ఐపీఎల్‌లో మళ్లీ మ్యాచ్ ఫిక్సింగ్?
► ఇద్దరు గుజరాత్ ఆటగాళ్ల పాత్ర ?
► ముగ్గురిని అరెస్టు చేసిన కాన్పూర్ పోలీసులు
► రూ.41 లక్షలు స్వాధీనం
న్యూఢిల్లీ: ఐపీఎల్ దేశంలో అత్యంత ఆదరణ ఉన్న ఆట. ప్రపంచ దేశాల ఆటగాళ్లు ఒకచొట చేరి ఆడే ఆట. ఇది ప్రపంచంలో క్రికెట్ ప్రేమికులకు అసలైన వినోదాన్ని అందిస్తనటంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ ఐపీల్‌కు ఓ మచ్చ ఉంది. అది మ్యాచ్ ఫిక్సింగ్. 2013లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఆటగాళ్లు ఆరోపణలు ఎదర్కున్న సంగతి తెలిసిందే. దీంతో రెండు జట్లు ఐపీఎల్ నుంచి తప్పించారు. అయితే తాజాగా మరో ఫిక్సింగ్ ఉదంతం వెలుగుచూసింది.
ఐపీఎల్‌పై ఫిక్సింగ్ , చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా ఫిక్సింగ్ ఆరోపణలతో ముగ్గురు వ్యక్తులను కాన్పూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఇద్దరు గుజరాత్ లయన్స్ ఆటగాళ్ల పాత్ర ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి బీసీసీఐ, ఐపీఎల్ అవినీతి నిరోధక శాఖకు గురువారం సమాచారం అందించిన సమాచారంతో రమేష్ నయన్ షా, రమేష్ కుమార్, వికాష్ కుమార్ అనే ముగ్గురిని అరెస్టు చేశారు.
ఉత్తర ప్రదేశ్ క్రైం బ్రాంచ్ పోలీసుల సహకారంతో ఐపీఎల్ అవినీతి నిరోధక శాఖ వీరిని అరెస్టు చేసింది. వీరి వద్ద పోలీసులు నుంచి రూ.41 నగదు స్వాధీనం చేసుకున్నారు. రమేష్‌కుమార్ గ్రీన్ పార్క్ స్టేడియంలో హోర్డింగుల కాంట్రాక్టర్. ఇతడు క్రికెట్ బెట్టింగులు పెట్టే అజ్మీర్‌కు చెందిన బంటి పేరుమీద గుజరాత్, ఢిల్లీ ఆటగాళ్లు ఉండే హోటల్లో రూమ్ బుక్ చేసుకొని ఆటగాళ్లతో కలిసినట్లు పోలీసులు భావిస్తునారు. ప్రస్తుతం బంటి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ ఇద్దరు గుజరాత్ ఆటగాళ్ల మీద నిఘా ఉందని, వారితో రమేష్ నయన్ షా తరచుగా వారితో కాంటాక్టులో ఉన్నట్లు భావిస్తున్నామని తెలిపారు. అయితే ఇంకా ఇది నిర్ధారణ కాలేదన్నారు.