ముంబైతో కేకేఆర్ అమీతుమీ
బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే రైజింగ్ పుణె సూపర్ జెయింట్ ముందుగానే తుది బెర్తును ఖరారు చేసుకోగా, మరో స్థానం కోసం ముంబై ఇండియన్స్- కోల్ కతా నైట్ రైడర్స్ లు పోటీ పడనున్నాయి. శుక్రవారం ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్ లో ఇరు జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ముంబై ఇండియన్స్ తుది జట్టులో మిచెల్ జాన్సన్ వచ్చి చేరాడు. గత మ్యాచ్ లో మెక్లీన్ గన్ గాయపడటంతో అతని స్థానంలో మిచెల్ జాన్సన్ ను వేసుకున్నారు.మరొకవైపు కోల్ కతా నైట్ రైడర్స్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. యూసఫ్ పఠాన్ స్థానంలో అంకిత్ రాజ్ పుత్ ను వేసుకోగా, ట్రెంట్ బౌల్ట్ స్థానంలో కాలిన్ డి గ్రాండ్ హోమ్ ను తీసుకున్నారు.
ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ కోల్ కతాపై ముంబై ఇండియన్స్ దే పైచేయి.ఈ నేపథ్యంలో ప్రత్యర్థిపై తమ ఘనచరిత్రను మరోసారి ఆవిష్కృతం చేసి తుది పోరుకు అర్హత సాధించాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది. ఈ కీలక సమరంలో పైచేయి సాధించాలని నైట్‌రైడర్స్ కసితో ఉంది. ఎలిమినేటర్‌లో డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సాధించిన విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న గంభీర్ బృందం తమలోని లోపాలను సరిదిద్దుకుని ఎదురుదాడికి దిగేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది.
కోల్ కతా తుది జట్టు: గౌతం గంభీర్(కెప్టెన్) రాబిన్ ఉతప్ప, క్రిస్ లిన్, ఇషాంక్ జగ్గి, సూర్యకుమార్ యాదవ్, పీయూష్ చావ్లా, సునీల్ నరైన్, ఉమేశ్ యాదవ్, అంకిత్ రాజ్ పుత్, కుల్టర్ నీల్, గ్రాండ్ హోమ్
ముంబై తుది జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), లెండిల్ సిమన్స్, పార్థీవ్ పటేల్, అంబటి రాయుడు, పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, మిచెల్ జాన్సన్, కరణ్ శర్మ, బూమ్రా, లసిత్ మలింగా