'స్పాట్ ఫిక్సింగ్ తో మాకు సంబంధం లేదు'
న్యూఢిల్లీ : ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో హస్తం ఉందని తనపై వచ్చిన ఆరోపణలను కింగ్స్ ఎలెవన్ జట్టు సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఖండించారు. ఐపీఎల్ గ్రూప్ మీటింగ్ తర్వాత ఆగస్టు 8న బీసీసీఐ అధికారులకు కొన్ని విషయాలను వెల్లడించినట్లు కథనాలు వచ్చాయి. కింగ్స్ ఎలెవన్ జట్టు ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్ చేశారని బీసీసీఐ సమావేశంలో ప్రీతి అనుమానాలు వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తలపై ఆమె మండిపడింది. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, కోశాధికారి అనిరుద్ చౌదరి, భారత మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ సభ్యులు ఉన్న వర్కింగ్ గ్రూపు సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారని మీడియాలో కథనాలు వచ్చాయి.
ఇదిలాఉండగా, తాను బీసీసీఐ అధికారులకు చెప్పిన విషయాలను మీడియా వక్రీకరించిందని, వీటిపై మండిపడుతూ సోషల్ మీడియా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అవసరమైతే మా జట్టు ఆటగాళ్లను లై డిటెక్టర్ తో పరీక్షించండి. నేనైతే ఎవరూ ఫిక్సింగ్ చేశారని భావించడం లేదంటూ జట్టు ఆటగాళ్లపై తన నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ఆ కథనాలు పూర్తిగా బాధ్యతా రాహిత్యమైనవని, తప్పుడు వార్తలని ఆమె ట్వీట్ చేశారు.
Dear All, This piece of article is completely false, libel per say, inaccurate and an irresponsible piece of... http://t.co/x0pURYfKVw
— Preity zinta (@realpreityzinta) August 19, 2015
I suggested RANDOM POLYGRAPH ( LIE DETECTOR) Tests to Bcci for players so no can even think about match fixing. The theory was that ... 1/1
— Preity zinta (@realpreityzinta) August 19, 2015