
రైజింగ్ పుణెకు డు ప్లెసిస్ దూరం
రైజింగ్ పుణె సూపర్ జెయింట్ నుంచి ఆ జట్టు స్టార్ ఆటగాడు డు ప్లెసిస్ వైదొలుగుతున్నాడు.
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో వరుస విజయాలు సాధిస్తూ ప్లే ఆఫ్ బెర్తును ఖరారు చేసుకున్న రైజింగ్ పుణె సూపర్ జెయింట్ నుంచి ఆ జట్టు స్టార్ ఆటగాడు డు ప్లెసిస్ వైదొలుగుతున్నాడు. త్వరలో దక్షిణాఫ్రికా జట్టుతో కలవనున్న డు ప్లెసిస్.. ఇక పుణె ఆడే చివరి రెండు లీగ్ మ్యాచ్ లకు అందుబాటులో ఉండటం లేదని ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పుణె జట్టుకు ఇక అందుబాటులో ఉండటం లేదని విషయాన్ని స్పష్టం చేశాడు.
దక్షిణాఫ్రికాకు ఇంగ్లండ్ తో మూడు వన్డేల సిరీస్ ఉన్న నేపథ్యంలో డుప్లెసిస్ మధ్యలోనే ఐపీఎల్ నుంచి నిష్ర్కమించాల్సి వస్తుంది. ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్ జరిగిన మ్యాచ్ లో రైజింగ్ పుణె విజయం సాధించి ప్లే ఆఫ్ కు చేరిన సంగతి తెలిసిందే.