'స్పెయిన్లో బీర్లు తాగండి' | Kevin Pietersen Blasts Ben Stokes, Jos Buttler for Leaving IPL Ahead of Play-offs | Sakshi
Sakshi News home page

'స్పెయిన్లో బీర్లు తాగండి'

Published Mon, May 15 2017 3:40 PM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM

'స్పెయిన్లో బీర్లు తాగండి'

'స్పెయిన్లో బీర్లు తాగండి'

న్యూఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)10 సీజన్ ను విడిచి ఉన్నపళంగా వచ్చేయమంటూ తమ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, జాస్ బట్లర్లను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఆదేశించడంపై ఆ దేశ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ తీవ్రంగా మండిపడ్డాడు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ల వరకూ వారిని అనుమతించకుండా వచ్చేయమనడం వెనుక ఈసీబీ ఉద్దేశమేమిటని పీటర్సన్ ప్రశ్నించాడు. ఇంత ఎంత మాత్రం సరైన చర్య కాదని విమర్శించాడు.

 

ఈ సీజన్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ కు బెన్ స్టోక్స్ ప్రాతినిథ్యం వహిస్తుండగా, ముంబై ఇండియన్స్ తరపున జాస్ బట్లర్ ఆడుతున్నాడు. అయితే ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాల్సిన క్రమంలో వీరిని వచ్చేయమంటూ ఈసీబీ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఐపీఎల్లో పుణె, ముంబై ఇండియన్స్ లు ప్లే ఆఫ్ కు  చేరిన సంగతి తెలిసిందే.  ఈ రెండు జట్లు ఐపీఎల్లో ప్లే ఆఫ్ కు చేరడంలో వీరి పాత్ర వెలకట్టలేనిదిగా పేర్కొన్న పీటర్సన్.. ఆ ఇద్దరి పరిస్థితి చూస్తే మనస్సును కరిగించేదిగా ఉందన్నాడు. ఈ మేరకు ట్విట్టర్ లో బెన్ స్టోక్స్, జాస్ బట్లర్లు తిరిగి స్వదేశానికి పయనం కావడంపై సెటైర్లు గుప్పించాడు.

' వారిద్దరూ ఐపీఎల్ ను విడిచి వెళ్లడం చాలా నిరుత్సాహానికి గురి చేస్తుంది. ప్లే ఆఫ్ దశలో వారిద్దరూ వెళ్లిపోవడం ఒకింత బాధగా ఉంది.. అదే సమయంలో వారి పరిస్థితి చూసి జాలి కూడా వేస్తుంది. ఇక్కడ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లు ఆడే బదులు స్పెయిన్ కు వెళ్లి బీర్లు తాగండి' అని పీటర్సన్ చమత్కరించాడు. త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ కు సంబంధించి ఇంగ్లండ్ జట్టు స్పెయన్ లో శిక్షణా శిబిరం నిర్వహించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement