టాస్ నెగ్గిన గంభీర్ సేన
కోల్ కతా: ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్ లో టాస్ నెగ్గిన కోల్ కతా నైట్ రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ కొంత ఆలస్యంగా ప్రారంభమయింది. అయితే కోల్ కతా జట్టులోగాయం తో బాధపడుతున్న క్రిస్ వోక్స్ స్థానంలో ట్రేంట్ బోల్ట్ ను ఎంపిక చేసింది. ఇక ముంబై ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగుతుంది. కోల్ కతాకు ఈ మ్యాచ్ సంక్లిష్టంగా మారింది. ఈ మ్యాచ్ ఓడితే పంజాబ్ మ్యాచ్ ఫలితంపై ఎదురు చూడల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక వేళ కోల్ కతా ఈ మ్యాచ్ ఓడి పంజాబ్ పుణే పై గెలిస్తే మూడు జట్లు 16 పాయింట్లతో సమంగా ఉంటాయి. అప్పుడు రన్ రేట్ కీలకం అవుతుంది.
ఇప్పటికే ముంబై ప్లే ఆఫ్ బెర్త్ ను కైవసం చేసుకోగా, కోల్ కతా సమీపంలో ఉంది. 13 మ్యచుల్లో 9 గెలిచిన ముంబై 18 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలోకొనసాగుతుండగా, కోల్కతా 8 గెలిచి మూడో స్తానంలో కొనసాగుతుంది. ఇంతకు ముందు ఇరు జట్లు ఒక సారి తలపడగా విజయం ముంబైని వరించింది. కోల్ కతా ఈ మ్యాచ్ లో ఎలాగై నెగ్గి ముంబై పై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది. అయితే వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడం ముంబైని కలవర పెడుతుంది. పంజాబ్ తో అనూహ్యాంగా ఓడిన ఇరు జట్లు ఓటములకు బ్రేక్ వేయాలని భావిస్తున్నాయి.