Fans Fires on Yuvraj Singh Over low Strike Rate - Sakshi
Sakshi News home page

యువీ.. ఇక ‘నీకదే గతి’

Published Sat, May 5 2018 3:04 PM | Last Updated on Sat, May 5 2018 4:50 PM

Yuvraj Singh Registers Unwanted Record - Sakshi

యువరాజ్‌ సింగ్‌

ఇండోర్‌ : టీమిండియా విధ్వంసకర బ్యాట్స్‌మన్‌, కింగ్స్‌ పంజాబ్‌ స్టార్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌పై అభిమానులు సోషల్‌ మీడియాలో కుళ్లు జోకులు పేల్చుతున్నారు. ఐపీఎల్‌-11 సీజన్‌లో ఈ సిక్సర్ల సింగ్‌ నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో యువీ దారుణంగా విఫలమయ్యాడు. 14 బంతుల్లో 14 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో యువరాజ్‌ ఈ సీజన్‌లో అత్యల్ప స్ట్రైక్‌ రేట్‌(91.42) కలిగిన బ్యాట్స్‌మన్‌(50 అంతకంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్న ఆటగాళ్లలో)గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.

మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన యువీ కేవలం 64 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఈ సీనియర్‌ ఆటగాడిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువరాజ్‌ను జట్టు నుంచి తీసేయాలని కోరుతున్నారు. ఇంకొందరైతే మహ్మద్‌ కైఫ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ల సరసన చేరి కామెంటరీ చెప్పుకో అని ఘాటుగా విమర్శిస్తున్నారు. యువీ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడమే ఉత్తమమని, అతని ఆటను చూడలేకపోతున్నామని మరో అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు. కెంట్‌ వాటర్‌ ప్యూరిఫై ప్రకటనలో తప్ప యువరాజ్‌ ఈ సీజన్‌లో బౌండరీ సాధించడం చూడలేదని ఓ అభిమాని సెటైర్‌ వేశాడు. ఇక యువరాజ్‌ కెరీర్‌ ముగిసినట్లేనని క్రీడా విశ్లేషకులు భావిస్తుండగా..యువీకి మరో అవకాశం ఇవ్వాలని, అతనేంటో చూపిస్తాడని కొందరు మద్దతు తెలుపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement