
టాస్ వేస్తున్న దినేశ్ కార్తీక్
కోల్‌కతా : ఐపీఎల్-11 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైటరైడర్స్‌తో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కేన్ విలియమ్సన్ కోల్‌కతాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇక ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లకు రెండు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న హైదరాబాద్‌కు అసలు పరీక్ష ఎదురుకానుంది. గెలిచిన రెండు మ్యాచ్‌లు హోం గ్రౌండ్‌లో జరగగా.. ఈ సీజన్‌లో తొలి సారి సొంతమైదానం వెలుపుల ఆడుతోంది. ఈ మ్యాచ్‌ను సైతం గెలిచి తమ విజయాత్రను కొనసాగించాలని సన్‌రైజర్స్ భావిస్తుండగా.. ఇక తొలి మ్యాచ్ గెలిచి రెండో మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఉవ్విళ్లురుతోంది.
హైదరాబాద్ జట్టులో స్పల్ప మార్పులు చోటుచేసుకోగా.. కోల్‌కతాలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ జట్టులోకి సందీప్ శర్మ స్థానంలో భువనేశ్వర్ రాగా.. కోల్‌కతాలో రింకు సింగ్, వినయ్‌కుమార్, టామ్ కుర్రాన్ స్థానంలో అండర్-19 కుర్రాళ్లు శుభ్‌మన్ గిల్, శివమ్ మావి అరంగేట్రం చేస్తున్నారు. మిచెల్ జాన్సన్ సైతం జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్ : కేన్ విలియమ్సన్(కెప్టెన్), శిఖర్ ధావన్, వృద్ధిమాన్ సాహా, మనీష్ పాండే, యూసఫ్ పఠాన్, రషీద్ ఖాన్, షకీబుల్ హసన్, దీపక్ హుడా, బిల్లీ స్టాన్‌లేక్, భువనేశ్వర్ కుమార్, సిద్దార్థ్ కౌల్
కోల్‌కతా నైట్‌రైడర్స్ : దినేశ్‌కార్తీక్ (కెప్టెన్), క్రిస్‌లిన్, సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, నితీష్ రాణా, శుభమన్ గిల్, ఆండ్రూ రస్సెల్, మిచెల్ జాన్సన్, శివమ్ మావి, పీయుష్ చావ్లా, కుల్దీప్ యాదవ్
Comments
Please login to add a commentAdd a comment