వర్షంతో ఆగిపోయిన సన్‌రైజర్స్‌ మ్యాచ్‌ | Rain Stops KKR Vs SRH Match  | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 14 2018 8:48 PM | Last Updated on Sat, Apr 14 2018 8:51 PM

Rain Stops KKR Vs SRH Match  - Sakshi

గ్రౌండ్‌ను కవర్లతో కప్పుతున్న సిబ్బంది

కోల్‌కతా : ఐపీఎల్‌-11 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో ఫీల్డ్‌ అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. మైదాన సిబ్బంది కవర్లతో గ్రౌండ్‌ను కప్పేశారు. ఇక అంతక ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా మ్యాచ్‌ ముగిసే సమయానికి ఏడు ఓవర్లలో ఓ వికెట్‌ నష్టపోయి 52 పరుగులు చేసింది. క్రీజులో క్రిస్‌లిన్‌ 31(20 బంతుల్లో 6 ఫోర్లు), నితీష్‌ రాణా 18 (14 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సు)లున్నారు. తొలి వికెట్‌గా రాబిన్‌ ఊతప్ప (3) భువనేశ్వర్‌ బౌలింగ్‌లో కీపర్‌ సాహాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే వర్షం నీటిని బయటకు పంపడానికి ఈడేన్‌ గార్డెన్స్‌లో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఓవర్లను కుదించైనా మ్యాచ్‌ నిర్వహించే అవకాశం ఉంది. 

ఇక ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లకు రెండు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న హైదరాబాద్‌ ఈ మ్యాచ్‌ను సైతం గెలిచి తమ విజయాత్రను కొనసాగించాలని సన్‌రైజర్స్‌ భావిస్తుండగా.. ఇక తొలి మ్యాచ్‌ గెలిచి రెండో మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఉవ్విళ్లురుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement