
మొహాలి: వేలి గాయం నుంచి కోలుకోకపోవడంతో తమిళనాడు స్పిన్నర్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఆటగాడు వరుణ్ చక్రవర్తి ఐపీఎల్‌కు దూరమయ్యాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆకట్టుకున్న 27 ఏళ్ల లెగ్ స్పిన్నర్ వరుణ్‌ను... పంజాబ్ వేలంలో ఏకంగా రూ. 8 కోట్ల 40 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే, గాయం కారణంగా అతడిని ఎక్కువ మ్యాచ్‌లు ఆడించలేక పోయింది.
గత నెలలో కోల్‌కతాపై మ్యాచ్‌కు బరిలో దించగా వరుణ్ వికెట్ పడగొట్టి 35 పరుగులిచ్చాడు. ‘వరుణ్ కోలుకుని చివరి మ్యాచ్‌లకైనా అందుబాటులో ఉంటాడని ఆశించాం. కానీ, అలా జరగలేదు. దీంతో ఇంటిబాట పట్టాడు. అతడు త్వరగా కోలుకుని తర్వాత జరిగే టోర్నీల్లో రాణించాలని ఆకాంక్షిస్తున్నాం’ అని కింగ్స్ ఎలెవెన్ ఓ ప్రకటనలో పేర్కొంది.