దాని గురించి ఆలోచించడం లేదు: రోహిత్ శర్మ | Rohit Sharma not swayed by rich history against rivals | Sakshi
Sakshi News home page

దాని గురించి ఆలోచించడం లేదు: రోహిత్ శర్మ

Published Fri, May 19 2017 6:32 PM | Last Updated on Tue, Sep 5 2017 11:31 AM

Rohit Sharma not swayed by rich history against rivals

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రను పరిశీలిస్తే కోల్ కతా నైట్ రైడర్స్ పై ముంబై ఇండియన్స్ అమోఘమైన రికార్డు ఉంది. ఇరు జట్లు ముఖాముఖి ఆడిన 20 మ్యాచ్ ల్లో 15 మ్యాచ్ ల్లో ముంబైదే విజయం. ఈ సీజన్ లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ముంబైది పైచేయి. దాంతో ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్  ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. అయితే ఈ ట్రాక్ రికార్డు గురించి అస్సలు ఆలోచించడం లేదని అంటున్నాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ. కేవలం మ్యాచ్ లో విజయం సాధించాలనే ఒకే ఒక్క ఆలోచనతో బరిలోకి దిగుతున్నామన్నాడు.

' ఈ టోర్నమెంట్ లో కేకేఆర్ పై రెండు సార్లు విజయం సాధించామనే ఆలోచన లేదు. కేవలం ఈ రోజు మ్యాచ్ పైనే మా దృష్టి ఉంది. తమదైన రోజున ఎవరైతే బాగా ఆడతారో వారే గెలుస్తారు. అంతేకానీ పాత రికార్డులు ఇక్కడ పని చేయవు. కాకపోతే కోల్ కతాపై గెలుస్తామనే ధీమాతో ఉన్నాం'అని రోహిత్ పేర్కొన్నాడు. శుక్రవారం ఇరు జట్ల మధ్య రెండో క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. రాత్రి గం.8.00ని.లకు చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్లు నాకౌట్ పోరుకు సన్నద్ధమయ్యాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement