'తుదిపోరులో సత్తాచాటుతా' | Rahul Tripathi Looks To Make Amends In Final Against Mumbai Indians | Sakshi
Sakshi News home page

'తుదిపోరులో సత్తాచాటుతా'

Published Sat, May 20 2017 6:33 PM | Last Updated on Tue, Sep 5 2017 11:36 AM

Rahul Tripathi Looks To Make Amends In Final Against Mumbai Indians

హైదరాబాద్: ముంబై ఇండియన్స్ తో జరిగిన క్వాలిఫయర్ -1లో నిరాశపరిచిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్ ఓపెనర్ రాహుల్ త్రిపాఠి తుది పోరులో మాత్రం సత్తాచాటుతానని ధీమా వ్యక్తం చేశాడు. ఆ మ్యాచ్ లో మెక్లీన్ గన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయిన త్రిపాఠి.. టైటిల్ పోరులో ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వనని అంటున్నాడు.

 

'నిజానికి అపజయాలే గెలుపుకు సోపానాలు. ఈ విషయాన్ని నేను బలంగా నమ్ముతా. ఓటుములతో నిరాశ చెందకుండా, మరింత కష్టపడి ముందుకు సాగాలి. ఇప్పటివరకూ నా ఐపీఎల్ ప్రయాణం సంతృప్తికరంగానే సాగింది. అదే స్ఫూర్తితో ఫైనల్లో కూడా రాణిస్తా. దిగ్గజ క్రికెటర్లతో కలిసి ఆడటం నా అదృష్టం. మహేంద్ర సింగ్ ధోని, స్టీవ్ స్మిత్ లాంటి మేటి గాళ్ల సలహాలు నాకు ఎంతో ఉపకరిస్తున్నాయి' అని రాహుల్ త్రిపాఠి తెలిపాడు. రేపు(ఆదివారం) హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో రైజింగ్ పుణె- ముంబై ఇండియన్స్ జట్ల మధ్య టైటిల్ పోరు జరుగనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement