
ఆనందంలో ఆర్సీబీ ఆటగాళ్లు
బెంగళూరు : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌పంజాబ్ 155 పరుగులకే కుప్పకూలింది. దీంతో బెంగళూరుకు సాధారణ లక్ష్యం నమోదైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్ కేఎల్ రాహుల్ తొలి మ్యాచ్ జోరునే కొనసాగించడంతో శుభారంభం దక్కింది. అయితే పేసర్ ఉమేశ్ యాదవ్(3-23) దాటికి ఆ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఉమేశ్ వేసిన నాలుగో ఓవర్ తొలి బంతికి ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (15; 11 బంతుల్లో 3 ఫోర్లు) కీపర్ డికాక్ అద్బుత క్యాచ్‌కు వెనుదిరగగా.. రెండో బంతికి హిట్టర్ ఆరోన్ ఫించ్ గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఇక చివరి బంతికి యువరాజ్ సింగ్ (4) దారుణంగా విఫలమయ్యాడు.
కొనసాగిన రాహుల్ జోరు
ఓ వైపు వికెట్లు పడుతున్నా రాహుల్ తనదైన శైలిలో వేగంగా ఆడుతూ.. స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ఈ తరుణంలో రాహుల్ 47(30 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులు) వాషింగ్టన్ సుందర్ అద్భుత బంతికి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగి తృటిలో హాఫ్ సెంచరీ మిస్సయ్యాడు. ఆ వెంటనే పంజాబ్.. కరుణ్ నాయర్ 29 (26 బంతుల్లో 3 ఫోర్లు), స్టోయినిస్11(9 బంతులు, 1 సిక్సు), అక్షర్ పటేల్(2)ల వికెట్లు స్వల్ప వ్యవధిలోనే కోల్పోయింది. ఇక వీటిలో రెండు వికెట్లను బెంగళూరు రివ్యూల ద్వారా సాధించడం విశేషం. దీంతో భారీ స్కోర్ సాధిస్తుందనుకున్న పంజాబ్ ఒక్కసారిగా కుదేలైంది. చివర్లో కెప్టెన్ అశ్విన్ 33(20 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్సు) పర్వాలేదనిపించినా పంజాబ్ కోలుకోలేకపోయింది. 19.2 ఓవర్లకు 155 పరుగులకు ఆలౌట్ అయింది. బెంగళూరు బౌలర్లలో ఉమేశ్ యాదవ్‌కు మూడు వికెట్లు, కెజ్రోలియా, సుందర్, క్రిస్ వోక్స్‌లకు రెండేసి వికెట్లు దక్కగా.. చహల్‌లకు ఓ వికెట్ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment