దుబాయ్: కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు ఓడిపోయింది. బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల లక్ష్య ఛేదనను ఆఖరి బంతికి ఫినిష్ చేశారు పంజాబ్. ఐతే ఈ మ్యాచ్‌లో ఏబీ డివీలియర్స్ ఆరవ స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అతడి కంటే ముందు వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబెను ఆడించారు. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లి ఈ విషయంపై మాట్లాడాడు. 'లెఫ్ట అండ్ రైట్ కాంబినేషన్ ఉండాలనే ఏబీని ఆరవ స్థానంలో ఆడించాల్సి వచ్చింది. పంజాబ్‌లో ఇద్దరు లెగ్ స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి వారిని టార్గెట్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాము. 170 పరుగులు చేయడం సంతృప్తిగా ఉంది. పంజాబ్ బ్యాట్స్‌మెన్ ఆటతీరు చూసి 19వ ఓవర్లోనే మ్యాచ్ పూర్తి అవుతుందని అనుకున్నా. కానీ ఆఖరి బంతి వరకు బౌలర్లు పోరాడారు. ఆఖరి ఓవర్‌లో చాహల్‌తో ఎలాంటి చర్చ జరపలేదు' అని కోహ్లి పేర్కొన్నాడు.
ఏబీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 77 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏబీ 2 (5) పరుగులకే ఔటయ్యాడు. ఇప్పుడున్న ఫామ్‌కు ఏబీ తన స్థానంలో ఆడుంటే జట్టు స్కోర్ 200 పరుగులు దాటేదని విశ్లేకలు అంటున్నారు. కాగా పంబాబ్ జట్టు చివరి ఓవర్‌లో రెండు పరుగులు చేయాల్సి ఉండగా చాహల్ వేసిన మొదటి ఐదు బంతులకు కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. ఐదో బంతికి గేల్ రన్ ఔట్ అయ్యాడు. చివరి బంతికి పూరన్ సిక్స్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.
అందుకే ఆరో స్థానంలో ఆడించాం: కోహ్లి
Published Fri, Oct 16 2020 9:39 AM | Last Updated on Fri, Oct 16 2020 12:34 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment