ఇంకా మాకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు: గేల్ | amazing how they still come to stadium and support us, gayle | Sakshi
Sakshi News home page

ఇంకా మాకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు: గేల్

Published Tue, May 9 2017 8:21 PM | Last Updated on Tue, Sep 5 2017 10:46 AM

ఇంకా మాకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు: గేల్

ఇంకా మాకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు: గేల్

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) -10 సీజన్ లో ముందుగానే ఇంటిదారి పట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆట తీరుపై అభిమానులకు క్షమాపణలు తెలియజేశాడు ఆ జట్టు స్టార్ ఓపెనర్ క్రిస్ గేల్. ఈ సీజన్ లో పెద్దగా రాణించని గేల్.. తమ జట్టు వరుసగా మ్యాచ్ లు ఓడిపోతున్నా అభిమానులు మద్దతు తెలుపుతూనే ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 'ఈ సీజన్ లో మా ఆట తీరు బాలేదు. అందుకు ఫ్యాన్స్ అందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నా.

మేము వరుసగా ఓడిపోతున్నా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న అభిమానుల అభిమానం వెలకట్టలేనిది. అసలు ఇంతటి పేలవమైన ఆటను ప్రదర్శించినా ఇంకా ఎలా సపోర్ట్ చేస్తున్నారు. ఇక వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే'అని గేల్ పేర్కొన్నాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకూ 13 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ 10 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. కేవలం రెండు మ్యాచ్ ల్లోనే గెలుపును సొంతం చేసుకోగా, ఒక మ్యాచ్ రద్దయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement