
వీరేంద్ర సెహ్వాగ్, ప్రీతి జింతా
న్యూఢిల్లీ : కింగ్స్ పంజాబ్ జట్టు కోచ్ వీరేంద్ర సెహ్వాగ్, యజమాని ప్రీతిజింతాల మధ్య వివాదం తలెత్తిందంటూ వచ్చిన వార్తలను ప్రీతి ఖండించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. అసత్య కథనాలను ప్రచురించొద్దంటూ మీడియాపై ఫైర్ అయ్యారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ ఓటమికి సెహ్వాగ్‌ను బాధ్యుడిని చేస్తూ జింతా తీవ్ర విమర్శలు చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి.
తనకి సెహ్వాగ్‌కు మధ్య ఏదో వాగ్వాదం జరిగిందని, తనని విలన్‌ను చేసి చూపిస్తూ వార్తలు రాయడంపై తీవ్రంగా మండిపడ్డారు. జింతా ట్వీట్ అనంతరం కింగ్స ఎలెవన్ పంజాబ్ సైతం ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ప్రీతి జింతా-సెహ్వాగ్‌ల మధ్య వివాదం చెలరేగిందంటూ వచ్చిన వార్తలు సత్యదూరమని పేర్కొంది. ఎవరో కొందరు కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment