
ఆరోన్ ఫించ్ (ఫైల్ ఫొటో)
బెంగళూరు : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక జట్లకు ప్రాతినిథ్యం వహించిన తొలి ఆటగాడిన ఫించ్ గుర్తింపు పొందాడు. బెంగళూరు వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌తో ఈ ఆసీస్ బ్యాట్స్‌మన్ ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఫించ్ తర్వాత ఆరు జట్లకి ప్రాతినిథ్యం వహించిన పార్థీవ్ పటేల్, తిసారా పెరీరా, దినేశ్ కార్తీక్‌లున్నారు.
ఫించ్ తొలిసారిగా 2010లో రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగాడు. 2011-12లో ఢిల్లీ డేర్ డేవిల్స్, 2013లో అప్పటి జట్టు పుణెవారియర్స్, 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్, 2015లో ముంబై ఇండియన్స్ తరుఫున ఆడాడు. ఇక 2016లో ఫించ్‌ను గుజరాత్ లయన్స్ కొనుగోలు చేసుకోగా.. గాయంతో ఆసీజన్‌కు దూరమయ్యాడు. 2017లోను గుజరాత్ జట్టులోనే కొనసాగాడు. ఈ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున బరిలోకి దిగాడు. వివాహం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన ఫించ్ తాజా మ్యాచ్‌తో తుదిజట్టులోకి వచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment