రోహిత్‌ కంటే రాహుల్‌ బెస్ట్‌.! | KL Rahul To Replace Rohit Sharma As Team India Opener | Sakshi
Sakshi News home page

Published Mon, May 7 2018 4:30 PM | Last Updated on Mon, May 7 2018 8:19 PM

KL Rahul To Replace Rohit Sharma As Team India Opener - Sakshi

రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ (ఫైల్‌ ఫొటో)

ఇండోర్‌ : టీమిండియా ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ బదులు కేఎల్‌ రాహుల్‌ తీసుకోవాలని అభిమానులు  సోషల్‌ మీడియా వేదికగా డిమాండ్‌ చేస్తున్నారు. ఐపీఎల్‌-11 సీజన్‌లో కేఎల్‌ రాహుల్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఆదివారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కడదాక నిలిచి కింగ్స్‌ పంజాబ్‌ను గెలిపించిన రాహుల్‌పై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. టీమిండియా ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ కన్నా రాహులే బెస్ట్‌ అని కొంతమంది అభిప్రాయపడుతుండగా.. రాహుల్‌ను ఓపెనర్‌గా పంపించి రోహిత్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలని మరి కొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఇంకొందరైతే రాహుల్‌ను ఓపెనర్‌గా ఆడించకపోతే 2019 ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ పరిస్థితి అంతేనని హెచ్చరిస్తున్నారు. అసలు ఇంత బాగా రాణిస్తున్న కేఎల్‌ రాహుల్‌ను జట్టులోకి ఎందుకు తీసుకోవడంలేదని నిలదీస్తున్నారు. మరోసారి రోహిత్‌ను ఎంపిక చేసి బీసీసీఐ మరో తప్పు చేయవద్దని కోరుతున్నారు.

ఈ సీజన్‌లో కేఎల్‌ రాహుల్‌ రెచ్చిపోతూ.. కింగ్స్‌ పంజాబ్‌ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే రికార్డు హాఫ్‌ సెంచరీ నమోదు చేసిన ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్‌ 9 మ్యాచ్‌ల్లో మొత్తం మూడు అర్థ సెంచరీలతో 376 పరుగులు చేశాడు. ఇక ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ సీజన్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేదు. అనూహ్యంగా బ్యాటింగ్‌ ఆర్డర్‌ మార్చిన రోహిత్‌ అనుకున్న మేరకు రాణించలేకపోయాడు.10 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే మెరిసాడు. రెండు హాఫ్‌ సెంచరీలతో 231 పరుగులు మాత్రమే చేశాడు. ముంబై ఓపెనింగ్‌ అవకాశం అందిపుచ్చుకున్న యువ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ రాణిస్తున్నాడు. దీంతో రోహిత్‌ స్థానంలో టీమిండియా ఓపెనర్‌గా కేఎల్‌ రాహుల్‌ను తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement