రాజ్‌పుత్‌ను అభినందిస్తున్న పంజాబ్ ఆటగాళ్లు
హైదరాబాద్: ఐపీఎల్-11 సీజన్‌లో కింగ్స్ పంజాబ్ యువ బౌలర్ అంకిత్ రాజ్‌పుత్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొట్టిన ఈ యువ ఆటగాడు (5/14) ఈ సీజన్‌లో ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఐదు వికెట్లు సాధించిన తొలి భారత అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేగాకుండా ఐదు వికెట్లు సాధించిన రెండో భారత బౌలర్‌గా గుర్తింపు పొందాడు. అంతకు ముందు ఇషాంత్ శర్మ (5/11) ఐపీఎల్ 2011 సీజన్ తొలి సారి ఈ ఘనతను నమోదు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో రాజ్‌పుత్ వేసిన ప్రతి ఓవర్‌లో వికెట్ సాధించడం ఇక్కడ విశేషం. దీంతో ఇప్పటి వరకు అత్యత్తుమ ప్రదర్శన జాబితాలో తొలి స్థానంలో ఉన్న ముంబై ఆటగాడు మయాంక్ మార్కండే(4/23)ను రాజ్‌పుత్ తాజా ప్రదర్శనతో అధిగమించాడు.
ఐపీఎల్ అంత ఈజీ కాదు: రాజ్‌పుత్
ఇక మ్యాచ్ అనంతరం రాజ్‌పుత్ మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ అంత సులువైనదిగా నేను భావించడంలేదు. ప్రతి ఆటగాడు చాల కష్టపడి రాణిస్తున్నారు. నేను వికెట్లు తీసీ నా బౌలింగ్‌తో రాణించా. మంచి ప్రణాళికతో వచ్చి విజయవంతమయ్యా. ఇది నారోజు కావడంతో ఐదు వికెట్లు దక్కాయి.’’ అని తెలిపాడు. ఇక పంజాబ్ బ్యాట్స్‌మెన్ రాజ్‌పుత్ జోరును కొనసాగించలేకపోయారు. సన్‌రైజర్స్ బౌలర్ల దాటికి చేతులెత్తయడంతో.. పంజాబ్ స్పల్ప స్కోర్‌ను చేధించలేక 13 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.
Comments
Please login to add a commentAdd a comment