'మా క్రికెటర్లు ఐపీఎల్లో ఆడతారు'
న్యూఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో తమ దేశ క్రికెటర్లు పాల్గొనకుండా చేయడానికి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎత్తుగడలు వేస్తుందంటూ వచ్చిన వార్తలను మాజీ ఆటగాడు మైకేల్ క్లార్క్ ఖండించాడు. ఆ వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని తాజాగా పేర్కొన్నాడు. అసలు ఐపీఎల్ కు ఆసీస్ క్రికెటర్లను దూరం చేయాలనే భావన తమ దేశ క్రికెట్ బోర్డుకు లేదన్నాడు. ప్రధానంగా ఐపీఎల్ ను అమితంగా ప్రేమించే స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లను ఆడనివ్వకుండా చేయడానికి సీఏ ఎటువంటి ప్రయత్నాలు చేయలేదన్నాడు.
'ఐపీఎల్ అనేది ఒక అద్భుతమైన టోర్నమెంట్. క్రికెటర్ల వ్యక్తిగత ప్రయోజనాల కంటే కూడా గేమ్ చాలా గొప్పది. డొనాల్డ్ బ్రాడ్ మన్లాంటి దిగ్గజ క్రికెటర్ వీడ్కోలు తీసుకున్నా గేమ్ ఉంది కదా. ఎవరు వెళుతున్నారు.. ఎవరు ఉంటున్నారు అనేది పెద్ద విషయమే కాదు. వరల్డ్ లో క్రికెట్ అనేది గొప్ప గేమ్. క్రికెట్ ను ప్రేమించే డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ లు ఐపీఎల్లో కచ్చితంగా ఆడతారు' అని క్లార్క్ తెలిపాడు.