ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌పై ఉన్న జీవితకాల కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేశారు. 2018లో సాండ్ పేపర్ వివాదంలో (కేప్‌టౌన్ టెస్ట్‌లో) వార్నర్‌పై జీవితకాల కెప్టెన్సీ నిషేధం విధించబడింది. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్‌పై కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. సాండ్ పేపర్ వివాదంలో వార్నర్ ఏడాది పాటు ఆటకు కూడా దూరయ్యాడు.
క్రికెట్ ఆస్ట్రేలియా తాజా నిర్ణయంతో వార్నర్ బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది. నిషేధం కారణంగా వార్నర్ ఆస్ట్రేలియా కెప్టెన్‌గా పని చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 37 ఏళ్ల వార్నర్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే జట్టుకు అవసరమైతే భారత్‌తో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తిరిగి బరిలోకి దిగుతానని ప్రకటించాడు.
వార్నర్ ఆసీస్ తరఫున 112 టెస్ట్‌లు ఆడి 8786 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 37 అర్ద సెంచరీలు ఉన్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment