ముంబై ఇండియన్స్ బౌలర్ల దాటికి ఢిల్లీ డేర్‌డెవిల్స్ చిగురుటాకులా వణికింది. 213 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఈ జట్టు ఆటగాళ్లు కనీసం పోరాటం చేయకుండానే అవమానకరంగా తోక ముడిచారు. ఫలితంగా ఫిరోజ్ షా కోట్లా మైదానంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన 146 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది.