మన హైదరాబాదీ దూరం
మన హైదరాబాదీ దూరం
Published Wed, May 17 2017 7:50 PM | Last Updated on Sun, Mar 10 2019 8:23 PM
బెంగళూరు: బెంగళూరు: గత మ్యాచ్ లో అద్భుత బౌలింగ్ తో జట్టును ప్లే ఆఫ్ కు చేర్చిన లోకల్ బాయ్ మహ్మద్ సిరాజ్ ఎలిమినేటర్ మ్యాచ్ కు దూరమయ్యాడు. సన్ రైజర్స్ బిపుల్ శర్మను ఎంపిక చేయడంతో సిరాజ్ స్థానం కోల్పోవల్సి వచ్చింది. గత గుజరాత్ లయన్స్ మ్యాచ్ లో 4 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న సిరాజ్ ను ఎంపిక చేయకపోవడం హైదరాబాదీ అభిమానులను విస్మయానికి గురి చేసింది. ఈ ఎలిమినేటర్ రసవత్తరపోరుకు చిన్న స్వామి స్టేడియం వేదికవ్వగా, టాస్ నెగ్గిన కోల్ కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో నెగ్గిన జట్టు క్వాలిఫయర్-2 లో ముంబై ఇండియన్స్ తో తలపడనుంది.
టైటిల్ నెగ్గాలంటే ఖచ్చితంగా రెండు మ్యాచ్ లు గెలవాల్సిందే. ఇప్పటికే ఇరు జట్లు లీగ్ దశలో రెండు సార్లు తలపడగా చెరో సారి విజయం సాధించాయి. ఇక బ్యాటింగ్, బౌలింగ్ లో ఇరు జట్లు బలాలు సమంగా ఉన్నాయి. చేతి వ్రేలి గాయంతో మ్యాచ్ కు దూరం అవుతాడని భావించిన యువరాజ్ ఎట్టకేలకు తుది జట్టులోకి వచ్చాడు. అయితే జట్టులో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక కోల్ కతా టీం లో కూడా స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. సూర్య కుమార్ యాదవ్, నాథన్ కౌల్టర్ నిల్, పీయుష్ చావ్లా, ఇషాంక్ జగ్గి జట్టులోకి రాగా గాయంతో మనీష్ పాండే దూరం అవ్వగా కుల్దీప్ బెంచ్ కు పరిమితం అయ్యాడు.
.తుది జట్లు
కోల్‌కతా నైట్‌రైడర్స్: గంభీర్ (కెప్టెన్), రాబిన్ ఉతప్ప, లిన్, మనీశ్ పాండే, యూసుఫ్ పఠాన్, గ్రాండ్‌హోమ్, సునీల్ నరైన్, సూర్యకుమార్ యాదవ్, నాథన్ కౌల్టర్ నిల్ పీయుష్ చావ్లా, బౌల్ట్, ఉమేశ్ యాదవ్.
సన్‌రైజర్స్ హైదరాబాద్: వార్నర్ (కెప్టెన్), ధావన్, విజయ్ శంకర్, విలియమ్సన్, యువరాజ్, నమన్ ఓజా, క్రిస్ జోర్డాన్, బిపుల్ శర్మ, రషీద్ ఖాన్, భువనేశ్వర్, సిద్ధార్థ్ కౌల్.
Advertisement
Advertisement