనుకున్నానని ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ తెలిపాడు. గుజరాత్‌ లయన్స్‌తో బుధవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో శ్రేయస్‌ అద్భుతంగా ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. నాలుగు పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడు. 57 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 96 పరుగులు చేశాడు. అత్యుత్తమ పోరాట పటిమ కనబరిచి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అందుకున్నాడు.

ఈ సందర్భంగా శ్రేయస్‌ మాట్లాడుతూ... ‘మ్యాచ్‌ నేను ముగిస్తే ఇంకా ఆనందపడేవాడిని. సెంచరీ గురించి ఎక్కువగా ఆలోచించలేదు. చివరి వరకు క్రీజ్‌లో ఉండాలని బ్యాటింగ్‌కు దిగినప్పుడే అనుకున్నా. సెంచరీ ముఖ్యం కాదు, గెలవడం ముఖ్యం. ప్రతి బంతిని బాదడానికి ప్రయత్నించాను. ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సివుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ రాణిం​చి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌లు అందుకోవడానికి ప్రయత్నిస్తాన’ని చెప్పాడు.

శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌పై కెప్టెన్‌ జహీర్‌ ఖాన్‌ కూడా సంతోషం వ్యక్తం చేశాడు. చివరి రెండు మ్యాచుల్లోనూ గెలిచి గౌరవప్రదంగా టోర్ని నిష్క్రమిస్తామని చెప్పాడు. గుజరాత్‌, ఢిల్లీ ప్లేఆఫ్‌కు అర్హత సాధించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement