
మాది సమష్టి వైఫల్యం:క్రిస్ గేల్
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో తమ జట్టు పేలవ ప్రదర్శనకు సమష్టిగా వైఫల్యమే కారణమని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ క్రిస్ గేల్ కుండ బద్ధలు కొట్టాడు.. ఇక్కడ ఏ ఒక్కర్నో నిందించాల్సిన పని లేదని గేల్ అభిప్రాయపడ్డాడు.
'మా ప్రదర్శన మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది. అన్ని డిపార్ట్మెంట్ల సమష్టి వైఫల్యమే మా ఘోర ఓటములకు కారణం. మా జట్టులో చాలా అతుకులున్నాయి. మొత్తంగా చూస్తే ఇక్కడ మా ఓవరాల్ ఆట బాగాలేదు. దాంతోనే ముందుగా టోర్నీ నుంచి బయటకు వచ్చేశాం. కాకపోతే తమ జట్టు కొన్ని సందర్భాల్లో బాగానే ఆడిందని గేల్ పేర్కొన్నాడు.ఇది తమకు ఒక అనుభవంగా ఉపయోగపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు.