నా ఫస్ట్ లవ్ అదే: హ్యాట్రిక్ హీరో అండ్రూ!
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన తొలిమ్యాచ్‌లోనే హ్యాట్రిక్ వికెట్లు సాధించి సత్తా చాటాడు ఆస్ట్రేలియా మీడియం పేసర్ అండ్రూ టై.. రైజింగ్ పుణె సూపర్‌జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 17 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టాడు. చివరి ఓవర్లో తొలి మూడు బంతులకు వరుసగా అంకిత్ శర్మ, మనోజ్ తివారి, శార్దుల్ ఠాకూర్‌లను అవుట్ చేసి.. అండ్రూ టై హ్యాట్రిక్ సాధించాడు. అతని ధాటికి పుణెపై గుజరాత్ లయన్స్ జట్టు మంచి విజయాన్ని అందుకుంది.
అయితే, పొట్టి ఫార్మెట్ టీ-20లలో హ్యాట్రిక్ సాధించినప్పటికీ తనకు టెస్టు క్రికెట్ అంటేనే ఇష్టమని, అదే తన ఫస్ట్ లవ్ అని మ్యాచ్ తర్వాత అండ్రూ టై చెప్పాడు. 'ఇది (టీ20) క్రికెట్‌లో మంచి ఫార్మెటే. కానీ సంప్రదాయంగా టెస్టు క్రికెట్ ఆడటమే నాకు ఇష్టం. స్లోవర్ బాల్ పిచ్ చాలా బాగా ఉపయోగపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిచ్‌లు వేటికవే భిన్నంగా ఉంటాయి. అక్కడి పరిస్థితులను అర్థం చేసుకొని ఎలా బౌలింగ్ చేయాలో అంచనా వేస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చు' అని 30 ఏళ్ల అతను మీడియాతో చెప్పాడు.
సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ను బద్రీ వణికించాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో బద్రీ ‘హ్యాట్రిక్’ సాధించడంతో ముంబై తీవ్ర ఇబ్బందుల్లో పడింది. బద్రీ ధాటికి వరుస బంతుల్లో పార్థివ్ (3), మెక్లీనగన్ (0), రోహిత్ (0) పెవిలియన్ చేరారు. ఆ తర్వాత నితీశ్ రాణా (11)ను కూడా అవుట్ చేసి బద్రీ తన ఖాతాలో నాలుగో వికెట్‌ను వేసుకున్నాడు. విజయంపై బెంగళూరు ఆశలు పెట్టుకున్న ఈ దశలో పొలార్డ్, కృనాల్ పాండ్యా భాగస్వామ్యం ముంబైకి మళ్లీ ఊపిరి పోసింది. వీరిద్దరు ఫోర్లు, సిక్సర్లతో దూకుడు ప్రదర్శించారు. పొలార్డ్ అవుటయ్యాక కృనాల్‌కు హార్దిక్ (9 నాటౌట్) అండగా నిలవడంతో ముంబై 7 బంతులు ఉండగానే గెలిచింది.