మొహాలీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా మంగళవారం రాత్రి కింగ్స్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే కింగ్స్ పంజాబ్ ప్లే ఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంటుంది. ఒకవేళ కాని పక్షంలో కింగ్స్ పంజాబ్ ముందుగానే టోర్నీ నుంచి నిష్ర్రమించాల్సి వస్తుంది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.
నాకౌట్‌కు చేరాలంటే మిగతా మ్యాచ్‌లన్నీ తప్పక నెగ్గాల్సిన ఒత్తిడి నెలకొన్న స్థితిలో మ్యాక్స్‌వెల్‌సేన ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్ ఖారారు చేసుకున్న కోల్‌కతా.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పట్టికలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని ఆశిస్తోంది.ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ , రైజింగ్ పుణెలు దాదాపుగా ప్లే ఆఫ్ బెర్త్‌లను ఖారారు చేసుకోగా.. మిగతా స్థానం కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తీవ్రంగా పోటీపడుతున్నాయి. వీటిలో హైదరాబాద్‌కు మంచి అవకాశముండగా.. పంజాబ్ పరిస్థితి మాత్రం చావోరేవోలాగా మారింది. ఓవరాల్‌గా ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడిన మ్యాక్స్‌వెల్‌సేన ఐదు విజయాలు, ఆరు పరాజయాలు నమోదు చేసింది. దీంతో పట్టికలో ఐదోస్థానంలో కొనసాగుతోంది. నాకౌట్‌కు చేరుకోవాలంటే పంజాబ్ మిగతా అన్ని మ్యాచ్‌ల్లో కచ్చితంగా నెగ్గాల్సి ఉంటుంది.
కింగ్స్ పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్
Published Tue, May 9 2017 7:34 PM | Last Updated on Tue, Sep 5 2017 10:46 AM
Advertisement