ఐపీఎల్ కు మెకల్లమ్ దూరం
హైదరాబాద్: గుజరాత్ లయన్స్ ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్, పేసర్ నాధూ సింగ్ లు గాయాలతో ఐపీఎల్ నుంచి వైదొలిగారు. ఢిల్లీతో జరిగన గత మ్యాచ్ లో తొడకండరాలు పట్టేయడంతో మెకల్లమ్ టోర్ని నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. గాయం తీవ్రం కాకుండా మూడు, నాలుగు వారాలు విశ్రాంతి తీసుకురావల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ వెల్లడించాడు.
మెకల్లమ్ ఈ సీజన్ లో 11 మ్యాచ్ లు ఆడి రెండు అర్ధ సెంచరీలతో 319 పరుగులు చేశాడు. ఇక నాధూ సింగ్ కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. గత గురువారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూండగా మెకల్లమ్ ఎడమ తొడ కండరాలు పట్టేశాయి. ఇక రాజ్ కోట్ లో కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో నడుము నొప్పితో బాధపడ్డ నాధూ సింగ్ తర్వతా ఇప్పటి వరకు ఏ మ్యాచ్ ఆడలేదు.