ప్రీతితో చిందేయడానికి గేల్‌ రెడీ! | Chris Gayle Prepares Bhangra Dance  | Sakshi
Sakshi News home page

పంజాబీ డ్యాన్స్‌తో అదరగొట్టిన గేల్‌!

Published Sun, Apr 1 2018 4:16 PM | Last Updated on Sun, Apr 1 2018 4:16 PM

Chris Gayle Prepares Bhangra Dance  - Sakshi

క్రిస్‌ గేల్‌

ముంబై :  వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌ ఈ సీజన్‌ ఐపీఎల్‌లో పరుగుల సునామీ సృష్టించేందుకు సిద్దమయ్యాడు. బ్యాట్‌తోనే కాకుండా తన ఆట పాటతో అలరించే గేల్‌ను కొనుగోలు చేసేందుకు తొలుత ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చలేదు. రెండు సార్లు అతను ఆన్‌సోల్డ్‌ ప్లేయర్‌గా మిగిలిపోయాడు. చివర్లో కింగ్స్‌ పంజాబ్‌ సహా యజమాని ప్రీతిజింతా కనికరించడంతో ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌కు ఈ సీజన్‌ ఐపీఎల్‌ ఆడే అవకాశం లభించింది.

ఈ నేపథ్యంలో పంజాబీ స్టైల్‌లో అలరించేందుకు గేల్‌ సిద్దమవుతున్నాడు. ఓ పంజాబీ సాంగ్‌కు డ్యాన్స్‌ చేసిన వీడియోను ‘భారత్‌కు వస్తున్నా.. పంజాబీ స్టైల్‌లో అలరిస్తా’ అనే క్యాప్షన్‌తో తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అయింది. 

ఇప్పటి వరకు బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన గేల్‌ గత సీజన్‌లో విఫలమయ్యాడు. దీంతో ఏ ఫ్రాంచైజీ గేల్‌పై ఆసక్తి కనబర్చలేదు. అయితే ప్రపంచకప్‌ క్వాలిఫైయర్‌ టోర్నీలో ఈ జమైకన్‌ స్టార్‌ పరుగుల సునామీ సృష్టించి ఫామ్‌లోకి వచ్చాడు. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 11 సిక్సులతో శతకం సాధించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement